Menu

Requested to Donate, to receive required documents through e-mail. To donate click Pay Now Follow to receive updates by email.

Tuesday, June 26, 2018

Sandyavandanam






నిత్య సంధ్యా వందనం!



రచన: విశ్వామిత్ర మహర్షి


శరీర శుద్ధి

అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాం” గతోஉపివా |
యః స్మరేత్ పుండరీకాక్షం స బాహ్యాభ్యంతర శ్శుచిః ||
పుండరీకాక్ష ! పుండరీకాక్ష ! పుండరీకాక్షాయ నమః |
ఆచమనః
ఓం ఆచమ్య
ఓం కేశవాయ స్వాహా
ఓం నారాయణాయ స్వాహా
ఓం మాధవాయ స్వాహా (ఇతి త్రిరాచమ్య)
ఓం గోవిందాయ నమః (పాణీ మార్జయిత్వా)
ఓం విష్ణవే నమః
ఓం మధుసూదనాయ నమః (ఓష్ఠౌ మార్జయిత్వా)
ఓం త్రివిక్రమాయ నమః
ఓం వామనాయ నమః (శిరసి జలం ప్రోక్ష్య)
ఓం శ్రీధరాయ నమః
ఓం హృషీకేశాయ నమః (వామహస్తె జలం ప్రోక్ష్య)
ఓం పద్మనాభాయ నమః (పాదయోః జలం ప్రోక్ష్య)
ఓం దామోదరాయ నమః (శిరసి జలం ప్రోక్ష్య)
ఓం సంకర్షణాయ నమః (అంగుళిభిశ్చిబుకం జలం ప్రోక్ష్య)
ఓం వాసుదేవాయ నమః
ఓం ప్రద్యుమ్నాయ నమః (నాసికాం స్పృష్ట్వా)
ఓం అనిరుద్ధాయ నమః
ఓం పురుషోత్తమాయ నమః
ఓం అధోక్షజాయ నమః
ఓం నారసింహాయ నమః (నేత్రే శ్రోత్రే చ స్పృష్ట్వా)
ఓం అచ్యుతాయ నమః (నాభిం స్పృష్ట్వా)
ఓం జనార్ధనాయ నమః (హృదయం స్పృష్ట్వా)
ఓం ఉపేంద్రాయ నమః (హస్తం శిరసి నిక్షిప్య)
ఓం హరయే నమః
ఓం శ్రీకృష్ణాయ నమః (అంసౌ స్పృష్ట్వా)
ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః
(ఏతాన్యుచ్చార్య ఉప్యక్త ప్రకారం కృతే అంగాని శుద్ధాని భవేయుః)

భూతోచ్చాటన
ఉత్తిష్ఠంతు | భూత పిశాచాః | యే తే భూమిభారకాః | యే తేషామవిరోధేన | బ్రహ్మకర్మ సమారభే | ఓం భూర్భువస్సువః |
దైవీ గాయత్రీ చందః ప్రాణాయామే వినియోగః

(ప్రాణాయామం కృత్వా కుంభకే ఇమం గాయత్రీ మంత్రముచ్ఛరేత్)

ప్రాణాయామః
ఓం భూః | ఓం భువః | ఓగ్‍మ్ సువః | ఓం మహః | ఓం జనః | ఓం తపః | ఓగ్‍మ్ సత్యమ్ |
ఓం తథ్స’వితుర్వరే”ణ్యం భర్గో’ దేవస్య’ ధీమహి |
ధియో యో నః’ ప్రచోదయా”త్ ||
ఓమాపో జ్యోతీ రసో‌உమృతం బ్రహ్మ భూ-ర్భువ-స్సువరోమ్ || (తై. అర. 10-27)

సంకల్పః
మమోపాత్త, దురిత క్షయద్వారా, శ్రీ పరమేశ్వర ముద్దిస్య, శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం, శుభే, శోభనే, అభ్యుదయ ముహూర్తే, శ్రీ మహావిష్ణో రాఙ్ఞయా, ప్రవర్త మానస్య, అద్య బ్రహ్మణః, ద్వితీయ పరార్థే, శ్వేతవరాహ కల్పే, వైవశ్వత మన్వంతరే, కలియుగే, ప్రథమ పాదే, (భారత దేశః – జంబూ ద్వీపే, భరత వర్షే, భరత ఖండే, మేరోః దక్షిణ/ఉత్తర దిగ్భాగే; అమేరికా – క్రౌంచ ద్వీపే, రమణక వర్షే, ఐంద్రిక ఖండే, సప్త సముద్రాంతరే, కపిలారణ్యే), శోభన గృహే, సమస్త దేవతా బ్రాహ్మణ, హరిహర గురుచరణ సన్నిథౌ, అస్మిన్, వర్తమాన, వ్యావహారిక, చాంద్రమాన, … సంవత్సరే, … అయనే, … ఋతే, … మాసే, … పక్షే, … తిథౌ, … వాసరే, … శుభ నక్షత్ర, శుభ యోగ, శుభ కరణ, ఏవంగుణ, విశేషణ, విశిష్ఠాయాం, శుభ తిథౌ, శ్రీమాన్, … గోత్రః, … నామధేయః, … గోత్రస్య, … నామధేయోహంః ప్రాతః/మధ్యాహ్నిక/సాయం సంధ్యామ్ ఉపాసిష్యే ||

మార్జనః
ఓం ఆపోహిష్ఠా మ’యోభువః’ | తా న’ ఊర్జే ద’ధాతన | మహేరణా’య చక్ష’సే | యో వః’ శివత’మో రసః’ | తస్య’ భాజయతే హ నః | ఉశతీరి’వ మాతరః’ | తస్మా అర’ంగ మామ వః | యస్య క్షయా’య జిన్వ’థ | ఆపో’ జనయ’థా చ నః | (తై. అర. 4-42)


(ఇతి శిరసి మార్జయేత్)
(హస్తేన జలం గృహీత్వా)

ప్రాతః కాల మంత్రాచమనః

సూర్య శ్చ, మామన్యు శ్చ, మన్యుపతయ శ్చ, మన్యు’కృతేభ్యః | పాపేభ్యో’ రక్షంతామ్ | యద్రాత్ర్యా పాప’ మకార్షమ్ | మనసా వాచా’ హస్తాభ్యామ్ | పద్భ్యా ముదరే’ణ శిశ్ంచా | రాత్రి స్తద’వలుంపతు | యత్కించ’ దురితం మయి’ | ఇదమహం మా మమృ’త యో నౌ | సూర్యే జ్యోతిషి జుహో’మి స్వాహా” || (తై. అర. 10. 24)

మధ్యాహ్న కాల మంత్రాచమనః
ఆపః’ పునంతు పృథివీం పృ’థివీ పూతా పు’నాతు మామ్ | పునంతు బ్రహ్మ’ణస్పతి ర్బ్రహ్మా’ పూతా పు’నాతు మామ్ | యదుచ్ఛి’ష్ట మభో”జ్యం యద్వా’ దుశ్చరి’తం మమ’ | సర్వం’ పునంతు మా మాపో’‌உసతా ంచ’ ప్రతిగ్రహగ్గ్ స్వాహా” || (తై. అర. పరిశిష్టః 10. 30)

సాయంకాల మంత్రాచమనః
అగ్ని శ్చ మా మన్యు శ్చ మన్యుపతయ శ్చ మన్యు’కృతేభ్యః | పాపేభ్యో’ రక్షంతామ్ | యదహ్నా పాప’ మకార్షమ్ | మనసా వాచా’ హస్తాభ్యామ్ | పద్భ్యా ముదరే’ణ శిశ్ంచా | అహ స్తద’వలుంపతు | య త్కించ’ దురితం మయి’ | ఇద మహం మా మమృ’త యోనౌ | సత్యే జ్యోతిషి జుహోమి స్వాహా || (తై. అర. 10. 24)

(ఇతి మంత్రేణ జలం పిబేత్)
ఆచమ్య (ఓం కేశవాయ స్వాహా, … శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమో నమః)

ద్వితీయ మార్జనః
దధి క్రావణ్ణో’ అకారిషమ్ | జిష్ణో రశ్వ’స్య వాజి’నః |
సురభినో ముఖా’కరత్ప్రణ ఆయూగ్‍మ్’షి తారిషత్ ||

(సూర్యపక్షే లోకయాత్రా నిర్వాహక ఇత్యర్థః)

ఓం ఆపో హిష్ఠా మ’యోభువః’ | తా న’ ఊర్జే ద’ధాతన | మహేరణా’య చక్ష’సే | యో వః’ శివత’మో రసః’ | తస్య’ భాజయతే హ నః | ఉశతీరి’వ మాతరః’ | తస్మా అర’ంగ మామ వః | యస్య క్షయా’య జిన్వ’థ | ఆపో’ జనయ’థా చ నః || (తై. అర. 4. 42)

పునః మార్జనః
హిర’ణ్యవర్ణా శ్శుచ’యః పావకాః యా సు’జాతః కశ్యపో యా స్వింద్రః’ | అగ్నిం యా గర్భ’న్-దధిరే విరూ’పా స్తాన ఆపశ్శగ్గ్ స్యోనా భ’వంతు | యా సాగ్ం రాజా వరు’ణో యాతి మధ్యే’ సత్యానృతే అ’వపశ్యం జనా’నామ్ | మధు శ్చుతశ్శుచ’యో యాః పా’వకా స్తాన ఆపశ్శగ్గ్ స్యోనా భ’వంతు | యాసాం” దేవా దివి కృణ్వంతి’ భక్షం యా అంతరి’క్షే బహుథా భవ’ంతి | యాః పృ’థివీం పయ’సోందంతి’ శ్శుక్రాస్తాన ఆపశగ్గ్ స్యోనా భ’వంతు | యాః శివేన’ మా చక్షు’షా పశ్యతాపశ్శివయా’ తను వోప’స్పృశత త్వచ’ మ్మే | సర్వాగ్’మ్ అగ్నీగ్‍మ్ ర’ప్సుషదో’ హువే వో మయి వర్చో బల మోజో నిధ’త్త || (తై. సం. 5. 6. 1)

(మార్జనం కుర్యాత్)

అఘమర్షణ మంత్రః పాపవిమోచనం

(హస్తేన జలమాదాయ నిశ్శ్వస్య వామతో నిక్షితపేత్)
ద్రుపదా ది’వ ముంచతు | ద్రుపదా దివే న్ము’ముచానః |
స్విన్న స్స్నాత్వీ మలా’ దివః | పూతం పవిత్రే’ణే వాజ్య”మ్ ఆప’ శ్శుందంతు మైన’సః || (తై. బ్రా. 266)

ఆచమ్య (ఓం కేశవాయ స్వాహా, … శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమో నమః)
ప్రాణాయామమ్య

లఘుసంకల్పః
పూర్వోక్త ఏవంగుణ విశేషణ విశిష్ఠాయాం శుభతిథౌ మమోపాత్త దురిత క్షయద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిస్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ప్రాతస్సంధ్యాంగ యథా కాలోచిత అర్ఘ్యప్రదానం కరిష్యే ||

ప్రాతః కాలార్ఘ్య మంత్రం
ఓం భూర్భువస్సువః’ || తథ్స’వితుర్వరే”ణ్యం భర్గో’ దేవస్య’ ధీమహి | ధియో యో నః’ ప్రచోదయా”త్ || 3 ||

మధ్యాహ్నార్ఘ్య మంత్రం
ఓం హగ్ం సశ్శు’చిష ద్వసు’రంతరిక్షస ద్దోతా’ వేదిషదతి’థి ర్దురోణసత్ | నృష ద్వ’రస దృ’తస ద్వ్యో’మ సదబ్జా గోజా ఋ’తజా అ’ద్రిజా ఋతమ్-బృహత్ || (తై. అర. 10. 4)

సాయం కాలార్ఘ్య మంత్రం
ఓం భూర్భువస్సువః’ || తథ్స’వితుర్వరే”ణ్యం భర్గో’ దేవస్య’ ధీమహి | ధియో యో నః’ ప్రచోదయా”త్ || ఓం భూః | ఓం భువః | ఓగ్‍మ్ సువః | ఓం మహః | ఓం జనః | ఓం తపః | ఓగ్‍మ్ సత్యమ్ | ఓం తథ్స’వితుర్వరే”ణ్యం భర్గో’ దేవస్య’ ధీమహి | ధియో యో నః’ ప్రచోదయా”త్ || ఓమాపో జ్యోతీ రసో‌உమృతం బ్రహ్మ భూ-ర్భువ-స్సువరోమ్ ||

(ఇత్యంజలిత్రయం విసృజేత్)

కాలాతిక్రమణ ప్రాయశ్చిత్తం
ఆచమ్య…
పూర్వోక్త ఏవంగుణ విశేషణ విశిష్ఠాయాం శుభతిథౌ మమోపాత్త దురిత క్షయద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిస్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం కాలాతిక్రమ దోషపరిహారార్థం చతుర్థా అర్ఘ్యప్రదానం కరిష్యే ||

ఓం భూర్భువస్సువః’ || తథ్స’వితుర్వరే”ణ్యం భర్గో’ దేవస్య’ ధీమహి | ధియో యో నః’ ప్రచోదయా”త్ || ఓం భూః | ఓం భువః | ఓగ్‍మ్ సువః | ఓం మహః | ఓం జనః | ఓం తపః | ఓగ్‍మ్ సత్యమ్ | ఓం తథ్స’వితుర్వరే”ణ్యం భర్గో’ దేవస్య’ ధీమహి | ధియో యో నః’ ప్రచోదయా”త్ || ఓమాపో జ్యోతీ రసో‌உమృతం బ్రహ్మ భూ-ర్భువ-స్సువరోమ్ ||
(ఇతి జలం విసృజేత్)

సజల ప్రదక్షిణం
ఓం ఉద్యంత’మస్తం యంత’ మాదిత్య మ’భిథ్యాయ న్కుర్వన్-బ్రా”హ్మణో విద్వాన్ త్సకల’మ్-భద్రమ’శ్నుతే అసావా’దిత్యో బ్రహ్మేతి || బ్రహ్మైవ సన్-బ్రహ్మాప్యేతి య ఏవం వేద || అసావాదిత్యో బ్రహ్మ || (తై. అర. 2. 2)

(ఏవమ్ అర్ఘ్యత్రయం దద్యాత్ కాలాతిక్రమణే పూర్వవత్)
(పశ్చాత్ హస్తేన జలమాదాయ ప్రదక్షిణం కుర్యాత్)
(ద్విరాచమ్య ప్రాణాయామ త్రయం కృత్వా)

ఆచమ్య (ఓం కేశవాయ స్వాహా, … శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమో నమః)

సంధ్యాంగ తర్పణం
ప్రాతఃకాల తర్పణం
సంధ్యాం తర్పయామి, గాయత్రీం తర్పయామి, బ్రాహ్మీం తర్పయామి, నిమృజీం తర్పయామి ||

మధ్యాహ్న తర్పణం
సంధ్యాం తర్పయామి, సావిత్రీం తర్పయామి, రౌద్రీం తర్పయామి, నిమృజీం తర్పయామి ||

సాయంకాల తర్పణం
సంధ్యాం తర్పయామి, సరస్వతీం తర్పయామి, వైష్ణవీం తర్పయామి, నిమృజీం తర్పయామి ||

(పునరాచమనం కుర్యాత్)

గాయత్రీ అవాహన
ఓమిత్యేకాక్ష’రం బ్రహ్మ | అగ్నిర్దేవతా బ్రహ్మ’ ఇత్యార్షమ్ | గాయత్రం ఛందం పరమాత్మం’ సరూపమ్ | సాయుజ్యం వి’నియోగమ్ || (తై. అర. 10. 33)

ఆయా’తు వర’దా దేవీ అక్షరం’ బ్రహ్మసంమితమ్ | గాయత్రీం” ఛంద’సాం మాతేదం బ్ర’హ్మ జుషస్వ’ మే | యదహ్నా”త్-కురు’తే పాపం తదహ్నా”త్-ప్రతిముచ్య’తే | యద్రాత్రియా”త్-కురు’తే పాపం తద్రాత్రియా”త్-ప్రతిముచ్య’తే | సర్వ’ వర్ణే మ’హాదేవి సంధ్యావి’ద్యే సరస్వ’తి ||

ఓజో’‌உసి సహో’‌உసి బల’మసి భ్రాజో’‌உసి దేవానాం ధామనామా’సి విశ్వ’మసి విశ్వాయు-స్సర్వ’మసి సర్వాయు-రభిభూరోమ్ | గాయత్రీ-మావా’హయామి సావిత్రీ-మావా’హయామి సరస్వతీ-మావా’హయామి ఛందర్షీ-నావా’హయామి శ్రియ-మావాహ’యామి గాయత్రియా గాయత్రీ చ్ఛందో విశ్వామిత్రఋషి స్సవితా దేవతా‌உగ్నిర్-ముఖం బ్రహ్మా శిరో విష్ణుర్-హృదయగ్‍మ్ రుద్ర-శ్శిఖా పృథివీ యోనిః ప్రాణాపాన వ్యానోదాన సమానా సప్రాణా శ్వేతవర్ణా సాంఖ్యాయన సగోత్రా గాయత్రీ చతుర్విగ్‍మ్ శత్యక్షరా త్రిపదా’ షట్-కుక్షిః పంచ-శీర్షోపనయనే వి’నియోగః | ఓం భూః | ఓం భువః | ఓగ్‍మ్ సువః | ఓం మహః | ఓం జనః | ఓం తపః | ఓగ్‍మ్ సత్యమ్ | ఓం తథ్స’వితుర్వరే”ణ్యం భర్గో’ దేవస్య’ ధీమహి | ధియో యో నః’ ప్రచోదయా”త్ || ఓమాపో జ్యోతీ రసో‌உమృతం బ్రహ్మ భూ-ర్భువ-స్సువరోమ్ || (మహానారాయణ ఉపనిషత్)

ఆచమ్య (ఓం కేశవాయ స్వాహా, … శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమో నమః)

జపసంకల్పః
పూర్వోక్త ఏవంగుణ విశేషణ విశిష్ఠాయాం శుభతిథౌ మమోపాత్త దురిత క్షయద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిస్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం సంధ్యాంగ యథాశక్తి గాయత్రీ మహామంత్ర జపం కరిష్యే ||

కరన్యాసః
ఓం తథ్స’వితుః బ్రహ్మాత్మనే అంగుష్టాభ్యాం నమః |
వరే”ణ్యం విష్ణవాత్మనే తర్జనీభ్యాం నమః |
భర్గో’ దేవస్య’ రుద్రాత్మనే మధ్యమాభ్యాం నమః |
ధీమహి సత్యాత్మనే అనామికాభ్యాం నమః |
ధియో యో నః’ ఙ్ఞానాత్మనే కనిష్టికాభ్యాం నమః |
ప్రచోదయా”త్ సర్వాత్మనే కరతల కరపృష్టాభ్యాం నమః |

అంగన్యాసః
ఓం తథ్స’వితుః బ్రహ్మాత్మనే హృదయాయ నమః |
వరే”ణ్యం విష్ణవాత్మనే శిరసే స్వాహా |
భర్గో’ దేవస్య’ రుద్రాత్మనే శిఖాయై వషట్ |
ధీమహి సత్యాత్మనే కవచాయ హుమ్ |
ధియో యో నః’ ఙ్ఞానాత్మనే నేత్రత్రయాయ వౌషట్ |
ప్రచోదయా”త్ సర్వాత్మనే అస్త్రాయఫట్ |
ఓం భూర్భువస్సువరోమితి దిగ్భంధః |

ధ్యానమ్
ముక్తావిద్రుమ హేమనీల ధవళచ్చాయైర్-ముఖై స్త్రీక్షణైః |
యుక్తామిందుని బద్ధ రత్న మకుటాం తత్వార్థ వర్ణాత్మికామ్ |
గాయత్రీం వరదాభయాంకుశ కశాశ్శుభ్రంకపాలంగదామ్ |
శంఖంచక్ర మధారవింద యుగళం హస్తైర్వహంతీం భజే ||

చతుర్వింశతి ముద్రా ప్రదర్శనం
సుముఖం సంపుటించైవ వితతం విస్తృతం తథా |
ద్విముఖం త్రిముఖంచైవ చతుః పంచ ముఖం తథా |
షణ్ముఖో‌உథో ముఖం చైవ వ్యాపకాంజలికం తథా |
శకటం యమపాశం చ గ్రథితం సమ్ముఖోన్ముఖమ్ |
ప్రలంబం ముష్టికం చైవ మత్స్యః కూర్మో వరాహకమ్ |
సింహాక్రాంతం మహాక్రాంతం ముద్గరం పల్లవం తథా |

చతుర్వింశతి ముద్రా వై గాయత్ర్యాం సుప్రతిష్ఠితాః |
ఇతిముద్రా న జానాతి గాయత్రీ నిష్ఫలా భవేత్ ||

యో దేవ స్సవితా‌உస్మాకం ధియో ధర్మాదిగోచరాః |
ప్రేరయేత్తస్య యద్భర్గస్త ద్వరేణ్య ముపాస్మహే ||

గాయత్రీ మంత్రం
ఓం భూర్భువస్సువః’ || తథ్స’వితుర్వరే”ణ్యం భర్గో’ దేవస్య’ ధీమహి |
ధియో యో నః’ ప్రచోదయా”త్ ||

అష్టముద్రా ప్రదర్శనం
సురభిర్-ఙ్ఞాన చక్రే చ యోనిః కూర్మో‌உథ పంకజమ్ |
లింగం నిర్యాణ ముద్రా చేత్యష్ట ముద్రాః ప్రకీర్తితాః ||
ఓం తత్సద్-బ్రహ్మార్పణమస్తు |

ఆచమ్య (ఓం కేశవాయ స్వాహా, … శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమో నమః)

ద్విః పరిముజ్య |
సకృదుప స్పృశ్య |
యత్సవ్యం పాణిమ్ |
పాదమ్ |
ప్రోక్షతి శిరః |
చక్షుషీ |
నాసికే |
శ్రోత్రే |
హృదయమాలభ్య |

ప్రాతఃకాల సూర్యోపస్థానం
ఓం మిత్రస్య’ చర్షణీ ధృత శ్రవో’ దేవస్య’ సాన సిమ్ | సత్యం చిత్రశ్ర’ వస్తమమ్ | మిత్రో జనాన్’ యాతయతి ప్రజానన్-మిత్రో దా’ధార పృథివీ ముతద్యామ్ | మిత్రః కృష్టీ రని’మిషా‌உభి చ’ష్టే సత్యాయ’ హవ్యం ఘృతవ’ద్విధేమ | ప్రసమి’త్త్ర మర్త్యో’ అస్తు ప్రయ’స్వా న్యస్త’ ఆదిత్య శిక్ష’తి వ్రతేన’ | న హ’న్యతే న జీ’యతే త్వోతోనైన మగ్ంహో’ అశ్నో త్యంతి’తో న దూరాత్ || (తై. సం. 3.4.11)

మధ్యాహ్న సూర్యోపస్థానం
ఓం ఆ సత్యేన రజ’సా వర్త’మానో నివేశ’య న్నమృతం మర్త్య’ంచ | హిరణ్యయే’న సవితా రథేనా‌உదేవో యా’తి భువ’నా నిపశ్యన్’ ||

ఉద్వయ ంతమ’స స్పరి పశ్య’ంతో జ్యోతి రుత్త’రమ్ | దేవన్-దే’వత్రా సూర్య మగ’న్మ జ్యోతి’ రుత్తమమ్ ||

ఉదుత్యం జాతవే’దసం దేవం వ’హంతి కేతవః’ | దృశే విశ్వా’ య సూర్య”మ్ || చిత్రం దేవానా ముద’గా దనీ’కం చక్షు’ర్-మిత్రస్య వరు’ణ స్యాగ్నేః | అప్రా ద్యావా’ పృథివీ అంతరి’క్షగ్‍మ్ సూర్య’ ఆత్మా జగ’త స్తస్థుష’శ్చ ||

తచ్చక్షు’ర్-దేవహి’తం పురస్తా”చ్చుక్ర ముచ్చర’త్ | పశ్యే’మ శరద’శ్శతం జీవే’మ శరద’శ్శతం నందా’మ శరద’శ్శతం మోదా’మ శరద’శ్శతం భవా’మ శరద’శ్శతగ్‍మ్ శృణవా’మ శరద’శ్శతం పబ్ర’వామ శరద’శ్శతమజీ’తాస్యామ శరద’శ్శతం జోక్చ సూర్యం’ దృషే || య ఉద’గాన్మహతో‌உర్ణవా” ద్విభ్రాజ’మాన స్సరిరస్య మధ్యాథ్సమా’ వృషభో లో’హితాక్షసూర్యో’ విపశ్చిన్మన’సా పునాతు ||

సాయంకాల సూర్యోపస్థానం
ఓం ఇమమ్మే’ వరుణ శృధీ హవ’ మద్యా చ’ మృడయ | త్వా మ’వస్యు రాచ’కే || తత్వా’ యామి బ్రహ్మ’ణా వంద’మాన స్త దాశా”స్తే యజ’మానో హవిర్భిః’ | అహే’డమానో వరుణేహ బోధ్యురు’శగ్ం సమా’న ఆయుః ప్రమో’షీః ||

యచ్చిద్ధితే విశోయథా ప్రదేవ వరుణవ్రతమ్ | మినీమసిద్య విద్యవి | యత్కించేదం వరుణదైవ్యే జనే‌உభిద్రోహ మ్మనుష్యాశ్చరామసి | అచిత్తే యత్తవ ధర్మాయుయోపి మమాన స్తస్మా దేనసో దేవరీరిషః | కితవాసో యద్రిరిపుర్నదీవి యద్వాఘా సత్యముతయన్న విద్మ | సర్వాతావిష్య శిధిరేవదేవా థాతేస్యామ వరుణ ప్రియాసః || (తై. సం. 1.1.1)

దిగ్దేవతా నమస్కారః
(ఏతైర్నమస్కారం కుర్యాత్)
ఓం నమః ప్రాచ్యై’ దిశే యాశ్చ’ దేవతా’ ఏతస్యాం ప్రతి’వసంత్యే తాభ్య’శ్చ నమః’ |
ఓం నమః దక్షిణాయై దిశే యాశ్చ’ దేవతా’ ఏతస్యాం ప్రతి’వసంత్యే తాభ్య’శ్చ నమః’ |
ఓం నమః ప్రతీ”చ్యై దిశే యాశ్చ’ దేవతా’ ఏతస్యాం ప్రతి’వసంత్యే తాభ్య’శ్చ నమః’ |
ఓం నమః ఉదీ”చ్యై దిశే యాశ్చ’ దేవతా’ ఏతస్యాం ప్రతి’వసంత్యే తాభ్య’శ్చ నమః’ |
ఓం నమః ఊర్ధ్వాయై’ దిశే యాశ్చ’ దేవతా’ ఏతస్యాం ప్రతి’వసంత్యే తాభ్య’శ్చ నమః’ |
ఓం నమో‌உధ’రాయై దిశే యాశ్చ’ దేవతా’ ఏతస్యాం ప్రతి’వసంత్యే తాభ్య’శ్చ నమః’ |
ఓం నమో‌உవాంతరాయై’ దిశే యాశ్చ’ దేవతా’ ఏతస్యాం ప్రతి’వసంత్యే తాభ్య’శ్చ నమః’ |

ముని నమస్కారః
నమో గంగా యమునయోర్-మధ్యే యే’ వసంతి తే మే ప్రసన్నాత్మాన శ్చిరంజీవితం వ’ర్ధయంతి నమో గంగా యమునయోర్-ముని’భ్యశ్చ నమో నమో గంగా యమునయోర్-ముని’భ్యశ్చ న’మః ||

సంధ్యాదేవతా నమస్కారః
సంధ్యా’యై నమః’ | సావి’త్ర్యై నమః’ | గాయ’త్ర్యై నమః’ | సర’స్వత్యై నమః’ | సర్వా’భ్యో దేవతా’భ్యో నమః’ | దేవేభ్యో నమః’ | ఋషి’భ్యో నమః’ | ముని’భ్యో నమః’ | గురు’భ్యో నమః’ | పితృ’భ్యో నమః’ | కామో‌உకార్షీ” ర్నమో నమః | మన్యు రకార్షీ” ర్నమో నమః | పృథివ్యాపస్తేజో వాయు’రాకాశాత్ నమః || (తై. అర. 2.18.52)

ఓం నమో భగవతే వాసు’దేవాయ | యాగ్‍మ్ సదా’ సర్వభూతాని చరాణి’ స్థావరాణి’ చ | సాయం ప్రాత ర్న’మస్యంతి సా మా సంధ్యా’‌உభిరక్షతు ||

శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే |
శివస్య హృదయం విష్ణుర్విష్ణోశ్చ హృదయం శివః ||
యథా శివమయో విష్ణురేవం విష్ణుమయః శివః |
యథా‌உంతరం న పశ్యామి తథా మే స్వస్తిరాయుషి ||
నమో బ్రహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణ హితాయ చ |
జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః ||

గాయత్రీ ఉద్వాసన (ప్రస్థానం)
ఉత్తమే’ శిఖ’రే జాతే భూమ్యాం ప’ర్వతమూర్థ’ని | బ్రాహ్మణే”భ్యో‌உభ్య’ను ఙ్ఞాతా గచ్చదే’వి యథాసు’ఖమ్ | స్తుతో మయా వరదా వే’దమాతా ప్రచోదయంతీ పవనే” ద్విజాతా | ఆయుః పృథివ్యాం ద్రవిణం బ్ర’హ్మవర్చసం మహ్యం దత్వా ప్రజాతుం బ్ర’హ్మలోకమ్ || (మహానారాయణ ఉపనిషత్)

భగవన్నమస్కారః
నమో‌உస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్ర పాదాక్షి శిరోరు బాహవే |
సహస్ర నామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటీ యుగ ధారిణే నమః ||

భూమ్యాకాశాభి వందనం
ఇదం ద్యా’వా పృథివీ సత్యమ’స్తు | పితర్-మాతర్యది హోప’ బృవేవా”మ్ |
భూతం దేవానా’ మవమే అవో’భిః | విద్యా మేషం వృజినం’ జీరదా’నుమ్ ||

ఆకాశాత్-పతితం తోయం యథా గచ్ఛతి సాగరమ్ |
సర్వదేవ నమస్కారః కేశవం ప్రతిగచ్ఛతి ||
శ్రీ కేశవం ప్రతిగచ్ఛత్యోన్నమ ఇతి |

సర్వవేదేషు యత్పుణ్యమ్ | సర్వతీర్థేషు యత్ఫలమ్ |
తత్ఫలం పురుష ఆప్నోతి స్తుత్వాదేవం జనార్ధనమ్ ||
స్తుత్వాదేవం జనార్ధన ఓం నమ ఇతి ||
వాసనాద్-వాసుదేవస్య వాసితం తే జయత్రయమ్ |
సర్వభూత నివాసో‌உసి శ్రీవాసుదేవ నమో‌உస్తుతే ||
శ్రీ వాసుదేవ నమో‌உస్తుతే ఓం నమ ఇతి |

అభివాదః (ప్రవర)
చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు | … ప్రవరాన్విత … గోత్రః … సూత్రః … శాఖాధ్యాయీ … అహం భో అభివాదయే ||

ఈశ్వరార్పణం
కాయేన వాచా మనసేంద్రియైర్వా | బుద్ధ్యా‌உ‌உత్మనా వా ప్రకృతే స్స్వభావాత్ |
కరోమి యద్యత్-సకలం పరస్మై శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి ||
హరిః ఓం తత్సత్ | తత్సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు |



Sunday, June 17, 2018

Hindu culture



కొంచెం శ్రద్దగా చదవండి👇
మన హైందవ సనాతన సంస్కృతిలోని ముఖ్యమైన సమాచారం ఈ తరం పిల్లలకు అందుబాటులో ఉంచి. నేర్పించండి. చదివించండి.


🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
  1. లింగాలు: 3
     పుం, స్త్రీ, నపుంసక
  2. వాచకాలు 3.
     మహద్వా, మహతీ, అమహత్తు.
  3. పురుషలు 3.
     ప్రథమ, మధ్యమ, ఉత్తమ.
  4. దిక్కులు4
     తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం
  5. మూలలు 4.
     ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం, ఈశాన్యం
  6. వేదాలు 4.
     ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అదర్వణ వేదం
  7. ఉపవేదాలు 4.
     ధనుర్వేద, ఆయుర్వేద, గంధర్వ, శిల్ప.
  8. పురుషార్ధాలు 4.
    ధర్మ, అర్థ, కామ, మోక్షాలు.
  9. చతురాశ్రమాలు 4.
     బ్రహ్మ చర్యం, గార్హస్య్ద, వానప్రస్ధం, సన్యాసం.
  10. పంచభూతాలు 5.
     గాలి, నీరు, భూమి, ఆకాశం, అగ్ని.
  11. పంచేంద్రియాలు 5.
     కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం.
  12. భాషా భాగాలు 5.
     నామవాచకం, సర్వనామం, విశేషణం, క్రియ, అవ్యయం.
  13. లలిత కళలు 5.
     కవిత్వం, చిత్ర లేఖనం, నాట్యం, సంగీతం, శిల్పం.
  14. పంచ కావ్యాలు 5.
     ఆముక్త మాల్యద, వసు చరిత్ర, మను చరిత్ర, పారిజాతాపహరణం, శృంగార నైషధం.
  15. పంచ గంగలు 5.
     గంగ, కృష్ణ, గోదావరి, కావేరి, తుంగభద్ర.
  16. దేవతా వృక్షాలు 5.
     మందారం, పారిజాతం, కల్ప వృక్షం, సంతానం, హరిచందనం.
  17. పంచోప చారాలు 5.
     స్నానం, పూజ, నైవేద్యం, ప్రదక్షిణం, నమస్కారం.
  18. పంచాగ్నులు 5.
     బడబాగ్ని, జఠరాగ్ని, కష్టాగ్ని, వజ్రాగ్ని, సూర్యాగ్ని.
  19. పంచామృతాలు 5.
     ఆవుపాలు, పెరుగు, నెయ్యి, చక్కెర, తేనె.
  20. పంచలోహాలు 5.
     బంగారం, వెండి, రాగి, సీసం, తగరం.
  21. పంచారామాలు 5.
     అమరావతి, భీమవరం, పాలకొల్లు, సామర్లకోట, ద్రాక్షారామం
  22. ధర్మ రాజు అడిగిన ఊళ్ళు 5.
     ఇంద్రప్రస్థం, కుశస్థం, వృకస్థలం, వాసంతి, వారణావతం.
  23. వేదాంగాలు(స్మ్రతులు) 6.
     శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తం, జ్యోతిష్యం, కల్పం.
  24. షడ్రుచులు 6.
     తీపి, పులుపు, చేదు, వగరు, కారం, ఉప్పు.
  25. అరిషడ్వర్గాలు(షడ్గుణాలు) 6.
     కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మత్సరం.
  26. ఋతువులు 6.
     వసంత, గ్రీష్మ, వర్ష, శరద్ ఋతువు, హేమంత, శిశిర.
  27. షట్చక్రాలు 6.
     మూలధార, స్వాధిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞాచక్రాలు.
  28. షట్చక్రవర్తులు 6.
     హరిశ్చంద్రుడు, నలుడు,సగరుడు, పురుకుత్సుడు, పురూరవుడు,  కార్తవీర్యార్జునుడు.
  29. సప్త ఋషులు 7.
     కాశ్యపుడు, గౌతముడు, అత్రి, విశ్వామిత్రుడు, భరద్వాజ, జమదగ్ని, వశిష్ఠుడు.
  30. తిరుపతి సప్తగిరులు 7.
     శేషాద్రి, నీలాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, వృషభాద్రి, నారాయణాద్రి, వేంకటాద్రి.
  31. కులపర్వతాలు 7.
     మహేంద్ర, మలయ, సహ్యం, శుక్తిమంతం, గంధమాధనం, వింధ్య, పారియాత్ర.
  32. సప్త సముద్రాలు 7.
     ఇక్షు, జల, క్షీర, లవణ, దది, సూర, సర్పి.
  33. సప్త వ్యసనాలు 7.
     జూదం, మద్యం, దొంగతనం, వేట, వ్యబిచారం, దుబారఖర్చు, కఠినంగా మాట్లాడటం.
  34. సప్త నదులు 7.
     గంగ, యమునా, సరస్వతి, గోదావరి, సింధు, నర్మద, కావేరి.
  35. ఊర్ధ్వలోకాలు 7.
     భూ, భువర్ణో, సువర్ణో, తపో, జనో, మహా, సత్య.
  36. అదో లోకాలు 7.
     అతల, వితల, సుతల, తలాతల, రసాతల, మహాతల, పాతాళ.
  37. జన్మలు 8.
      వ, మనుష్య, రాక్షస, పిశాచి, పశు, పక్షి, జలజీవ, కీటక.
  38. కర్మలు 8.
     స్నానం, సంధ్య, జపం, హోమం, స్వాధ్యాయం, దేవపూజ, ఆతిథ్యం, వైశ్యదేవం.
  39. అష్టదిగ్గజాలు 8.
     ఐరావతం, పుండరీకం, కుముదం, సార్వభౌమం, అంజనం, సుప్రతీకం, వామనం, పుష్పదంతం.
  40. అష్టదిగ్గజకవుల
     నందితిమ్మన, పెద్దన, ధూర్జటి, పింగళి సూరన, తెనాలిరామకృష్ణ, రామరాజభూషణుడు, అయ్యలరాజురామభద్రుడు, మాదయగారిమల్లన
  41. శ్రీ కృష్ణుని అష్ట భార్యలు
     రుక్మిణి, సత్యభామ, జాంబవతి, మిత్రవింద, భద్ర, సుదంత, కాళింది, లక్షణ.
  42. అష్ట భాషలు 8.
     సంస్కృతం, ప్రాకృత, శౌరసేని, పైశాచి, సూళికోక్తి, అపభ్రంశం, ఆంధ్రము.
  43. నవధాన్యాలు 9.
      గోధుమ, వడ్లు, పెసలు, శనగలు, కందులు, నువ్వులు, మినుములు, ఉలవలు, అలసందలు.
  44. నవరత్నాలు 9.
     ముత్యం, పగడం, గోమేధికం, వజ్రం,కెంపు, నీలం, కనకపుష్యరాగం, పచ్చ (మరకతం), ఎరుపు (వైడూర్యం)
  45. నవధాతువులు 9.
     బంగారం, వెండి, ఇత్తడి, రాగి, ఇనుము, కంచు, సీసం, తగరం, కాంతలోహం.
  46. నవరసాలు 9.
     హాస్యం, శృంగార, కరుణ, శాంత, రౌద్ర, భయానక, బీభత్స, అద్భుత, వీర.
  47. నవబ్రహ్మలు 9.
     మరీచ, భరద్వాజ, అంగీరసుడు, పులస్య్తుడు, పులహుడు, క్రతువు, దక్షుడు, వశిష్ఠుడు, వామదేవుడు.
  48. నవ చక్రాలు 9.
     మూలాధార, స్వాధిష్టాన, నాభి, హృదయ, కంఠ, ఘంటికా, భ్రూవు, గగన, బ్రహ్మ రంధ్రం.
  49. నవదుర్గలు 9.
     శైలపుత్రి, బ్రహ్మ చారిణి, చంద్రఘంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయని, కాళరాత్రి, మహాగౌరి, సిద్ధిధాత్రి.
  50. దశ బలములు 10.
     విద్య, స్నేహ, బుద్ధి, ధన, పరివార, సత్య, సామర్ధ్య, జ్ఞాన, దైవ, కులినిత.
  51. దశ సంస్కారాలు 10.
     వివాహం, గర్భాదానం, పుంసవనం , సీమంతం, జాతకకర్మ, నామకరణం, అన్నప్రాశనం, చూడకర్మ, ఉపనయనం, సమవర్తనం.
  52. దశ మహాదానాలు 10.
     గోవు, సువర్ణ, రజతం, ధాన్యం, వస్త్ర, నెయ్యి, తిల, సాలగ్రామం, లవణం, బెల్లం.
  53. అర్జునుడికి గల పేర్లు10.
     ర్జునుడు, పార్ధుడు, కిరీటి, శ్వేతవాహనుడు, బీభత్సుడు, జిష్ణుడు, విజయుడు, సవ్యసాచి, ధనుంజయుడు పాల్గుణుడు.
  54. దశావతారాలు 10.
     మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ, వామన, పరశురామ, శ్రీరామ, శ్రీకృష్ణ, బుద్ధ, కల్కి.
  55. ద్వాదశ జ్యోతిర్లింగాలు 12.
    1. హిమలయ పర్వతాలలో 1.కేదారేశ్వరలింగం
    2. కాశీ లో 1.కాశీవిశ్వేశ్వరుడు
    3. మధ్యప్రదేశ్లో 2. మహాకాలేశ్వరలింగం, ఓంకారేశ్వరలింగం.
    4. గుజరాత్ లో 2.సోమనాధలింగం, నాగేశ్వరలింగం.
    5. మహారాష్ట్రలో 4.భీమశంకరం, త్రయయంబకేశ్వరం, ఘృష్ణేశ్వరం, వైద్యనాదేశ్వరం.
    6. ఆంధ్రప్రదేశ్ లో 1.మల్లిఖార్జున లింగం (శ్రీశైలం)
    7. తమిళనాడ లోని రామేశ్వరములో 1.రామలింగేశ్వరం
  56. షోడశ మహాదానాలు 16.
     గోవు, భూ, తిల, రత్న, హిరణ్య, విద్య, దాసి, కన్య, శయ్య, గృహ, అగ్రహార, రధ, గజ, అశ్వ, ఛాగ (మేక), మహిషి (దున్నపోతు).
  57. అష్టాదశవర్ణనలు 18.
      నగరం, సముద్రం, ఋతువు, చంద్రోదయం, అర్కోదయం, ఉద్యానము, సలిలక్రీడ, మధుపానం, రతోత్సవం, విప్రలంభం, వివాహం, పుత్రోత్పత్తి, మంత్రము, ద్యూతం, ప్రయాణం, నాయకాభ్యుదయం, శైలము, యుద్ధం.
  58. అష్టాదశ పురాణాలు 18.
    మార్కండేయ, మత్స్య, భవిష్య, భాగవత, బ్రహ్మ, బ్రహ్మవైవర్త, బ్రహ్మాండ, విష్ణు, వాయు, వరాహ, వామన, అగ్ని, నారద, పద్మ, లింగ, గరుడ, కూర్మ, స్కాంద.
  59. భారతంలోపర్వాలు 18.
     ఆది, సభా, అరణ్య, విరాట, ఉద్యోగ, భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక, స్ర్తి, శాంతి, అనుశాసన, అశ్వమేధ, ఆశ్రమవాస, మౌసల, మహాప్రస్థాన, స్వర్గారోహణ.
  60. సంస్కృతరామాయణంలోకాండలు6.
     బాల ,అయోధ్య, అరణ్య, కిష్కింద, సుందర ,యుద్ధ.(తెలుగులో7వ కాండ ఉత్తర (లవకుశ కథ))
  61. భాగవతంలో స్కంధాలు12.
    స్కంథమువిషయము - అద్యాయమమొత్తం వృత్తాలు
    1వ స్కంథముఅర్జునుండు ద్వారక నుండి వచ్చి కృష్ణ నిర్యాణమను చెప్పుట 44
    2వ స్కంథముశ్రీమన్నారాయణుని లీలావతారంబుల యభివర్ణనము116
    3వ స్కంథమువిదురమైత్రేయ సంవాదమ238
    4వ స్కంథముపురంజనోపాఖ్యానము 183
    5వ పూర్వ స్కంథముభగవంతుండగు నారాయణుండు వృషభావతార మెత్తుట59
    5వ ఉత్తర స్కంథముశుకయోగి యుపదేశమునఁ దెల్పు భూగోళనిర్ణయమ73
    6వ స్కంథమువిష్ణుదూత యమదూతల సంవాదము157
    7వ స్కంథముహిరణ్య కశిపుడు ప్రహ్లాదుని వివిధోపాయంబుల హింసిచుట 105
    8వ స్కంథముగజేంద్ర మోక్షణ కథా ప్రారంభమ144
    9వ స్కంథముశ్రీరామ చరిత్ర116
    10వ పూర్వ స్కంథముబ్రహ్మ గోవత్సములను గోప బాలుకులను నంతర్థానంబు సేయుట125
    10వ ఉత్తర స్కంథముసాల్వుండు శివ ప్రసాదంబున సౌభక విమానంబు వడసి ద్వారకాపురి పై దండెత్తుట88
    11వ స్కంథమువసుదేవునకు నారదుండు పురాతనంబగు విదేహర్షభ సంవాదంబుఁ దెలుపుట60
    12వ స్కంథముశుకయోగి పరీక్షిత్తునకు భావి కాల గతులఁ జెప్పుట17
    అన్ని స్కందాలు విదుర మైత్రేయ సంవాదమ238

    పాండవుల అరణ్యవాసం 12సం. అజ్ఞాతవాసం1సం.

    శంఖాలు
    1. భీముడు
       - పౌండ్రము
    2. విష్ణువు
       -పాంచజన్యం
    3. అర్జునుడు
       - దేవదత్తం.

    విష్ణుమూర్తి - - ఆయుధాలు
    ధనస్సు శారంగం,
    శంఖంపాంచజన్యం,
    ఖడ్గంనందకం,
    చక్రంసుదర్శనం.
    విల్లులు
    అర్జునుడుగాంఢీవం
    పినాకంవిష్ణువు
    శారంగం
    వీణలు--పేర్లు
    వీణలువాటిని వాడెవారు
    కచ్చపిసరస్వతి,
    మహతినారధుడు,
    కళావతితుంబురుడు.

    అష్ట దిక్పాలకులు

    అష్టదిక్కులు పాలకులువారి ఆయుధాలు
    తూర్పుఇంద్రుడువజ్రాయుధం
    పడమరవరుణుడపాశం
    ఉత్తరకుబేరుడుఖడ్గం
    దక్షిణంయముడు దండం
    ఆగ్నేయం అగ్నిశక్తి
    నైరుతినిరృతికుంతం
    వాయువ్యంవాయువుధ్వజం
    ఈశాన్యంఈశానుడుత్రిశూలం

    మనువులు       మన్వంతరాలు
    ------------------         - - - - - - - - - - - -
    స్వయంభువు స్వారోచిష
    ఉత్తమతామసి
    రైతవ చాక్షువ
    వైవస్వతసవర్ణ
    దక్ష సువర్ణ బ్రహ్మ సువర్ణ
    ధర్మసవర్ణరుద్రసవర్ణ
    రౌచ్య బౌచ్య
    సప్త స్వరాలు
    స -   షడ్జమం    - -   (నెమలిక్రేంకారం)
    రి    - -   రిషభం    - -    (ఎద్దురంకె)
    గ   - -    గాంధర్వం - -   (మేక అరుపు)
    మ  - -   మధ్యమ - -    ( క్రౌంచపక్షికూత)
    ప - -     పంచమం  - -    (కోయిలకూత)
    ద   - -   దైవతం     - -     (గుర్రం సకిలింత)
    ని - -     నిషాదం   - -      (ఏనుగు ఘీంకారం)
    సప్త ద్వీపాలు
    జంబూద్వీపం   - -   అగ్నీంద్రుడు
    ప్లక్షద్వీపం         - -    మేధాతిధి
    శాల్మలీద్వీపం    - -   వప్రష్మంతుడు
    కుశద్వీపం        - -    జ్యోతిష్యంతుడు
    క్రౌంచద్వీపం      - -     ద్యుతిమంతుడు
    శాకద్వీపం         - -    హవ్యుడు
    పుష్కరద్వీపం    - -   సేవకుడు

    ----------------------------------------------------
    తెలుగు వారాలు 7.
    ఆది, సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని.

              ఇంగ్లీషు నెలలు12.
    జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్,మే, జూన్,జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్,న వంబర్, డిసెంబర్.

                    తెలుగు నెలలు12
    చైత్రం, వైశాఖం, జ్యేష్ఠం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వీయుజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం, ఫాల్గుణం.
                     రాశులు 12.
    మేషం, వృషభం, మిథునం, కర్కాటకం,
    సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం.
                      తిథులు 15.
    పాఢ్యమి, విధియ, తదియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, అమావాస్య /పౌర్ణమి.

                     నక్షత్రాలు 27.
    అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రావణం, ధనిష్ఠ, శతభిషం, పూర్వాబాద్ర, ఉత్తరాబాద్ర, రేవతి.

    తెలుగు సంవత్సరాల పేర్లు. 60

    తెలుగు సంవత్సరము పేరుఆంగ్ల సంవత్పరాలు
    1.ప్రభవ.1927, 1987, 2047, 2107
    2.విభవ.1928, 1988, 2048, 2108
    3.శుక్ల. 1929, 1989, 2049, 2109
    4.ప్రమోదూత. 1930, 1990, 2050, 2110
    5.ప్రజోత్పత్తి. 1931, 1991, 2051, 2111
    6.అంగీరస. 1932, 1992, 2052, 2112
    7.శ్రీముఖ.1933, 1993, 2053, 2113
    8.భావ. 1934, 1994, 2054, 2114
    9.యువ.1935, 1995, 2055, 2115
    10.ధాత.1936, 1996, 2056, 2116
    11.ఈశ్వర. 1937, 1997, 2057, 2117
    12.బహుధాన్య.1938, 1998, 2058, 2118
    13.ప్రమాది. 1939, 1999, 2059, 2119
    14.విక్రమ. 1940, 2000, 2060, 2120
    15.వృష.1941, 2001, 2061, 2121
    16.చిత్రభాను. 1942, 2002, 2062, 2122
    17.స్వభాను. 1943, 2003, 2063, 2123
    18.తారణ. 1944, 2004, 2064, 2124
    19.పార్థివ. 1945, 2005, 2065, 2125
    20.వ్యయ.1946, 2006, 2066, 2126
    21.సర్వజిత్తు. 1947, 2007, 2067, 2127
    22.సర్వదారి. 1948, 2008, 2068, 2128
    23.విరోధి. 1949, 2009, 2069, 2129
    24.వికృతి. 1950, 2010, 2070, 2130
    25.ఖర. 1951, 2011, 2071, 2131
    26.నందన.1952, 2012, 2072, 2132
    27 విజయ.1953, 2013, 2073, 2133
    28.జయ. 1954, 2014, 2074, 2134
    29.మన్మద.1955, 2015, 2075, 2135
    30.దుర్మిఖి. 1956, 2016, 2076, 2136
    31.హేవళంబి. 1957, 2017, 2077, 2137
    32.విళంబి. 1958, 2018, 2078, 2138
    33.వికారి.1959, 2019, 2079, 2139
    34.శార్వారి. 1960, 2020, 2080, 2140
    35.ప్లవ. 1961, 2021, 2081, 2141
    36.శుభకృత్. 1962, 2022, 2082, 2142
    37.శోభకృత్. 1963, 2023, 2083, 2143
    38. క్రోది.1964, 2024, 2084, 2144
    39.విశ్వావసు.1965, 2025, 2085, 2145
    40.పరాభవ.1966, 2026, 2086, 2146
    41.ప్లవంగ. 1967, 2027, 2087, 2147
    42.కీలక. 1968, 2028, 2088, 2148
    43.సౌమ్య. 1969, 2029, 2089, 2149
    44.సాధారణ . 1970, 2030, 2090, 2150
    45.విరోధికృత్. 1971, 2031, 2091, 2151
    46.పరీదావి. 1972, 2032, 2092, 2152
    47.ప్రమాది. 1973, 2033, 2093, 2153
    48.ఆనంద. 1974, 2034, 2094, 2154
    49.రాక్షస. 1975, 2035, 2095, 2155
    50.నల.1976, 2036, 2096, 2156
    51.పింగళ. 1977, 2037, 2097, 2157
    52.కాళయుక్తి. 1978, 2038, 2098, 2158
    53.సిద్ధార్ధి. 1979, 2039, 2099, 2159
    54.రౌద్రి. 1980, 2040, 2100, 2160
    55.దుర్మతి. 1981, 2041, 2101, 2161
    56.దుందుభి. 1982, 2042, 2102, 2162
    57.రుదిరోద్గారి.1983, 2043, 2103, 2163
    58.రక్తాక్షి. 1984, 2044, 2104, 2164
    59.క్రోదన.1985, 2045, 2105, 2165
    60.అక్షయ.1986, 2046, 2106, 2166.
    కులవృత్తులు.

    బ్రాహ్మణ,క్షత్రియ, వైశ్య, రజక, మంగలి, వడ్రంగి, కుమ్మరి, కమ్మరి, కంసాలి, సాలెలు, జాలరి, మేదరి, కర్షకుడు, చెప్పులుకట్టేవారు.


    జానపద కళలు.

    హరికథ, బుర్రకథ, ఒగ్గుకథ, తోలుబొమ్మలాట, బుడబుక్కలాట, కోలాటం, పులివేషం, యక్షగానం, వీధినాటకాలు, డప్పులనృత్యం, గంగిరెద్దులమేళం, కర్రసాము.


Saturday, June 2, 2018

శంఖము యొక్క పూజా ప్రాధాన్యత

"శంఖము యొక్క పూజా ప్రాధాన్యత"

సనాతన హిందూ సంప్రదాయ పూజా విధానములో శంఖానికి విశేష ప్రాధాన్యము ఉన్నది . దేవతలు , రాక్షసులు అమృతము కోసము సముద్ర మధనము చేసినప్పుడు ఈ శంఖము పుట్టినది అని అంటారు . . అప్పటి నుండి అది పాంచజన్యము గా మారిపోయినది . శంఖం అనేది రెండు సంస్కృత పధాల కలయిక ... శం అంటే ఏధైనా మంచి అని , ఖం అంటే జలము అని అర్ధము ... కాబట్టి జలము ఉంచే మంచి కలశము అని అనుకోవచ్చును . శంఖం లో ఉంచిన నీటిని పవిత్ర తీర్ధము గా ఉపయోగిస్తారు . దానిలో అనేక లవణాలు కరిగి ఉంటాయి .
1.భూమి , 2.ఆకాశము , 3.గాలి , 4.నీరు , 5.అగ్ని . అనేవి పంచభూతాలు . ఇక్కడ భూమి అంటే మట్టి - జీవి జన్మకు వేదిక . . . భూమి చుట్టూ ఉన్న శూన్యప్రదేశమే - ఆకాశము ... ఇక భూమి పైన ఉన్న ప్రకృతివాతావరణము లో ప్రతి జీవికి కావలసిన గాలి , నీరు , అగ్ని/శక్తి (ఆహారము) జీవపరిణామ క్రమములో వాటంతటవియే సమకూర్చబడ్డాయి . జీవి + పంచభూతాలు కలిస్తేనే ప్రకృతి . ఒకదానినుండి ఒకటి ఉద్భవించాయి . అలా ఉద్భవిస్తూనే ఉంటాయి . వీటికి అంతము లేదు ... అంతరాయమూ ఉండదు . భూగోళము ఉన్నంతవరకూ ఇలా జరగవలసినదే . వీటిలో ఏ ఒక్కదానికి అంతరాయము కలిగినా ప్రకృతిలో జీవి (ప్రాణి) నశించి భూమి ఉనికే ప్రశ్నార్దకము ?.తొలి రోజుల్లో మానవుని విజ్ఞాన శాస్త్రము అంతగా అభివృద్ధి చెందని కాలములో అన్నింటిని అతీత శక్తులు గాను , దైవాలుగాను భావించి పంచభూతాలను లింగాలుగాను , అంగాలుగాను ఊహించి పూజించి... మనోశక్తిని , మానసిక ఉల్లాసాన్ని పొందేవాడు . ఆ కోవలోనిదే ఈ శంఖం పూజ .
శంఖం - కొన్ని ఆరోగ్య చిట్కాలు :
* శంఖం లో రాత్రంతా నీటిని ఉంచి మరుసటి ఉదయం ఆ నీటితో చర్మాన్ని రుద్దుకుంటే చర్మసంబంధమైన రోగాలు నయమవుతాయి .
* శంఖం లో నీటిని పోసి 12 గంటలు అలాగే ఉంచాలి .. ఆ నీటిని చర్మము కీద ఉన్న తెల్లమచ్చలు పై రుద్దాలి ఇలా రోజూ క్రమం తప్పకుండా చేయడం వల్ల కొన్ని రోజుల తర్వాత ఆ మచ్చలు మాయమవుతాయి .
* రాత్రి శంఖాన్ని నీటితోనింపి ఉదయము దానికి కొంచెం రోజ్ వాటర్ కలపాలి . . అలా కలిపిన నీటిని జుట్టుకిపట్టించాలి . దీనివల్ల జుట్టు ఆరోగ్యము గా నల్లగా తయారవుతాయి . గడ్డము , మీసాలము ఇదే నీటిని పట్టిస్తే అవి అందం గా నల్లగా ఒత్తుగా మారతాయి .
*కడుపు నొప్పి సంబంధిత రోగాల నివారణకు పరగడుపున రాత్రి పన్నెండు గంటలపాటు శంఖం లో ఉంచిన నీటిని ఒక స్పూన్‌ త్రాగాలి . ఈ నీరు పేగులను బాగా శుబ్రపరుస్తుంది .
*పన్నెండు గంటలపాటు శంఖం లో నిల్వవుంచిన నీటిని మామూలు నీళ్ళలో కలిపి పరగడుపున ఆ నీటితో కళ్ళు కడుక్కోవాలి . ఇలా రోజూచేస్తే కంటి సంబంధిత రోగాలు మాయమౌతాయి . కళ్ళు ఆరోగ్యం గా ఉండి కళ్ళజోడు వాడవలసిన అవసరము తగ్గుతుంది .
* ఉదయము స్నానము చేశాక శంఖాన్ని ముఖానికి , ఒంటికి రుద్దుకుంటే ముఖం పై ముడుతలు , నల్లమచ్చలు పోయి ముఖం కాంతివంతం గా ఉంటుంది .
ఇన్ని ఉపయోగాలు న్న శంఖం ను పూజించడం .. ఆరాదించడం .. పూజా విధానాలలో ఉపయోగించడం ఎంతోమంచిది .. ఆవిధంగా రోజూ శంఖం తో సంబంధం ఉండడం వల్ల ఆరోగ్యానికి మంచిది .
శంఖం గురించి :
శంఖము ( Conch) ఒకరకమైన మొలస్కా జాతికి చెందిన జీవి. ఇవి వివిధ జాతులకు చెందిన మధ్యమ పరిమాణం లోని ఉప్పునీటి నత్తలు లేదా వాటి కర్పరాలు. నిజమైన శంఖాలు సముద్రంలో నివసించే గాస్ట్రోపోడా తరగతికి చెందిన స్ట్రాంబిడే (Strombidae) కుటుంబంలోని స్ట్రాంబస్ (Strombus) ప్రజాతికి చెందిన జీవులు. ఇవి చాలా చిన్నవాటినుండి చాలా పెద్దవాటి వరకు వివిధ పరిమాణాలలో ఉంటాయి. వీటిలో చాలా జాతులు వాణిజ్యపరంగా ఆహార పదార్ధాలుగా ముఖ్యమైనవి. Strombus gigas శంఖువుల నుండి ఖరీదైన ముత్యాలు తయారౌతాయి. సుమారు 65 జాతుల శంఖులు అంతరించిపోయాయి. జీవించియున్న జాతులు ఎక్కువగా హిందూ మహాసముద్రం - పసిఫిక్ మహాసముద్రంలో నివసిస్తున్నాయి. ఆరు జాతులు కారీబియన్ ప్రాంతంలో నివసిస్తున్నాయి. చాలా శంఖు జాతులు ఇసుకమేట వేసిన సముద్రగర్భంలో ఉష్ణప్రాంతాలలో జీవిస్తాయి.
శాస్త్రవేత్తలు అభిప్రాయానుసారం శంఖ ధ్వని వల్ల వాతావరణ లోపాలు, కీటకముల నాశనం జరుగుతుందని -అనేక ప్రయోగాలు చేసి నిరూపించారు. శంఖ బస్మము వల్ల అనేక రోగాలు నయము అగుచున్నవి. ఋషి శృంగుడు చెప్పిన విధానం ప్రకారం చంటి పిల్లలకు శంఖమాలలు ధరింపచేసి వాటితో నింపిన నీరును త్రాగించినట్లయితే పిల్లలు ఆరోగ్యవంతులు అవుతారు. శంఖాన్ని పూరించుట వల్ల శ్వాశకోశ రోగాలు నశిస్తాయి. కొన్ని శంఖాలు చెవి దగ్గర పెట్టుకుంటే ఓంకార నాధం వినిపిస్తుంది. దానివల్ల భక్తుల కోర్కెలు తీరును. ఈ శంఖాలు వల్ల ఆయువృద్ధి, లక్ష్మీ ప్రాప్తి, పుత్రప్రాప్తి, శాంతి, వివాహ ప్రాప్తి కలుగుచున్నవి. శంఖము పాపనాశిని ప్రతి ఇంటిలోను శంఖము వుండవలసిన వస్తువు శంఖము వున్న ఇల్లు లక్ష్మీ నివాసము.
మానవులకు ఉపయోగాలు
ఆహార పదార్ధాలు-- శంఖాలలోని అన్ని భాగాలు మాంసాహారంగా తింటారు. తూర్పు ఆసియా దేశాలలో వీటిని పలుచగా కోసి వేపుడు చేసుకుంటారు.
సంగీత పరికరాలు --శంఖు కర్పరాలు ట్రంపెట్ మాదిరిగా గాలితో ఊదే సంగీత పరికరాలు. శంఖము నుండి వెడలే నాదాన్ని శంఖారావం అంటారు. అమెరికన్ జాజ్ సంగీతకారుడు స్టీవ్ టర్రే (Steve Turre) శంఖాలను కూడా తన ఆర్కెస్ట్రాలో ఉపయోగిస్తాడు.
బహుమతి వస్తువుగా --శంఖాలు ఫిజీ వంటి దక్షిణ పసిఫిక్ దేశాలలో చారిత్రాత్మకంగా ఉపయోగంలో ఉన్నాయి. ఇప్పటికీ కొన్ని హోటళ్ళలో యాత్రికులకు స్వాగతం ఇవ్వడానికి దీనిని ఉపయోగిస్తున్నారు.
పురాణములలో -- శ్రీకృష్ణుడు ఉపయోగించిన శంఖము - పాంచజన్యము.
శంఖం - ఆద్యాత్మిక ప్రాముఖ్యత :
శంఖే చంద్ర మావాహయామి
కుక్షే వరుణ మావాహయామి
మూలే పృధ్వీ మావాహయామి
ధారాయాం సర్వతీర్థ మావాహయామి
శంఖం సంపదలకు ప్రతీక ఈ పవిత్రమైన వస్తువులను పూజా గదుల యందు వుంచినట్లు అయితే అన్ని అరిష్ఠాలు మాయమైపోతాయి. సౌభాగ్యాల పంట దక్కుతుంది. ఇందువల్లనే భారతీయ సంస్కృతిలో దీనికి ప్రత్యేకమైన స్థానం కలదు. మందిరాలలోనూ శుభకార్యాలలోనూ దీని ధ్వని శోభను పెంచుతుంది. దీని పుట్టుక సముద్ర మధనంలో జరిగిందని చెబుతారు. సముద్ర మధనంలో వచ్చిన పదనాలుగు రత్నాలలో శంఖం ఒకటి , విష్ణు పురాణం ప్రకారం లక్ష్మి ,శంఖం ... సముద్రతనయ అయివున్నది.
శంఖం లక్ష్మికి సోదరి, సోదరుడు కూడాను. ఈమె లక్ష్మికి వారసురాలు, నవనిధులలో అష్టసిద్ధులలో దీనికి ఉపయోగిస్తారు. పూజ, ఆరాధన, అనుష్ఠాలలో, ఆరతిలో, యజ్ఞాలలో, తాంత్రికక్రియలలో దీనిని ఉపయోగిస్తారు. ఆయుర్వేదరీత్యా దీనిలో మంచి గుణాలు వున్నాయి. పురాతన కాలంలో ప్రతి ఇంటిలోనూ దీనిని స్థాపించి ఆరాధించేవారు. కూర్మ పీఠం మీద ఎరుపు పట్టు వస్త్రాన్ని వేసి దీనిని స్థాపించి, దేవతగా భావించి పూజించేవారు. ఈ పూజలు వల్ల వాళ్లకు ఎంతో అభివృద్ధికల్గేది. దీనికి అనేక రకాల పూజా విధానాలు కలవు. పూర్వం కొన్నింటిని గృహ కృత్యాలలో తప్పనిసరిగా వాడేవారు.
శంఖాలలో చాలా రకాలు వున్నాయి. రకాలను బట్టి పూజా విధానాలు కలువు. శంఖం సాధకుని మనోవాంఛలను పూర్తి చేయును. సుఖ సంతోషాలను కలగజేస్తుంది. ఈ శంఖాలు మానససరోవర్‌, లక్షద్వీప్‌, కోరమండల్‌, శ్రీలంక, భారతదేశంలోను లభిస్తున్నాయి. శంఖం యొక్క ఆకారాన్ని బట్టి వాటిని విభజిస్తారు ముఖ్యంగా 3 రకాలు 1. దక్షిణావృత శంఖం, 2. మధ్యావృత శంఖం, 3. ఉత్తరావృతవ శంఖం. ఎడమ చేతితో పట్టుకునే దానిని దక్షిణావృతమని కుడిచేతితో పట్టుకునే దానిని ఉత్తరావృత శంఖమని మధ్యలో నోరు వున్నదానిని మధ్యావృతమని అంటారు. ఈ శంఖాల పేర్లు ఈ విధంగా ఉన్నవి. 1. లక్ష్మీ శంఖం, 2. గోముఖ శంఖం, 3. కామధేను శంఖం, 4. దేవ శంఖం, 5. సుఘోష శంఖం, 6. గరుడ శంఖం, 7. మణిపుష్పక శంఖం, 8. రాక్షస శంఖం, 9. శని శంఖం, 10. రాహు శంఖం, 11. కేతు శంఖం, 12. కూర్మ శంఖం,
భారత యుద్ధ సమయంలో అనేక రకాల శంఖాలు పూరించారు. ఉదా:- శ్రీకృష్ణుడు పాంచజన్యం పూరించాడు, అర్జునుడు దేవదత్తాన్ని, భీముడు పౌంఢ్ర శంఖాన్ని యుధిష్ఠరుడు అనంత విజయ శంఖాన్ని, నకులుడు సుఘోష శంఖాన్ని, సహదేవుడు మణిపుష్పక శంఖాన్ని, కాశీరాజు శిఖండి శంఖాన్ని దుష్ఠ ద్యుమ్నుడు, విరాటుడు స్వాతిక శంఖాన్ని అలాగే ఇతర రాజులు అనేక రకాల శంఖాలు పూరించారు.
శంఖ ధ్వని విజయానికి, సమృద్ధికి, సుఖానికి, కీర్తి ప్రతిష్ఠలకు, లక్ష్మి ఆగమనానికి ప్రతీక, శంఖాన్ని శివపూజకు, పూజనందు ఆరతి ఇచ్చేటప్పుడు ధార్మిక ఉత్సవాలలో యజ్ఞాలలో రాజ్యాభిషేకాలకు, శుభ సందర్భాలలోనూ, పితృదేవతలకు తర్పణలు ఇచ్చేటప్పుడు మరియు దీపావళి, హోళి, మహాశివరాత్రి, విశిష్టమైన ఖర్మకాండలలో శంఖాన్ని స్థాపించి పూజిస్తారు. రుద్రపూజకు, గణశపూజకు, దేవిపూజకు, విష్ణుపూజకు దీనిని ఉపయోగిస్తారు. దీనిని గంగాజలం, పాలు, తేనె, నేయితోను, బెల్లంతోను, అభిషేకిస్తూ వుంటారు. దీనిని ధూపదీప నైవేద్యాలతో పూజిస్తారు. దీనిని పూజించటం వల్ల వాస్తుదోషాలుపోతాయి. వాస్తుదోషం పోవడానికి ఎర్ర ఆవుయొక్క పాలతో దానిని నింపి ఇల్లు అంతా చల్లుతారు. ఇంటి సభ్యులు అంతా సేవిస్తారు. ఇలా చేయడం వల్ల అసాధ్య రోగాలు, దు:ఖాలు దౌర్భాగ్యం దూరమవుతాయి.
విష్ణు శంఖాన్ని దుకాణాలలోను ఆఫీసుల్లోను ఫ్యాక్టరీలలోను స్థాపించి అభివృద్ధిని పొందుతున్నారు. లక్ష్మి స్వయంగా శంఖం నాసహోదరి అని చెప్పిన సందర్భాలు కలవు. దేవి యొక్క పాదాలు వద్ద శంఖాన్ని వుంచుతారు. శంఖాలు వున్న చోట నుండి లక్ష్మి తరలిపోదు. ఆడ మగ శంఖాలని రెండు కలిపి స్తాపించాలి.
గణేష్ శంకాలలో నీరు నింపి గర్భవతులకు త్రాగించినట్లయితే గ్రుడ్డి, కుంటి, మూగ మొదలైన సంతానం కలగదు. అన్నపూర్ణ శంఖాన్ని ఆహారపదార్థాలలో స్థాపించి పూజిస్తారు. మణిపుష్పక్‌, పాంచ జన్యాలను కూడా అక్కడ స్థాపించి పూజిస్తారు. చిన్న శంఖ మాలలను ధరించి కూడా అనేక సిద్ధులను పొందుచున్నారు.
శాస్త్రవేత్తలు అభిప్రాయానుసారం శంఖ ధ్వని వల్ల వాతావరణ లోపాలు, కీటకముల నాశనం జరుగుతుందని -అనేక ప్రయోగాలు చేసి నిరూపించారు. శంఖ బస్మము వల్ల అనేక రోగాలు నయము అగుచున్నవి. ఋషి శృంగుడు చెప్పిన విధానం ప్రకారం చంటి పిల్లలకు శంఖమాలలు ధరింపచేసి వాటితో నింపిన నీరును త్రాగించినట్లయితే పిల్లలు ఆరోగ్యవంతులు అవుతారు. శంఖాన్ని పూరించుట వల్ల శ్వాశకోశ రోగాలు నశిస్తాయి. కొన్ని శంఖాలు చెవి దగ్గర పెట్టుకుంటే ఓంకార నాధం వినిపిస్తుంది. దానివల్ల భక్తుల కోర్కెలు తీరును. ఈ శంఖాలు వల్ల ఆయువృద్ధి, లక్ష్మీ ప్రాప్తి, పుత్రప్రాప్తి, శాంతి, వివాహ ప్రాప్తి కలుగుచున్నవి. శంఖము పాపనాశిని ప్రతి ఇంటిలోను శంఖము వుండవలసిన వస్తువు శంఖము వున్న ఇల్లు లక్ష్మీ నివాసము.
కొన్ని శంఖాల వివరణ:
దక్షిణావృత శంఖాలను పూజకు మాత్రమే ఉపయోగిస్తారు. ఉత్తరావృతాన్ని ఊదుటకు ఉపయోగిస్తారు. దక్షణావృతంలో శివశంఖం, పాంచజన్యం మొదలగు రకాలున్నవి. పాంచజన్యం పురుష శంఖం ఇది దొరుకుట కష్టం. శని శంఖాలకు నోరు పెద్దది పొట్ట చిన్నది. రాహు, కేతు శంఖాలు సర్పాకారంలో ఉంటాయి. రాక్షస శంఖానికి అన్నీ ముళ్లుంటాయి. ముత్యపు శంఖాలు పాలిష్‌ వల్ల వెండిలా మెరుస్తూ వుంటాయి. వినాయక శంఖం తొండాలతో కూడి ఉంటుంది. కూర్మ, వరాహ శంఖాలు తాబేలు, పంది ఆకారంలో ఉంటాయి. శంఖాలు ఎక్కువుగా రామేశ్వరం, కన్యాకుమారి, మద్రాసు, విశాఖపట్నం కలకత్తా, బొంబాయి మరియు పూరీలో ఎక్కువుగా దొరుకుచున్నవి.
సముద్రతనయాయ విద్మహే శంఖరాజాయ ధీమహీ తన్నో శంఖప్రచోదయాత్‌


లోడ్ అవుతోంది

Featured Post

Fixation of Mutation Fee in Gram Panchayats in the State

GOVERNMENT OF TELANGANA ABSTRACT Panchayat Raj & Rural Development Department – Mutation Fee – Fixation of Mutation Fee ...

Popular Posts