*విశ్వబ్రాహ్మణులని ఎందుకు అంటారు?*
గ్రామంలో ఒక స్థలంలో కమ్మరి, వడ్రంగి , కంచరి , శిల్పి ,స్వర్ణకారి ఈ ఐదు వృత్తులనూ చేస్తూ గ్రామంలోని ప్రజలకు కావల్సిన వస్తువులను సమకూర్చేవారు. ఆ స్థలాన్నే విశ్వకర్మశాల అని ఆ రోజుల్లో వ్యవహరించేవాళ్ళు. విశ్వబ్రాహ్మణులు (విశ్వకర్మలు) చేయు వృత్తులు.
*1. కమ్మరి : –*
పంచ వృత్తులలో మొట్టమొదటి వృత్తి కమ్మరము (అయో కారుడు). ఇనుమును కరిగించి వస్తువులను తయారు చేసి ప్రపంచ పారిశ్రామిక వ్యవస్థకు మూల పురుషుడు లోహశిల్పి కమ్మరి. కమ్మరి ముడి ఇనుమును సంగ్రహించడం, ఇనుముతొ వస్తువులు తయారు చెయ్యడం, ఆ ఇనుముతో వ్యవసాయానికి కావల్సిన కొడవళ్ళు, కర్రు, పార, పలుగు, గునపం, గొడ్డలి, బండికట్టు మొదలైనవి కాకుండా , దేశానికి కావల్సిన వంతెనలు, పరిశ్రమలు, పడవలు, ఫిరంగులు, కత్తులు … ఇనుప వస్తువు ప్రతిదీ చేసి ఇచ్చే మొట్ట మొదటి మెటల్ ఇంజనీర్ లోహ స్థపతి.
ఆంధ్ర ప్రదేశ్ షెడ్యూల్డు తెగల జాబితా లో 10వ కులంగా చెప్పబడుతున్న బయట కమ్మరులకు, విశ్వబ్రాహ్మణ / విశ్వకర్మ కుల సాంప్రదాయ కమ్మరులకు ఎటువంటి సంబంధమూ లేదు. షెడ్యూల్డు తెగలలోని కమ్మరులు దేశ దిమ్మరులు.
విశ్వబ్రాహ్మణ / విశ్వకర్మ కుల సాంప్రదాయ కమ్మరులు ఆంధ్ర ప్రదేశ్ లోని బి.సి కులాల జాబితాలో 21వ కులంగా నిర్ణయించబడి ఉన్నారు.
ఉదా : – ఆ రోజుల్లోనే వీరు చేసిన ఇనుములోని స్వఛ్ఛత ఈ రోజుకీ నేటి విదేశీ ఇంజనీర్లు సైతం రాబట్ట లేక పోతున్నారు. ఉదాహరణకి ఢిల్లీ లోని విఠోబా స్థంబమే. దానిని తయారు చేసి వందల సంవత్సరాలు గడిచినా నా, అది ఈ రోజుకీ తుప్పు పట్టలేదు.ఆ ఇనుము యొక్క స్వఛ్ఛత ఈరోజుకీ ఎవ్వరూ సాధించలేదు.
*2. వడ్రంగి :-*
పంచ వృత్తులలో రెండవ వృత్తి ఈ వడ్రంగము. వడ్రంగి కలపతో వస్తువులు తయారుచేయు వృత్తిపనివాడు. వడ్రంగి (దారు కారుడు) వ్యవసాయానికి కావల్సిన కాడి, మేడి, నాగలి, బండి..మొదలైనవీ, ప్రజలు బ్రతకడానికి కావల్సిన ఇల్లు, తలుపు, ద్వారము, దార బంద్రం, పీట, మంచం, కుర్చీలు మొదలగునవి తయారు చేసి ఇవ్వడం మానవాళి జీవితం సుఖమయం కావడానికి తోడ్పడుచున్నారు. మానవ జీవిత చరిత్రలో అభివృద్ధికి మొట్ట మొదటి మెట్టయిన ‘చక్రం’…చక్కతో తయారయ్యే ప్రతిదీ…పిల్లలు ఆడుకున్నే బొంగరం నుండి దేవుణ్ణి ఊరేగించే రథం వరకూ, ఊయల నుండి పడవల వరకు..తయారు చేసే మొట్ట మొదటి వుడ్ ఇంజనీర్ .
*3. కంచరి :-*
పంచ వృత్తులలో మూడవ వృత్తి కంచరి (కాంస్యకారుడు) ప్రజలకు కావల్సిన ఇత్తడి, రాగి, కంచు పాత్రలు ఉగ్గు గిన్నెల దగ్గర్నుండి గంగాళాల వరకు … ముడి ఇత్తడి సంగ్రహించడం దగ్గర్నించి, దానిని ఇత్తడిగా, రాగిగా, కంచుగా మార్చి కరిగించి కావల్సిన ఆకారం లోకి పోత పోసే వరకు ఉద్ధరిణిల దగ్గరినుండి ఊరేగింపు వాహనాల వరకూ, దేవాలయాలలో పంచలోహా విగ్రహాలను మొదలగునవి … ప్రతి పని చేసే మొట్ట మొదటి మెటల్ అల్లాయ్ ఇంజనీర్.
No comments:
Post a Comment