Menu

        To Read Rera Act, 2016, select Muncipal related, scroll down and select RERA Act

Grama Sabha Rules in Telugu

ఆంద్రప్రదేశ్ ప్రభుత్వము
సంక్షిప్తి

రాజీవ్ గాందీ పంచాయతీ సశక్తీకరణ అభియాన్ (ఆర్.జి.పి.ఎస్.ఎ) – గ్రామసభల నిర్వహణ – రాజ్యంగ (73వ సవరణ) చట్టం క్రింద – పంచాయతీ రాజ్ సంస్థలకు అప్పగించిన 29 అంశాలకు చెందిన కర్తవ్యాల నిర్వహణ / కార్యకలాపాల అమలుకు సంబంధించి క్షేత్రస్థాయి సిబ్బంది అందరూ పాల్గొనడం - ఉత్తర్వులు – జారీచేయడమయింది.

_____________________________________________________________
సాధారణ పరిపాలన (సాధారణ/ శాసన మండలి సమన్వయం) శాఖ


జి.ఓ.ఎం.ఎస్.నెం. 791
తేదిః 07.11.2013.

ఈక్రింది వాటిని చదవండి;


  1. జి.ఒ.ఎం.ఎస్.నెం.162. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి (పంచాయతీలు.1) శాఖ తేదీ: 4.04.1997
  2. కమీషనర పి.ఆర్& ఆర్.ఇ హైదరాబాదు గారి నుండి లేఖ.నెం.3806/డి3/2009. తేదీ 20.09.2013, 30.09.2013 లుగలవి.

@@@

ఉత్తర్వులుః

భారత రాజ్యాంగలోని 243 (ఎ) పరిచ్ఛేదం గ్రామసభకు కొన్ని శాసనబద్ద అధికారాలను అప్పగించడం ద్వారా గ్రామసభ సాధికారతకు రాష్ట్ర విధాన మండళ్లకు వీలు కల్పించింది. 1994, ఎ.పి.పి.ఆర్ చట్టంలోని 45, 161, 192 విభాగం అనుబంధం-Iలో పేర్కొన్నట్లుగా పంచాయతీరాజ్ సంస్థలకు నిర్దిష్ట అధికారాలను అప్పగించాయి. గామసభ ఒక రాజ్యాంగబద్ద సంస్థ. స్థానిక పరిపాలన వ్యవస్థలో ప్రజాస్వామిక అధికారానికి కేంద్రబింధువుగా ఉంది. గ్రామీణ అభివృద్ధి, వికేంద్రీకృత ప్రణాళికకు ప్రాతిపదిక యూనిట్-గా ఉంది. గ్రామంలలోని వివిధ అభివృద్ధి కార్యకలాపాలలో ప్రజలు పాల్గొనడానికి, పర్యవేక్షించడానికి, సంబంధిత గ్రామం(లు)కు చెందిన ఏదేని అంశాన్ని ప్రస్తావించడానికి, క్రిందిస్థాయిలో పంచాయతీరాజ్ సంస్థలు, సంబంధిత శాఖల పనితీరులో పారదర్శకత, జవాబుదారీతనం ఉండేటట్లు చూడడానికి గ్రామసభ ఒక వేదికగా వ్యవహరిస్తుంది. ప్రభుత్వ శాఖలు/ సంస్థలు, పంచాయతీ రాజ్ సంస్థలు చేపట్టిన కార్యకాలాపాలపై సామాజిక ఆడిటును నిర్వహించడం కోసం గ్రామీణ స్థాయిలో గ్రామసభ అత్యంత సముచిత, పటిష్టవంతమైన సంస్థగా కూడా ఉంది. సాధికారత కల్పించినప్పుడు, సామాజిక ఆర్థిక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమముల ప్రణాళిక, అమలు కోసం పారదర్శకత, జవాబుదారీతనం, సహకారానికి గ్రామీణ స్థాయి వేదికగు వ్యవహరిస్తూ గ్రామసభ స్థానిక స్థాయిలో ప్రభుత్వములో పారదర్శకత, జవాబుదారీతనం సంస్కృతిని ప్రవేశపెట్టె సమర్దతను కలిగి ఉంది.

2. పై 2వ నిర్దేశంలో, ఆంధ్రప్రదేశ్-లోని ప్రతి గ్రామ పంచాయతీ సంవత్సరంలో కనీసం రెండు సార్లు గ్రామసభను శాసనబద్ధంగా సమావేశ పరచాలని పేర్కోంటూ హైదరాబాదులోని ఆంధ్రప్రదేశ్ పి.ఆర్ & ఆర్. ఇ కమీషనరు తగు విధముగా ప్రతిపాదనలు సమర్పించారు, 1994, ఎ.పి.పి.ఆర్ చట్టం ప్రకారం గ్రామసభ సమావేశాన్ని నిర్వహించడం కోసం సంవత్సరంలో రెండు సాధారణ తేదీలను అంటే ఏప్రియల్, 14, అక్టోబరు, 3వతేదీలను నిర్ణయించడమయింది అందులో గ్రామ పంచాయతీ సర్పంచి గ్రామసభ సమావేశాన్ని నిర్వహిస్తారు. అయితే, కేంద్రప్రభుత్వం ఆదేశాలను అనుసరించి సంవత్సరములో 4సార్లు అంటే (1) జనవరి, (2) ఎప్రిల్ 14వ తేదీ, (3) జూలై 1వ తేదీ, (4) అక్టబరు 3వ తేదీలలో గ్రామసభలను నిర్వహించడానికి 06.06.2011 తేదీగల పి.ఆర్ & ఆర్.ఇ కార్యాలయ మెమో.నెం.3806/ సి.పి.ఆర్& ఆర్.ఇ/ డి2/ 2009 ద్వారా పంచాయతీరాజ్ కమీషనరు జిల్లా పంచాయతీ అధికారులందరికీ సర్కూలరు ఆదేశాలు జారీచేయడమయింది.

3. భారత రాజ్యాంగంలోని 243(ఎ) పరిచ్ఛదాన్ని పురస్కరించుకుని, గ్రామసభను 1994, ఎ.పి.పి.ఆర్ చట్టంలోని 6వ విభాగం క్రింద చేర్చడమయింది. సదరు విభాగము ప్రకారం, గ్రామసభలో చర్చించడానికి సంబంధించిన అంశాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

  1. వార్షిక లెక్కలు వివరణ పట్టిక, ఆడిటు నివేదిక
  2. గత సంవత్సర పరిపాలనపై నివేదిక
  3. ఆ సంవత్సరం కోసం పనులు కార్యక్రమం లేదా బడ్జెటు లెదా వార్షక కార్యక్రమం వర్తించని ఏదేని కొత్త కార్యక్రమం
  4. తాజా పన్ను విధింపు కోసం లేదా ప్రస్తుతమున్న పన్నుల పెంపుదల కోసం ప్రతిపాదనలు
  5. పథకాలు, లబ్దిదారులు, స్థలాల ఎంపిక
  6. నిర్ణయించదగునట్టి ఇతర అంశాలు

పై జాబితాలోని అంశాలకు అదనంగా, పైన పేర్కొన్న 1వ నిర్దేశంలోని జి.ఓ.లో జారీచేసిన ఉత్తర్వులను అనుసరించి ఈక్రింది అంశాలను కూడా గ్రామసభ సమక్షంలో ఉంచడమవుతుంది.


Contd.Page. 2.
Pages: 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16

1 comment:

  1. Namaste sir memu iddaram anna thammullam rendu portionla ummadi intini kalgi vunnam annaku 1000rs= tax vasool cheste naa thammuniki 200rs vesthunnaru annaga nenu emi cheyali

    ReplyDelete

Featured Post

Fixation of Mutation Fee in Gram Panchayats in the State

GOVERNMENT OF TELANGANA ABSTRACT Panchayat Raj & Rural Development Department – Mutation Fee – Fixation of Mutation Fee ...

Popular Posts