Menu
- Home
- Finance Comm▼
- Schemes▼
- Grampanchayat▼
- T.S.P.R.Act,2018▶
- G.P.Tender Rules
- Municipal Related ▶
- New AP G.Os
- Spiritual▶
- shivarchana
- Shiva Rathri Pooja
- Wonders in Slokas
- Sandhya Vandanam
- About Geetha
- Hindu Culture
- Shani Trayodashi
- Why Vishwabrahmins
- F.A.Q on Geetha
- Name of Days
- Namakam
- Jyothirlingas
- About Vedas
- Mahalaxmi Stotram
- Importance of Dwajastabham
- Speciality of Magha Masham
- Meditation
- Vashanta Panchami
- Principles to visit the Temples
- Who is Brahmin
- Specialty of Pushya Masham
- History of Vishwakarma
- Dharma Sutras
- Kalagnanam
- Principals of Ethics
- Leadership Qulaities
Tuesday, February 28, 2017
Thursday, February 23, 2017
Maha Shivarathri
మహాశివ రాత్రి పూజా విధానం
జ్యోతిష శాస్త్రాన్ననుసరించి మాఘ కి దగ్గరవుతాడు. ఆ సమయంలో జీవన రూపమైన చంద్రునికి, శివరూపుడైన సూర్యునికి మధ్య యోగం కలుగుతుంది. అందువల్ల ఈ చతుర్దశినాడు శివపూజ చేసిన వారికి అభీష్టసిద్ధి కలుగుతుంది. శివుడు అభిషేకప్రియుడు. కాబట్టి దుఃఖనివృత్తికై క్షీరంతోనూ, బుద్ధివికాసానికి పంచదారతోనూ, శత్రునాశనానికి తైలంతోనూ, భోగప్రాప్తికి సుగంధ ద్రవ్యజలంతో, ఐశ్వర్యానికి తేనెతో, సంతానప్రాప్తికి చెరకు రసంతో, మోక్షప్రాప్తికి గంగాజలంతో అభిషేకించాలని పురాణాలు పేర్కొన్నాయి.
ఉప మపేపిశత్తమః కృష్ణం వ్యవక్తమస్థిత్ !
ఉష ఋణేన యాతయ !!
మహాశివరాత్రి వ్రతాన్ని రాత్రిపూట జరుపుకుంటారు. అందువల్ల కృష్ణపక్ష చతుర్థశి రోజు వచ్చిన రాత్రికి ఒక ప్రత్యేకత వుంది. చతుర్థశి రోజు ఎవరైతే శివపూజను చేస్తారో ఆ రాత్రి జాగారం చేస్తారో వారికి మళ్ళీ తల్లిపాలు తాగే అవసరం రాదు (మరుజన్మ ఉండడు).
శివతంతు పూజయత్వా యోజా గర్తిచ చతుర్దిశీం !
మాతుః పయోధర రసం నపిబేత్ స కదాచన !!
గరుడ, పద్మ, స్కంద, అగ్ని మొదలైన పురాణాలలో దీనిని ప్రశంసించడం జరిగింది. మనుషులు ఎవరైతే శివరాత్రి రోజున ఉపవాసం చేసి, బిల్వపత్రాలతో శివపూజ, రాత్రి జాగరణ చేస్తారో వారిని పరమశివుడు నరకాన్నుండి రక్షిస్తాడు, ఆనందాన్ని, మోక్షాన్ని ప్రసాదిస్తాడు. వ్రతం చేసేవారు శివమయంలో లీనమైపోతాడు. దానం, తపం, యజ్ఞం, తీర్థయాత్రలు, వ్రతాలు లాంటివి ఎన్ని కలిపినా మహాశివరాత్రికి సరితూగలేవు.
వరాహోపనిషత్తు లో ఈ విధంగా చెప్పబడింది.
ఉప సమీపే యో వాసః జీవాత్మ పరమాత్మ నోః
ఉపవాసః సవిఘ్నేయ సర్వభోగ వసర్జిత్ః
భవిష్యపురాణంలో కూడా ఈ విధంగా చెప్పబడింది.
ఉపావృత్తస్య పాపేభ్యోయస్సు వాసో గుణైః సహా
ఉపవాసః స విఘ్నేయ సర్వభోగ వివర్జిత్ః
మహాశివరాత్రి వ్రతంలో జాగరణ అవసరము, వ్రతానికి యోగ్యమైన కాలం రాత్రి, ఎందుకంటే రాత్రిపూట భూత, శక్తులు, శివుడు తిరిగే సమయం అన్నమాట. చతుర్థశి రాత్రి ఆయనను పూజించి అభిషేకించాలి. భగవాన్ శ్రీకృష్ణుడు గీతలో ఈ విధంగా స్పష్టంగా చెప్పాడు. 'సమస్త ప్రాణుల నిగ్రహ పురుషుడు రాత్రికాలంలో మేల్కొని తిరుగుతూ ఉంటాడు. అతనిలోని ప్రాణులన్నీ జాగృతంగా ఉంటాయి. అంటే భోగ, సంగ్రహంలో మునిగి ఉంటారు. తత్వాన్ని అర్థం చేసుకోగల మునులు దృష్టిలో రాత్రి అది.
శివరాత్రి పర్వదినానికి ఎంతటి మహాత్మ్యం ఉందో తెలియచెప్పే కథ ఇది. శక్తి ఉన్నవారు, పండితులు శాస్త్రబద్ధంగా వ్రతాలు, పూజలు శివరాత్రినాడు చేసి పుణ్యఫలం పొందుతుంటారు. మరి అలాంటివేవీ లేని సామాన్యుల పరిస్థితి ఏమిటి? అనే ప్రశ్నకు సమాధానం కూడా ఈ కథాంశంలో దొరుకుతుంది. బిల్వ దళార్చన, జలాభిషేకం అంటే శివుడికి ఎంత ప్రీతో కూడా ఇక్కడ అవగతమవుతుంది. ఇంకా విచిత్రమేమిటంటే ఈ కథంతా ఓ ఆటవికుడు, ఓ మూడు లేళ్ళ నడుమ జరిగింది కావటం. శివపురాణం కోటి రుద్రసహిత నలభయ్యో అధ్యాయంలో ఈ కథ ఉంది.
పూర్వం ఓ అడవిలో ఓ వేటగాడు ఉండేవాడు. అడవిలో ఉన్న జంతువులను సంహరిస్తూ తన కుటుంబాన్ని పోషించుకోవటమే అతని పని. అతను చిన్నప్పటి నుంచి ఒక్క పుణ్యకార్యమూ చేయలేదు. దాదాపు అడవిలో ఉన్న జంతువులన్నింటినీ తన కుటుంబ పోషణ కోసమే బలిపెట్టాడు ఆ భిల్లుడు. ఇలా ఉండగా ఓ రోజున అతడి తల్లి,తండ్రి, భార్య ఇంట్లో తినటానికి ఏమీ లేదని, ఆహారంగా ఏ జంతువునైనా చంపి తెమ్మనమని కోరారు. తన కుటుంబ సభ్యుల ఆకలిని తీర్చటం కోసం విల్లు, అమ్ములు తీసుకొని అడవిలోకి బయలుదేరి వెళ్ళాడు ఆ భిల్లుడు. ఆ రోజున ఎంతసేపు వెతికినా ఒక్క జంతువూ అతని కంట పడలేదు. అలా సూర్యాస్తమయం కావటం, ఇంకా చీకటి పడటం జరిగింది. ఎలాగైనా సరే ఒక్క మృగాన్నైనా వేటాడి కానీ ఇంటికి వెళ్ళకూడదనుకున్నాడు. ఓ పక్క ఆకలి, మరో పక్క ఏ జంతువూ దొరకలేదన్న కోపమూ, బాధ వెంటాడసాగాయి. ఇంతలో అతనికి ఒక మారేడు చెట్టు కనిపించింది. ఆ చెట్టు సమీపంలోనే ఒక నీటి మడుగు కూడా ఉంది.
ఆ రోజు శివరాత్రి అని అతనికి తెలియకపోయినా అనుకోకుండానైనా శివలింగం మీద మారేడు దళాలను ఉంచి పూజించిన ఫలితం, శివలింగానికి జలాభిషేకం చేసిన పుణ్యఫలితం వెంటనే వేటగాడికి ప్రాప్తించాయి. దాంతో తెలియకుండానే అతనిలో ఉన్న క్రూరత్వం చాలా వరకు నశించింది. తనపై బాణాన్ని సంధించబోతున్న ఆ బోయతో ఆ ఆడ లేడి ఏమి చెయ్యబోతున్నాడో చెప్పమని బోయవాడిని అడిగింది. ఆ బోయ కూడా అసత్యమాడకుండా లేడిన చంపి తనకు, తన కుటుంబానికి ఆహారంగా వినియోగించబోతున్నట్లు చెప్పాడు. అప్పుడు ఆ లేడి ఇతరులకు ఉపయోగపడబోతున్నందుకు తనకెంతో ఆనందంగా ఉందని, అయితే ఇంటి దగ్గర తన పసిపిల్లలున్నారని, వారిని తన సోదరికి, తన భర్తకు అప్పగించి వస్తానని అంది.
బోయవాడు ముందు ఆ మాటలు వినలేదు కానీ ఆ తర్వాత లేడి చేసిన శపథాలను విని దాన్ని వెళ్ళి రమ్మనమని చెప్పాడు. ఇదంతా జరిగేసరికి శివరాత్రి నాడు మొదటి జాము ముగిసింది. బోయ మళ్ళీ చెట్టెక్కి అంతకు ముందు లాగానే జంతువుల కోసం ఎదురు చూడసాగాడు. ఇంతలో మరొక ఆడ లేడి వచ్చింది. దాన్ని వేటాడబోతుండగా మళ్ళీ కాసిని మారేడు ఆకులు, చంకకు తగిలించుకున్న తాబేటి కాయ నుండి కాసిని నీళ్ళు చెట్టుకింద ఉన్న శివలింగం మీద పడ్డాయి. రెండో లేడి కూడా వేటగాడిని నన్నేం చేయబోతున్నావు అని అడిగింది. అతను మొదటి లేడికి చెప్పినట్టే చెప్పాడు. అప్పుడు ఆ లేడి కూడా ఇంటి దగ్గర తన భర్త, పిల్లలు ఉన్నారని, అంతకు ముందే తన సోదరి బయటకు వచ్చి ఎంతకూ ఇంటికి తిరిగి రాకపోవటంతో ఆమెను వెతుకుతూ తాను వచ్చానని అంది. పిల్లలను భర్తకు, సోదరికి అప్పగించి తాను వస్తానని అప్పుడు ఆహారంగా స్వీకరించమని చెప్పింది. నమ్మకమేమిటి అని లేడిని అతను ప్రశించాడు. అది కూడా సత్య శపథాలు చేసింది.
శివలింగానికి మారేడు దళాలు, జలాభిషేకంతో అతని క్రూరత్వం అంతా నశించినందు వల్ల లేడిని వెళ్ళి రమ్మన్నాడు. అప్పటికి రెండో జాము ముగిసింది. మూడో జాములో ఒక మగ లేడి అటుగా వచ్చింది. దాన్ని వేటాడాలని అనుకున్నంతలో అతని కదలికలకు కాసిని మారేడు దళాలు, కాసిని నీరు మళ్లీ శివలింగం మీద పడ్డాయి.
మగ లేడి కూడా అతనితో పరులకు ఉపయోగపడటం కన్నా ఈ శరీరానికి కావలసినది ఏమిటి? అయితే ఇంటి దగ్గర ఇద్దరు భార్యలు, పిల్లలు ఉన్నారని, భార్యలకు పిల్లల బాధ్యతలను అప్పగించి తాను తిరిగొస్తానని చెప్పింది. ఆ వేటగాడు సత్యభూషణం మీద నమ్మకంతో వెళ్ళి రమ్మన్నాడు. మూడు లేళ్ళు ఒక చోట చేరి బోయవాడి సంగతి ముచ్చటించుకుంటున్నాయి. అవి నేనంటే నేనే ముందు వెళతానని బోయవాడికిచ్చిన మాటను తప్పడం బాగుండదని వాటిలో అవి వాదించుకున్నాయి. చివరకు మూడు లేళ్ళూ తమ పిల్లలను పొరుగు లేళ్ళకు అప్పగించి వాటిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి వేటగాడికిచ్చిన మాటను నిలబెట్టుకోవటానికి బయులుదేరాయి. తమ తండ్రి, తల్లులు ఇచ్చిన మాట నిలబెట్టుకోవటానికి ప్రాణాలను సైతం లెక్కచేయక పోవటాన్ని చూసిన పిల్లలు అంతటి ఉత్తములైన ఆ పెద్దల బాటలోనే నడవాలని నిశ్చయించుకొని అవి కూడా బయులుదేరాయి. అలా ఆ లేళ్ళన్నీ మాట నిలుపుకోవటానికి పిల్లలతో సహా తరలి రావటాన్ని చూసిన వేటగాడికి మనస్సు చలించిపోయింది.
జంతు జన్మనెత్తిన వాటికి సత్యవాక్యాన్ని పాలించే అంత గొప్ప మనస్సుంటే మనిషిగా పుట్టిఇన్నాళ్ళూ తాను హింస చేస్తూ బతుకుతున్నందుకు వాడికి పశ్చాత్తాపం కలిగింది. వాటిని ఆదరించి తిరిగి వెళ్ళిపోమ్మని చెప్పాడు. బోయవాడిలో కలిగిన ఆ మంచి మార్పు, ఆ రాత్రి ప్రతి జాములోనూ చేసిన మారేడు దళాల పూజ, జలాభిషేకం, జాగారం, ఉపవాసం ఇవన్నీ శివుడికి ప్రీతి కలిగించి అక్కడ ప్రత్యక్షమయ్యాడు. మరుసటి జన్మలో ఆ భిల్లుడు గుహుడు అనే పేరున జన్మించి దశరథ మహారాజు కుమారుడైన శ్రీ రామచంద్రుడికి సేవ చేసే భాగ్యాన్ని పొందుతాడని శివుడు వరమిచ్చాడు. అలాగే బోయవాడికి కన్పించిన లేళ్ళు కూడా సత్యాన్ని పాలించినందుకు మోక్షాన్ని పొందుతాయని శివుడు చెప్పాడు. ఆనాడిక్కడ ప్రత్యక్షమైన శివుడే వ్యాదేశ్వరుడు అనే శివలింగంగా అవతరించాడు. సంస్కృతంలో వ్యాద శబ్దానికి తెలుగులో బోయ అని అర్థం.
ఈ కథలో శివరాత్రి మహాత్య్మం మారేడు దళాల పూజ, జలాభిషేకం వ్యాదేశ్వర అవతారం ఇవన్నీ అటుంచిన ఓ గొప్ప సందేశం ఉంది. ఇచ్చిన మాట నిలబెట్టుకోవటంలో ఉన్న గొప్పతనం, తల్లిదండ్రులు ఎంత నీతి, నిజాయితీలతో ఉంటే పిల్లలు కూడా అదే బాటలో నడుస్తారని చెప్పే సందేహాలు ఇమిడి ఉన్నాయి. వీటిని గమనించి ఆచరిస్తే గొప్ప పుణ్యఫలందక్కినట్టే అవుతుంది. అసలు మన పండుగలు, పర్వదినాలు, వ్రతాలు కథలలోని గొప్ప అంతరార్థం ఇదే.
జ్యోతిష శాస్త్రాన్ననుసరించి మాఘ కి దగ్గరవుతాడు. ఆ సమయంలో జీవన రూపమైన చంద్రునికి, శివరూపుడైన సూర్యునికి మధ్య యోగం కలుగుతుంది. అందువల్ల ఈ చతుర్దశినాడు శివపూజ చేసిన వారికి అభీష్టసిద్ధి కలుగుతుంది. శివుడు అభిషేకప్రియుడు. కాబట్టి దుఃఖనివృత్తికై క్షీరంతోనూ, బుద్ధివికాసానికి పంచదారతోనూ, శత్రునాశనానికి తైలంతోనూ, భోగప్రాప్తికి సుగంధ ద్రవ్యజలంతో, ఐశ్వర్యానికి తేనెతో, సంతానప్రాప్తికి చెరకు రసంతో, మోక్షప్రాప్తికి గంగాజలంతో అభిషేకించాలని పురాణాలు పేర్కొన్నాయి.
ఉప మపేపిశత్తమః కృష్ణం వ్యవక్తమస్థిత్ !
ఉష ఋణేన యాతయ !!
మహాశివరాత్రి వ్రతాన్ని రాత్రిపూట జరుపుకుంటారు. అందువల్ల కృష్ణపక్ష చతుర్థశి రోజు వచ్చిన రాత్రికి ఒక ప్రత్యేకత వుంది. చతుర్థశి రోజు ఎవరైతే శివపూజను చేస్తారో ఆ రాత్రి జాగారం చేస్తారో వారికి మళ్ళీ తల్లిపాలు తాగే అవసరం రాదు (మరుజన్మ ఉండడు).
శివతంతు పూజయత్వా యోజా గర్తిచ చతుర్దిశీం !
మాతుః పయోధర రసం నపిబేత్ స కదాచన !!
గరుడ, పద్మ, స్కంద, అగ్ని మొదలైన పురాణాలలో దీనిని ప్రశంసించడం జరిగింది. మనుషులు ఎవరైతే శివరాత్రి రోజున ఉపవాసం చేసి, బిల్వపత్రాలతో శివపూజ, రాత్రి జాగరణ చేస్తారో వారిని పరమశివుడు నరకాన్నుండి రక్షిస్తాడు, ఆనందాన్ని, మోక్షాన్ని ప్రసాదిస్తాడు. వ్రతం చేసేవారు శివమయంలో లీనమైపోతాడు. దానం, తపం, యజ్ఞం, తీర్థయాత్రలు, వ్రతాలు లాంటివి ఎన్ని కలిపినా మహాశివరాత్రికి సరితూగలేవు.
వరాహోపనిషత్తు లో ఈ విధంగా చెప్పబడింది.
ఉప సమీపే యో వాసః జీవాత్మ పరమాత్మ నోః
ఉపవాసః సవిఘ్నేయ సర్వభోగ వసర్జిత్ః
భవిష్యపురాణంలో కూడా ఈ విధంగా చెప్పబడింది.
ఉపావృత్తస్య పాపేభ్యోయస్సు వాసో గుణైః సహా
ఉపవాసః స విఘ్నేయ సర్వభోగ వివర్జిత్ః
మహాశివరాత్రి వ్రతంలో జాగరణ అవసరము, వ్రతానికి యోగ్యమైన కాలం రాత్రి, ఎందుకంటే రాత్రిపూట భూత, శక్తులు, శివుడు తిరిగే సమయం అన్నమాట. చతుర్థశి రాత్రి ఆయనను పూజించి అభిషేకించాలి. భగవాన్ శ్రీకృష్ణుడు గీతలో ఈ విధంగా స్పష్టంగా చెప్పాడు. 'సమస్త ప్రాణుల నిగ్రహ పురుషుడు రాత్రికాలంలో మేల్కొని తిరుగుతూ ఉంటాడు. అతనిలోని ప్రాణులన్నీ జాగృతంగా ఉంటాయి. అంటే భోగ, సంగ్రహంలో మునిగి ఉంటారు. తత్వాన్ని అర్థం చేసుకోగల మునులు దృష్టిలో రాత్రి అది.
శివరాత్రి పర్వదినానికి ఎంతటి మహాత్మ్యం ఉందో తెలియచెప్పే కథ ఇది. శక్తి ఉన్నవారు, పండితులు శాస్త్రబద్ధంగా వ్రతాలు, పూజలు శివరాత్రినాడు చేసి పుణ్యఫలం పొందుతుంటారు. మరి అలాంటివేవీ లేని సామాన్యుల పరిస్థితి ఏమిటి? అనే ప్రశ్నకు సమాధానం కూడా ఈ కథాంశంలో దొరుకుతుంది. బిల్వ దళార్చన, జలాభిషేకం అంటే శివుడికి ఎంత ప్రీతో కూడా ఇక్కడ అవగతమవుతుంది. ఇంకా విచిత్రమేమిటంటే ఈ కథంతా ఓ ఆటవికుడు, ఓ మూడు లేళ్ళ నడుమ జరిగింది కావటం. శివపురాణం కోటి రుద్రసహిత నలభయ్యో అధ్యాయంలో ఈ కథ ఉంది.
పూర్వం ఓ అడవిలో ఓ వేటగాడు ఉండేవాడు. అడవిలో ఉన్న జంతువులను సంహరిస్తూ తన కుటుంబాన్ని పోషించుకోవటమే అతని పని. అతను చిన్నప్పటి నుంచి ఒక్క పుణ్యకార్యమూ చేయలేదు. దాదాపు అడవిలో ఉన్న జంతువులన్నింటినీ తన కుటుంబ పోషణ కోసమే బలిపెట్టాడు ఆ భిల్లుడు. ఇలా ఉండగా ఓ రోజున అతడి తల్లి,తండ్రి, భార్య ఇంట్లో తినటానికి ఏమీ లేదని, ఆహారంగా ఏ జంతువునైనా చంపి తెమ్మనమని కోరారు. తన కుటుంబ సభ్యుల ఆకలిని తీర్చటం కోసం విల్లు, అమ్ములు తీసుకొని అడవిలోకి బయలుదేరి వెళ్ళాడు ఆ భిల్లుడు. ఆ రోజున ఎంతసేపు వెతికినా ఒక్క జంతువూ అతని కంట పడలేదు. అలా సూర్యాస్తమయం కావటం, ఇంకా చీకటి పడటం జరిగింది. ఎలాగైనా సరే ఒక్క మృగాన్నైనా వేటాడి కానీ ఇంటికి వెళ్ళకూడదనుకున్నాడు. ఓ పక్క ఆకలి, మరో పక్క ఏ జంతువూ దొరకలేదన్న కోపమూ, బాధ వెంటాడసాగాయి. ఇంతలో అతనికి ఒక మారేడు చెట్టు కనిపించింది. ఆ చెట్టు సమీపంలోనే ఒక నీటి మడుగు కూడా ఉంది.
Page.NO.2
భిల్లుడి మనస్సులో తళుక్కున ఆలోచన ఒకటి మెదిలింది. మడుగులో ఉన్న నీళ్ళు తాగటానికి ఏదో ఒక జంతువు అటు వచ్చి తీరుతుంది కనుక వెంటనే మారేడు చెట్టు పైకెక్కి ఓ కొమ్మ మీద నక్కి కూర్చొని అటొచ్చిన జంతువును వేటాడవచ్చని అనుకొన్నాడు. వెంటనే తనతో తెచ్చుకున్న తాబేటి కాయ (మంచినీరు తెచ్చుకొనే పాత్ర)లోమడుగులో ఉన్న నీరు నింపుకొని మారేడు చెట్టు కొమ్మ పైకి ఎక్కి కూర్చొన్నాడు. దైవలీలగానో, విచిత్రంగానో ఆ చెట్టు కిందే అంతకు ముందు ఎవరో ఉంచిన ఓ శివలింగం ఉంది. ఆ రాత్రి తొలిజాము గడుస్తుండగా అతని నిరీక్షణ ఫలించింది. ఒక లేడి మడుగులో నీరు తాగటానికి వచ్చింది. లేడి కన్పించిదన్న ఆనందంలో విల్లును, బాణాన్ని సిద్ధం చేస్తుండగా చెట్టుకున్న నాలుగు మారేడు దళాలు, తాబేటి కాయలో ఉన్న నీరు చెట్టు కింద ఉన్న శివలింగం మీద పడ్డాయి.ఆ రోజు శివరాత్రి అని అతనికి తెలియకపోయినా అనుకోకుండానైనా శివలింగం మీద మారేడు దళాలను ఉంచి పూజించిన ఫలితం, శివలింగానికి జలాభిషేకం చేసిన పుణ్యఫలితం వెంటనే వేటగాడికి ప్రాప్తించాయి. దాంతో తెలియకుండానే అతనిలో ఉన్న క్రూరత్వం చాలా వరకు నశించింది. తనపై బాణాన్ని సంధించబోతున్న ఆ బోయతో ఆ ఆడ లేడి ఏమి చెయ్యబోతున్నాడో చెప్పమని బోయవాడిని అడిగింది. ఆ బోయ కూడా అసత్యమాడకుండా లేడిన చంపి తనకు, తన కుటుంబానికి ఆహారంగా వినియోగించబోతున్నట్లు చెప్పాడు. అప్పుడు ఆ లేడి ఇతరులకు ఉపయోగపడబోతున్నందుకు తనకెంతో ఆనందంగా ఉందని, అయితే ఇంటి దగ్గర తన పసిపిల్లలున్నారని, వారిని తన సోదరికి, తన భర్తకు అప్పగించి వస్తానని అంది.
బోయవాడు ముందు ఆ మాటలు వినలేదు కానీ ఆ తర్వాత లేడి చేసిన శపథాలను విని దాన్ని వెళ్ళి రమ్మనమని చెప్పాడు. ఇదంతా జరిగేసరికి శివరాత్రి నాడు మొదటి జాము ముగిసింది. బోయ మళ్ళీ చెట్టెక్కి అంతకు ముందు లాగానే జంతువుల కోసం ఎదురు చూడసాగాడు. ఇంతలో మరొక ఆడ లేడి వచ్చింది. దాన్ని వేటాడబోతుండగా మళ్ళీ కాసిని మారేడు ఆకులు, చంకకు తగిలించుకున్న తాబేటి కాయ నుండి కాసిని నీళ్ళు చెట్టుకింద ఉన్న శివలింగం మీద పడ్డాయి. రెండో లేడి కూడా వేటగాడిని నన్నేం చేయబోతున్నావు అని అడిగింది. అతను మొదటి లేడికి చెప్పినట్టే చెప్పాడు. అప్పుడు ఆ లేడి కూడా ఇంటి దగ్గర తన భర్త, పిల్లలు ఉన్నారని, అంతకు ముందే తన సోదరి బయటకు వచ్చి ఎంతకూ ఇంటికి తిరిగి రాకపోవటంతో ఆమెను వెతుకుతూ తాను వచ్చానని అంది. పిల్లలను భర్తకు, సోదరికి అప్పగించి తాను వస్తానని అప్పుడు ఆహారంగా స్వీకరించమని చెప్పింది. నమ్మకమేమిటి అని లేడిని అతను ప్రశించాడు. అది కూడా సత్య శపథాలు చేసింది.
శివలింగానికి మారేడు దళాలు, జలాభిషేకంతో అతని క్రూరత్వం అంతా నశించినందు వల్ల లేడిని వెళ్ళి రమ్మన్నాడు. అప్పటికి రెండో జాము ముగిసింది. మూడో జాములో ఒక మగ లేడి అటుగా వచ్చింది. దాన్ని వేటాడాలని అనుకున్నంతలో అతని కదలికలకు కాసిని మారేడు దళాలు, కాసిని నీరు మళ్లీ శివలింగం మీద పడ్డాయి.
మగ లేడి కూడా అతనితో పరులకు ఉపయోగపడటం కన్నా ఈ శరీరానికి కావలసినది ఏమిటి? అయితే ఇంటి దగ్గర ఇద్దరు భార్యలు, పిల్లలు ఉన్నారని, భార్యలకు పిల్లల బాధ్యతలను అప్పగించి తాను తిరిగొస్తానని చెప్పింది. ఆ వేటగాడు సత్యభూషణం మీద నమ్మకంతో వెళ్ళి రమ్మన్నాడు. మూడు లేళ్ళు ఒక చోట చేరి బోయవాడి సంగతి ముచ్చటించుకుంటున్నాయి. అవి నేనంటే నేనే ముందు వెళతానని బోయవాడికిచ్చిన మాటను తప్పడం బాగుండదని వాటిలో అవి వాదించుకున్నాయి. చివరకు మూడు లేళ్ళూ తమ పిల్లలను పొరుగు లేళ్ళకు అప్పగించి వాటిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి వేటగాడికిచ్చిన మాటను నిలబెట్టుకోవటానికి బయులుదేరాయి. తమ తండ్రి, తల్లులు ఇచ్చిన మాట నిలబెట్టుకోవటానికి ప్రాణాలను సైతం లెక్కచేయక పోవటాన్ని చూసిన పిల్లలు అంతటి ఉత్తములైన ఆ పెద్దల బాటలోనే నడవాలని నిశ్చయించుకొని అవి కూడా బయులుదేరాయి. అలా ఆ లేళ్ళన్నీ మాట నిలుపుకోవటానికి పిల్లలతో సహా తరలి రావటాన్ని చూసిన వేటగాడికి మనస్సు చలించిపోయింది.
జంతు జన్మనెత్తిన వాటికి సత్యవాక్యాన్ని పాలించే అంత గొప్ప మనస్సుంటే మనిషిగా పుట్టిఇన్నాళ్ళూ తాను హింస చేస్తూ బతుకుతున్నందుకు వాడికి పశ్చాత్తాపం కలిగింది. వాటిని ఆదరించి తిరిగి వెళ్ళిపోమ్మని చెప్పాడు. బోయవాడిలో కలిగిన ఆ మంచి మార్పు, ఆ రాత్రి ప్రతి జాములోనూ చేసిన మారేడు దళాల పూజ, జలాభిషేకం, జాగారం, ఉపవాసం ఇవన్నీ శివుడికి ప్రీతి కలిగించి అక్కడ ప్రత్యక్షమయ్యాడు. మరుసటి జన్మలో ఆ భిల్లుడు గుహుడు అనే పేరున జన్మించి దశరథ మహారాజు కుమారుడైన శ్రీ రామచంద్రుడికి సేవ చేసే భాగ్యాన్ని పొందుతాడని శివుడు వరమిచ్చాడు. అలాగే బోయవాడికి కన్పించిన లేళ్ళు కూడా సత్యాన్ని పాలించినందుకు మోక్షాన్ని పొందుతాయని శివుడు చెప్పాడు. ఆనాడిక్కడ ప్రత్యక్షమైన శివుడే వ్యాదేశ్వరుడు అనే శివలింగంగా అవతరించాడు. సంస్కృతంలో వ్యాద శబ్దానికి తెలుగులో బోయ అని అర్థం.
ఈ కథలో శివరాత్రి మహాత్య్మం మారేడు దళాల పూజ, జలాభిషేకం వ్యాదేశ్వర అవతారం ఇవన్నీ అటుంచిన ఓ గొప్ప సందేశం ఉంది. ఇచ్చిన మాట నిలబెట్టుకోవటంలో ఉన్న గొప్పతనం, తల్లిదండ్రులు ఎంత నీతి, నిజాయితీలతో ఉంటే పిల్లలు కూడా అదే బాటలో నడుస్తారని చెప్పే సందేహాలు ఇమిడి ఉన్నాయి. వీటిని గమనించి ఆచరిస్తే గొప్ప పుణ్యఫలందక్కినట్టే అవుతుంది. అసలు మన పండుగలు, పర్వదినాలు, వ్రతాలు కథలలోని గొప్ప అంతరార్థం ఇదే.
Monday, February 13, 2017
Mahalaxmi Stotram
శ్రీ మహాలక్ష్మీ స్తోత్రం వివరణ:
నమస్తేస్తు మహామాయే! శ్రీపేఠే సురపూజితే!
శంఖచక్రగదాహస్తే ! మహాలక్ష్మీ ! నమోస్తుతే ||
అమ్మా ! శ్రీపీఠనివాసిని ! మహామాయారూపిణీ ! దేవతలచే పూజించబడుతల్లీ ! గదాశంఖచక్రాలను ధరించినదేవీ ! మహాలక్ష్మీ ! నీకు అనేక నమస్కారములు.
సృష్టిస్తితిలయాలకు మూలకారణమైన శక్తికి మహామాయ అనిపేరు. ఆమెయే శ్రీచక్రారూడ. సకలదేవతలుని ఆమెనే పూజిస్తుంటారు. ఆమె శంఖచక్రగదాహస్త అయి, వైష్ణవీరూపంతో మహాలక్ష్మిగా, విష్ణుపత్నిగా జగద్రక్షణ చేస్తూంది. లక్ష్మి అంటే సర్వాన్నీ చూచేది అని ఒక వ్యుత్పత్తి. కనుకనే సర్వాన్నీ రక్షించేదీ అయింది. విష్ణుపత్ని గనుక విష్ణువు ధరించే ఆయుధాలు లక్ష్మికీ వర్తించాయి. ఇది వైష్ణవీరూపం ఇందలి అయుదిసంబోధనలూ అమ్మవారిపంచప్రకృత్యాత్మకశక్తికి సంకేతాలు.
నమస్తే గరుఢారూఢేః ! కోలాసురభయంకరి!
సర్వపాపహరే! దేవి! మహాలక్ష్మి! నమోస్తుతే ||
గరుత్మంతునిపై కూర్చుండి పయనించే తల్లీ ! కోలుడు అనే రాక్షసునికి భయం కల్గించిన దేవీ! సకలపాపహారిణి ! మహాలక్ష్మీ ! నీకు నమస్కారములు.
విష్ణుదేవుని అర్ధాంగి గనుక మహాలక్ష్మికూడా గరుడవాహనయే ! లక్ష్మీసహస్రనామస్తోత్రం 65వ శ్లోకం లో "గరుడో పరిసంస్థితా" అని ఉంది. గరుత్మంతుడు వేదమూర్తి కనుక భగవానుడు అతనిపై సంచరిస్తాడు. అంటే వేదాలపై విహరిస్తాడు. జగన్మాత అయిన లక్ష్మీదేవి కూడా వేదారూఢయే ! అమ్మవారు వేదమాత, కోలా విధ్వంశులనేవాళ్ళు స్వారొచిషమనువు కాలంవాళ్ళు. ఆకాలంలో చైత్రవంశీయుడైన 'సురధుడు' అనే రాజును కోలావిధ్వంశులనేవాళ్ళు జయించి, అతనికి శత్రువులయ్య్యారు. కోలుడు, విధ్వంశుడు అనే ఈ రాక్షసుల్ని అమ్మవారు లక్ష్మీ రూపంతో సమ్హరించింది. కనుక కోలాసుర భయంకరి అయింది. భగవతీనామస్మరణం సర్వపాపాల్నీ నశింపజేస్తుంది.
సర్వజ్ఞే ! సర్వవరదే ! సర్వదుష్ట భయంకరి!
సర్వదుఃఖహరే! దేవి! మహాలక్ష్మి ! నమోస్తుతే ||
సర్వజ్ఞురాలా ! సకలవరాలు ప్రసాదించే దయామయీ! సర్వదుష్టశక్తుల్నీ తోలగించేపరాశక్తీ! అన్ని దుఃఖాలనూ హరించే లక్ష్మీదేవీ! నీకు నమస్కారములు
అమ్మవారు జగన్నాయకి. విష్ణుపత్ని కనుక ఆమెకు తెలియని విషయం ఉండదు. ఎవరికి ఏ సుఖం కల్గినా అది శ్రీదేవియొక్క అనుగ్రహవిశేషమే ! అమ్మ 'సర్వజ్ఞ కనుక సర్వ దుష్టశక్తుల్నీ,దుఃఖాలనీ తొలగించి, అందరికీ సుఖశాంతుల్ని ప్రసాదిస్తూంది. బాహ్యాంతశ్శత్రువులు నశిస్తేనే జీవునికి నిజమైన ఆనందం కల్గుతుంది. ఇందుకు లక్ష్మీదేవియొక్క అనుగ్రహం చాలా ముఖ్యం.
సిద్ధిబుద్ధిప్రదే! దేవి! భుక్తిముక్తిప్రదాయిని !
మంత్రమూర్తే ! సదాదేవె ! మహాలక్ష్మి! నమోస్తుతే ||
సిద్ధినీ బుద్ధినీ ప్రసాదించేతల్లీ ! భుక్తిని, ముక్తిని అనుగ్రహించే దేవీ! మంత్రమూర్తీ! దివ్యకాంతిమయీ ! మహాలక్ష్మీ నీకు నమస్కారము.
అమ్మవారు కార్యసిద్ధిని, అందుకు అవసరమైన బుద్ధిని ప్రసాదిస్తుంది. ఇహపరసౌఖ్యాలు అనుగ్రహిస్తుంది . అమ్మ మంత్రమూర్తి కనుక ఎవరు ఎలా భావించి, పూజిస్తే వారివారికి తగినట్లుగా రక్షణ ఇస్తూంటుంది. కార్యసిద్ధీ, కార్యనిర్వహణబుద్ధీ, భుక్తీ, ముక్తీ ఇలా జీవికి అవసరమైన అన్ని దంద్వాలనూ ప్రసాదించడం అమ్మ ప్రత్యేకత. అన్ని మంత్రాలూ 'శ్రీం' బీజ మయాలే ! కనుక అమ్మ మంత్ర స్వరూపిణి.
ఆద్యంతరహితే ! దేవి! ఆద్యశక్తి ! మహేశ్వరి !
యోగజే ! యోగసంభూతే ! మహాలక్ష్మి ! నమోస్తుతే ||
ఆద్యంతాలు లేనిదేవీ ! ఆదిశక్తీ ! మహేశ్వరీ ! యోగం వల్ల జన్మించిన తల్లీ ! ధ్యానంలో గోచరించే జగన్మాతా ! మహాలక్ష్మి ! నీకు నమస్కారము.
అమ్మ ఆదిశక్తి. సృష్ఠిస్తితిలయాలకు కారణమైనది. ఈ తల్లికి మొదలు, తుది అనేవిలేవు. సర్వకాల, సర్వావస్థలలో అమ్మ చైతన్యరూపిణియై ఉంటుంది. అమ్మ 'యోగం' వల్ల సంభవించింది. 'యోగ'మంటే ధ్యానం. ధ్యానంలో మాత్రమే అమ్మ సాక్షాత్కారం కల్గుతుంది. కనుక అమ్మ "యోగజ", "యోగసంభూత" అయింది. అనగా పరమాత్మరూపిణి, జగత్ప్రభువగు విష్ణుదేవుని భార్య కనుక అమ్మ "మహేశ్వరి" అనగా జ్ఞానస్వరూపిణి.
స్థూలసూక్ష్మ మహారౌద్రే ! మహాశక్తి ! మహోదరే !
మహాపాపహరే ! దేవి ! మహాలక్ష్మి ! నమోస్తుతే ||
స్థూలరూపంతోనూ, సూక్ష్మ రూపంతోనూ, మహారౌద్రరూపంతోనూ కనిపించేతల్లీ ! మహాశక్తిస్వరూపిణీ ! గొప్ప ఉదరం గల జగజ్జననీ ! మహాపాపాల్ని హరించేదేవీ ! మహాలక్ష్మీ ! నీకు నమస్కారము.
లక్ష్మీదేవి రజోగుణస్వరూపిణి. హిరణ్యవర్ణ. కనుకనే ఆమె రౌద్ర, స్థూల, సూక్ష్మ రూపాలతో ఆయా సందర్భాలలో వ్యక్తమవుతూ ఉంటుంది. భౌతికంగా భక్తులు కోరికలకై పూజించేరూపం స్థూలం. ఇది రజోగుణాత్మకం. యోగులు నిస్కాములై ధ్యానించేరూపం సూక్ష్మం! ఇది సర్వగుణాత్మకం. ఇక శత్రుసమ్హారం కావించేరూపం తామసం. ఇది రౌద్రం. ఇలా త్రివిధరూపాలతో శిష్టరక్షణ, దుష్టశిక్షణ చేస్తూ, అమ్మవారు విష్ణుదేవుణ్ణి అనుసరించి వుంటుంది. ఆమె మహాశక్తి. ఆమె గర్భంలో సమస్త బ్రహ్మాండాలూ ఉన్నాయి. అమ్మ పాపసమ్హారిణి. సకలలోకజనని.
పరమేశి ! జగన్మాత ! మహాలక్ష్మి ! నమోస్తుతే ||
పద్మాసనభంగిమలో కూర్చొని ఉండేదేవీ ! పరబ్రహ్మ స్వరూపిణీ ! పరమేశ్వరీ ! జగజ్జననీ ! మహాలక్ష్మీ ! నీకు నమస్కారము.
లక్ష్మి పద్మం నుండి జనించింది. పద్మంలోనే నివసిన్స్తుంది. పద్మాన్నే ధరిస్తుంది. పద్మం పైనే కూర్చుంటుంది. నిల్చుంటుంది. ఇలా ఆమేసర్వమూ పద్మమే ! పద్మమంటే ఇందు లక్ష్మి ఉంటుంది. పద్యతే అత్ర లక్ష్మీః అని వ్యుత్పత్తి. అమ్మ నివసించడంవల్లనే పద్మాలకు అంతటి శోభ, మృదుత్వం, ప్రశస్తీ వచాయి. పద్మాసన - పద్మాన్నే ఆసనంగా కల్గి ఉండేది. అయ్య పరబ్రహ్మ కనుక ఆయన అర్ధాంగి యగు లక్ష్మి యు పరబ్రహ్మమే ! లక్ష్మి మహానాయకురాలు. సృష్ఠి స్థితి లయాలకు ఆమె కారణం. మాత అంటే గర్భం తనలో ఇమిడియుండునది అని వ్యుత్పత్తి. అమ్మ సకలలోకాలనూ తన గర్భం లో ధరించి సృష్ఠి చేస్తుంది. కనుక జగజ్జనని.
శ్వేతాంబరధరే! దేవి ! నానాలంకారభూషితే !
జగత్ స్థితే ! జగన్మాత ! మహాలక్ష్మి ! నమోస్తుతే ||
తెల్లనివస్త్రములు ధరించిన దేవీ ! అనేకాలయిన అలంకారాలు దాల్చినతల్లీ ! లోకస్థితికి కారణమైన విష్ణుపత్నీ ! జగన్మాతా ! మహాలక్ష్మి ! నీకు నమస్కారము.
మహాలక్ష్మిని శ్వేతాంబరధారిణిగా వర్ణించుట ఇందలి విశేషం. సాధారణంగా సరస్వతిని శ్వేతాంబరధారిణి గా నుతిస్తారు. ఇచ్చట లక్ష్మిని విద్యాలక్ష్మి గా భావించినపుడు ఆమె సరస్వతీ స్వరూపిణి అని భక్తులు భావించి ఆ రూపంతో దర్శించాలి. అష్టవిధలక్ష్ములలో విద్యా లక్ష్మి నానాలంకారభూషితురాలు. ఆభరణాలన్నీ సువర్ణరత్నమయమైనవే ! అమ్మ జగత్తునందలి చరాచర వస్తువు లన్నింటా నిల్చి వాటిల్ని శక్తిమంతాలుగా చేస్తుంది. అది అమ్మవారి విభూతి అనగా ఐశ్వర్యం, లోక్స్థితి కి అమ్మవారే కారణం !
ఫలశ్రుతి
మహాలక్ష్మ్యష్టకస్తోత్రం యః పఠేత్ భక్తిమాన్నరః |
సర్వ సిద్ధి మవాప్నోతి రాజ్యం ప్రాప్నోతి సర్వదా ||
ఏకకాలే పఠేన్నిత్యం మహాపాపవినాశనం |
ద్వికాలం యః పఠేన్నిత్యం ధనధాన్యసమన్వితః ||
త్రికాలం యః పఠేన్నిత్యం మహాశత్రువినాశనం |
మహాలక్ష్మీ ర్భవే నిత్యం ప్రసన్నా వరదా శుభా ||
ఇంద్రకృతం శ్రీ మహాక్ష్మ్యస్టకం సంపూర్ణం ||
ఇంద్రుడు గావించిన ఈ మహాలక్ష్మీ స్తోత్రాన్ని నిత్యం భక్తి ప్రపత్తులతో పఠించేవాళ్ళు రాజ్యాధికారం మొదలు సకలాభ్యుదయాలూ పొందుదురు. రోజుకు ఒకమారు ఉదయం మాత్రమే పఠించేవారు మహాపాపాలనుండి విముక్తులవుతారు. రోజూ ఉదయం, సాయంకాలం రెండు సార్లూ పఠించేవాళ్ళు ధనధాన్య సమృద్ధి కలవారవుతారు. మూడుకాలాల్లో ఉదయం, మధ్యాన్నం, సాయంకాలం - పఠించేవాళ్ళు సకల శత్రుబాధల్నీ తొలగించుకొని సుఖిస్తారు. అట్టివారికి మహాలక్ష్మి ప్రసన్నురాలై కోరిన వరాలు ఇస్తుంది. శుభాలు కల్గిస్తుంది.
ఏ స్తోత్రాన్ని పఠించి ఫలం పొందాలన్నా, భక్తి ముఖ్యం. భక్తి లేని పారాయణం, చిల్లులు పడిన కుండలోపోసిన నీళ్ళవలె వృధా అవుతుంది. సర్వం మహాలక్ష్మీ ఆధీనం. ఆ తల్లి అనుగ్రహిస్తే సకల జీవులు ఇహ పర సుఖ జీవనులై ఉంటారు. కామక్రోధాధులైన అరిషడ్వర్గమే మహా శత్రువులు. వాళ్ళు నశిస్తేనే మానవులు శుద్ధాంతఃకరణులవుతారు. భగవదనుగ్రహపాత్రులవుతారు. అట్టివారిని మహాలక్ష్మి తన బిడ్డలుగా ఆదరించి రక్షిస్తుంది. అంతఃశత్రువుల్ని కూల్చాలంటే మహాలక్ష్మిని భక్తిశ్రద్ధలతో స్తుతించి, పూజించాలి.

పద్మాసనస్థితే ! దేవి ! పరబ్రహ్మ స్వరూపిణి !పరమేశి ! జగన్మాత ! మహాలక్ష్మి ! నమోస్తుతే ||

Thursday, February 9, 2017
⚘ ధ్వజస్తంభం 🌷 ప్రాముఖ్యత ⚘
ధ్వజస్తంభం చుట్టూ ప్రదక్షిణం చేసిన తరువాత దైవదర్శనం చేసుకోవటం ఆచారం.ధ్వజ స్తంభం దగ్గర కొట్టే గంటను బలి అంటారు. ఒకప్పుడు అడవిలో దారి తప్పిన బాటసారులకు ఎత్తున కనిపించే ధ్వజస్తంభ దీపాలే దారి చూపించేవి. వీటి ఆధారంగా, ఏ గుడినో, పల్లెనో చేరుకొని ప్రజలు అక్కడ తలదాచుకొనేవారు.
ఇప్పుడా అవసరం లేకపోయినా కార్తీకమాసములో ప్రజలు ధ్వజస్తంభం మీద ఆకాశదీపం వెలిగించి మహాదాత మయూరధ్వజుని గౌరవిస్తున్నారు.ఇంటి ముందు ఎవరైనా అడ్డంగా నిలబడితే, ఏమిటలా ధ్వజస్తంభంలా నిల్చున్నావు అంటుంటారు.కానీ ఆలయమనే దేహానికి గర్భాలయాన్ని ముఖంగాను, ధ్వజస్తంభాన్ని హృదయంగాను పోలుస్తారు.ఆలయ ప్రాకారాలు చేతులవంటివి.
నిత్యహారతులు జరిగే దేవాలయాలలో షోడశోపచార పూజావిధానం జరగాలంటే ధ్వజస్తంభం తప్పనిసరి.దీపారాధనలు, నైవేద్యం వంటి ఉపచారాలు ధ్వజస్తంభానికి కూడా చేయాలి.దేవాలయాలలో నిర్మలమైన వాతావరణం, భగవద్ద్యానం వంటివి మానసిక ప్రశాంతత కలిగిస్తాయి.
ఆలయంలో మూలవిరాట్టు ఎంత ముఖ్యమో ధ్వజస్తంభం కూడా అంతే ముఖ్యం.ధ్వజస్తంభం ఉంటేనే దేవాలయానికి ఆలయత్వం ఉంటుంది. లేకపోతే అవి మందిరాలు అవుతాయి. పూర్తయిన విగ్రహాన్ని కొంతకాలం ధాన్యంలో దాచుతారు. దానిని ధాన్యాధివాసం అంటారు. అలా కొన్నాళ్లు గడిచాక తీసి నీళ్లలో దాచుతారు. దానిని జలాధివాసం అంటారు.
మూల విరాట్టు దృష్టికోణానికి ఎదురుగా దేవాలయాలలో ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠిస్తారు. బాగా చేవ కలిగిన కొన్ని రకాలైన వృక్షశాఖలను మాత్రమే ధ్వజస్తంభానికి ఉపయోగిస్తారు.వీటిని ప్రతిష్ఠ చేసే ముందు ఈ దారువు (చెక్క) ను కూడా నీళ్లలో, ధాన్యంలో ఉంచి ఆ తరువాత ప్రతిష్ఠ చేస్తారు.
ధ్వజస్తంభ ప్రతిష్ఠ కూడా విగ్రహ ప్రతిష్ఠతో సమానమే. మూలవిరాట్టుకు ఎంత ప్రాధాన్యం ఇస్తారో ధ్వజస్తంభానికి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తారు. మూల విరాట్టు గర్భాలయంలో ఉంటే ధ్వజస్తంభం దేవాలయానికి ముందు భాగంలో బయట ఉంటుంది. ఆలయంలోనికి ప్రవేశించగానే ముందుగా ధ్వజస్తంభాన్ని దర్శించకుండా మూలవిరాట్టును చూడకూడదు.
ధ్వజస్తంభం లేని దేవాలయాలకు స్వాములు, సన్యాసులు దేవాలయ గుర్తింపు ఇవ్వరు. ధ్వజస్తంభానికి జీవధ్వజం అని మరో పేరు ఉంది. దీనిని దారు బేరం అని కూడా అంటారు. విగ్రహాల అనుష్ఠాన, అర్చనల వల్ల భగవంతుని చూపు ఈ ధ్వజస్తంభానికి తగులుతుంది. అందువల్ల ఈ స్తంభానికి పవిత్రతతో పాటు, శక్తి కూడా లభిస్తుంది. ధ్వజస్తంభానికి కూడా బలిహరణాలు, అర్చనలు జరుగుతుంటాయి.
పలాస - మోదుగ, అశ్వత్థ - రావి, బిల్వ - మారేడు, బంధూకం - వేగిస, పనస - పనస, వకుళ - బొగడ, అర్జున - మద్ది వృక్షాలను ధ్వజస్తంభాల కోసం ఉపయోగించినట్లయితే అవి కొన్ని సంవత్సరాల పాటు బలంగా ఉంటాయి. పాడైపోయినవి, ఛిద్రమైనవి, వేరే పనుల కోసం వినియోగించే వృక్షాలను దీనికి వాడకూడదు.
ధ్వజస్తంభం పొడవు విమాన చక్రం అంత ఎత్తు ఉన్నది మాత్రమే తీసుకురావాలి. ధ్వజస్తంభానికి కింద కూర్మయంత్రం వేయాలి. వైష్ణవాలయాలలో పైన పతాకంలాగ మూడు వరసల్లో జెండా ఎగురుతున్నట్టు ఉంటుంది. ఇలా మూడు బద్దలుగా ఉన్న భాగాన్నిమేఖల అంటారు. దానికి చిరుగంటలు ఉండి చిరుగాలికి సవ్వడి చేస్తుంటాయి.
ధ్వజస్తంభం నిడివి 12 అంగుళాల నుంచి 24 అంగుళాల వరకు ఉండచ్చు. చెక్కతో తయారుచేసిన ఈ ధ్వజస్తంభానికి ఇత్తడి తొడుగు వేస్తారు. కొన్ని కొన్ని దేవాలయాలో వెండితో, బంగారంతో కూడా తొడుగు చేయిస్తారు. ఈ తొడుగును మేఖలకు కూడా వేస్తారు. మేఖల కింద సుదర్శన చక్రం (వైష్ణవాలయాలలో), నందీశ్వరుడు (శివాలయాలలో) ఉంటాయి.
గుడిలో భగవంతునికి చేసే నైవేద్యాలు ధ్వజస్తంభానికి కూడా జరుగుతాయి. ఎందుకంటే వీటి స్థాయి మూల విరాట్టుతో సమానం.దేవాలయానికి వెళ్లి ప్రదక్షిణలు చేసేటప్పుడు ధ్వజస్తంభంతో కలిపి చేయాలి. అప్పుడే ప్రదక్షిణలు పూర్తయినట్టు. దేవాలయంలోకి ప్రవేశించగానే ముందుగా ధ్వజస్తంభానికి సాష్టాంగ ప్రణామం చేయాలి.
ఎందుకంటే ఇది కూడా స్వామి రూపమే. లోపలుండే మూలవిరాట్టుకు ఉత్సవమూర్తి ఎలాగో ఇది కూడా అటువంటిదే. దారురూపంగా దీన్ని భావించాలి. మూలవిరాట్టుకు ఇచ్చే మర్యాద, గౌరవం మన్నన ధ్వజస్తంభానికి కూడా ఇవ్వాలి. నమస్కార ప్రదక్షిణాలు పూర్తిచేసిన తరువాతే భగవద్దర్శనం కోసం లోపలికి ప్రవేశించాలి.
ధ్వజస్తంభం జీవితకాలం పూర్తయిన తరువాత మళ్లీ కొత్త దానిని ప్రతిష్ఠిస్తారు. ఉత్సవాలు ప్రారంభించేటప్పుడు ధ్వజారోహణం చేస్తారు. అంటే జయపతాకను కట్టి పై దాకా ఎగురవేస్తారు. పతాకం చూడగానే దూరాన ఉన్నవారు కూడా ఉత్సవాలు ప్రారంభం అయ్యాయనే విషయాన్ని తెలుసుకుంటారు. ఉత్సవాలు అయిపోగానే పతాకాన్ని దింపుతారు.
దానినే ధ్వజావనతం అంటారు. వైష్ణవాలయాల్లో ఈ జెండా మీద గరుత్మంతుని చిహ్నం, శివాలయాల్లో నందీశ్వరుని చిహ్నం, అమ్మవారి దేవాలయాల్లో సింహ చిహ్నం ఉంటాయి. కొన్ని దేవాలయాలలో రాతిధ్వజస్తంభాలు కూడా ఉన్నాయి. గోపుర కలశం కంటే ధ్వజస్తంభం ఎత్తుగా ఉంటే ఉత్తమం, కలశంతో సమానంగా ఉంటే మధ్యమం, కలశం కంటే తక్కువ ఎత్తులో ఉంటే అధమం .
ధ్వజస్తంభానికి కింద ఉండే పీఠానికి నాలుగు వైపులా దేవతలను ప్రతిష్ఠిస్తారు. పక్కనే బలిపీఠం పెడతారు. పత్రం, పుష్పం, ఫలం, తోయం పూజ చేస్తారు. వైష్ణవాలయాలలో మూలవిరాట్టుకు ఎదురుగా గరుత్మంతుడు, శివాలయాలలో వీరభద్రుడు, రామాలయాలలో హనుమంతుడు విగ్రహాలు ఉంటాయి.

Monday, February 6, 2017
Magha mass speciality
మాఘమాస వ్రత మహాత్యాలు.
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
మాఘమాసం
అఘము అనే పదానికి సంస్కృతంలో పాపము అని అర్థం. మాఘము అంటే పాపాలను నశింప చేసేది అనే అర్థాన్ని పండితులు చెబుతున్నారు. అందుకే మనకున్న మాసాలలో మాఘమాసం విశిష్టతను సంతరించుకుంది.
మాఘ మాస విశిష్టతను గురించి, ఈ మాసంలో ముఖ్యంగా సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పటి నుండి ఉదయకాలపు స్నానాలు చేయటం ఓ వ్రతంగా ఉంది.
మాఘంలో మాసములలో ఎవరికి వారు వీలున్నంతలో నది, చెరువు, మడుగు, కొలను, బావి చివరకు చిన్ననీటి పడియలోనైనా సరే స్నానం చేస్తే ప్రయాగలో స్నానం చేసినంత పుణ్యఫలం అబ్బుతుంది. చలికి భయపడక ఉదయాన్నే నదీ స్నానం చేయటం సర్వోత్తమం. ఈ మాసంలో ఉదయాన్నే దీపారాధన, నువ్వులతో హోమం, నువ్వుల దానం, నువ్వుల భక్షణం లాంటివి ముఖ్యమైనవి.
మాఘమాసంలో శుద్ధ విదియనాడు బెల్లం, ఉప్పు దానం చేయటం మంచిది. దీంతోపాటు పార్వతీ పూజ, లలితావ్రతం హరతృతీయ వ్రతం చేస్తుంటారు.
శుద్ధ చవితిన ఉమా పూజ, వరదా గౌరీ పూజ, గణేశ పూజ చెయ్యడం మొల్ల పువ్వులతో శివపూజ చెయ్యడం ఉంది. ఈ చవితినాడు చేసే తిలదానానికి గొప్ప పుణ్యఫలం చెప్పారు.
శుద్ధ పంచమిని శ్రీపంచమి అని అంటారు. ఈ రోజున సరస్వతీ పూజ చెయ్యటం విశేష ఫలప్రదం. దీన్నే కొన్ని ప్రాంతాల్లో వసంత పంచమి, రతికామదహనోత్సవం అనే పేరున జరుపుకొంటారు.
శుద్ధ షష్టిని విశోకషష్టి అని, మందార షష్టి అని, కామ షష్టి, వరుణ షష్టి అని కూడా అంటారు. ఈ రోజున వరుణ దేవుడిని ఎర్రచందనం, ఎర్రని వస్త్రాలు, ఎర్రని పుష్పాలు, ధూపదీపాలతో పూజించాలి.
శుద్ధ సప్తమిని రథసప్తమి అని అంటారు. ఈ రోజున సూర్య జయంతిని జరుపుతారు. రథసప్తమీ వ్రతం ఎంతో విశేషమైనది.
అష్టమి నాడు భీష్మాష్టమిని చేస్తారు. కురువృద్ధుడు భీష్ముడికి తర్పణం విడవటం ఈనాటి ప్రధానాంశం.
నవమి నాడు నందినీదేవి పూజ చేస్తారు.దీన్నే మధ్వనవమి అని అంటారు. ఆ తర్వాత వచ్చే ఏకాదశికి జయ ఏకాదశి అని పేరు. దీన్నే భీష్మ ఏకాదశి వ్రతమని చెబుతారు. కురువృద్ధుడు భీష్మాచార్యుడు మరణించిన సందర్భం గుర్తుకు తెచ్చుకుంటారు. ఈ తిథినాడే అంతర్వేదిలో లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం జరుపుతుంటారు.
ద్వాదశినాడు వరాహ ద్వాదశీ వ్రతం చేస్తారు. త్రయోదశి విశ్వ కర్మ జయంతిగా పేరు పొందింది.
మాఘపూర్ణిమకు మరీ మరీ విశిష్టత ఉంది. ఈ రోజున కాళహస్తిలో స్వర్ణముఖి నదిలో స్నానం చేయటం, ప్రయాగ త్రివేణీ సంగమంలో స్నానం చేయటం విశేష ఫలప్రదాలు. సతీదేవి జన్మించిన తిథిగా కూడా మాఘపూర్ణిమను చెబుతారు.
మాఘమాసంలో వచ్చే కృష్ణపాడ్యమి నాడు సౌభాగ్యప్రాప్తి వ్రతం చేస్తారు.
కృష్ణ సప్తమినాడు సర్వాప్తి సప్తమి వ్రతం, సూర్యవ్రతాలు జరుగుతాయి.
అష్టమినాడు మంగళా వ్రతం చేస్తుంటారు.
కృష్ణ ఏకాదశిని విజయ ఏకాదశి అని, రామసేతు నిర్మాణం పూర్తి అయిన రోజున గుర్తు చేసే తిథి అని చెబుతారు.
కృష్ణ ద్వాదశినాడు తిల ద్వాదశీ వ్రతం జరుపుతుంటారు.
మాఘ కృష్ణ త్రయోదశిని ద్వాపర యుగాదిగా పేర్కొంటారు.
మాఘ కృష్ణ చతుర్దశి నాడు మహశివ రాత్రి పర్వదినం వ్రతం జరుపుతారు.
మాఘమాసంలో చివరిదైన కృష్ణ అమావాస్యనాడు పితృశ్రాద్ధం చెయ్యడం అధిక ఫలప్రదమని పెద్దలంటారు.
ఇలా మాఘమాసంలో ఎన్నెన్నో వ్రతాలు, పర్వదినాలు, వివిధ దేవతలను ఉద్దేశించి జరపుకోవటం కనిపిస్తుంది. అందుకే మాసానికి తొలినాళ్ళనుండి అంత విశిష్టత ఉంది.
Meditation
జపము అనగా ?
జ అంతే జన్మరాహిత్యము, ప అతే పాపనాశనము. జపము అనగా పాపమును నశింపజేసి జన్మరాహిత్యమును అనుగ్రహించునది
కావున జపమును చేయునప్పుడు మంత్రమునందు మనస్సు నిల్పి, తద్భావమును మధ్య మధ్యలో ధ్యానించుట వలన భావపుష్టితో జపపుష్టి కలిగి తద్ద్వారా మంత్రసిద్ధి కలిగి సంపూర్ణ ఫలితము లభించును.
మననాత్ త్రాయతే ఇతి మంత్రః. మననము చేస్తే తరింపజేసేది మంత్రము. అటువంటి శక్తిపూరితమైన మంత్రాన్ని జప ప్రక్రియలో సాధన చేయటానికి కొన్ని ముఖ్యమైన విషయాలున్నాయి:
1. జపము మూడు విధాలుగా ఉండును - 1. వాచికము 2. ఉపాంశువు 3. మానసికము. బయటకు వినిపించునట్లుగా చెప్పుచూ చేయునది వాచికము. ఇతరులకు వినిపించకుండా పెదవులు కదులుతూ నాలుకతో జపించుటను ఉపాంశువు అంటారు. నాలుక, పెదవులు కదలకుండా లోలోపల చేసే జపమును మానసికము అందురు. వాచికము కంటే ఉపాంశువు శ్రేష్ఠము, దానికన్నా మానసికము మరింత శ్రేష్ఠము.
2. ప్రాతఃకాలములో చేతులు పైకెత్తి, మధ్యాహ్న కాలమో చక్కగా ఉంచి, సాయంకాలం క్రిందకు ఉంచి జపము చేయవలెను.
3. చందనముతో, అక్షతలతో, పుష్పములతో, ధాన్యముతో, చేతివ్రేళ్ల గణుపులతో లేదా మట్టితో జపాన్ని లెక్కించకూడదు. జపమాలతో, మిరియాలతో లెక్కించవచ్చు. శ్రేష్టమైనది లక్క, దర్భ, సింధూరము, ఎండిన ఆవుపేడ మిశ్రమంతో గోళీలు తయారు చేసి లెక్కించుట.
4. జపము చేయునప్పుడు జపమాలను బయటకు కనిపించకుండా అరచేతి చాటున లేదా ఒక వస్త్రముతోనైనా తప్పనిసరిగా కప్పి ఉంచవలెను. ఆ వస్త్రము తడిగా ఉండరాదు.
5. జపమాలను అనామిక (ఉంగరపు) వ్రేలిపైన ఉంచి బొటన వ్రేలితో స్పర్శించుచు మధ్య వ్రేలితో పూసలను తిప్పవలెను. చూపుడు వ్రేలును ఉపయోగించకూడదు.
6. జపము చేయునప్పుడు కదలుట, మెదలుట, మాట్లాడుట నిషిద్ధము. తప్పనిసరిగా మాట్లాడవలసినచో భగవంతుని క్షమాపణ భావంతో స్మరించి తిరిగి జపించవలెను.
7. అజాగ్రత్తవలన జపమాల కింద పడినచో నూట ఎనిమిది మార్లు ప్రత్యేకముగా జపించవలెను. కాలికి తగిలిన యెడల జలముతో కడిగి రెట్టింపు సంఖ్యతో (రెండు మాలలు) అదనముగా జపము చేయవలెను.
8. ఒకవేళ చేతి వ్రేళ్లతో జపము చేయవలసి వస్తే ఉంగరపు వ్రేలు మధ్య గణుపు మీద మొదలు పెట్టి, క్రింది గణుపు, తరువాత చిటికెన వ్రేలు మీద గణుపు, చిటికెన వ్రేలు, ఉంగరపు వ్రేలు, మధ్య వ్రేలు, చూపుడు వ్రేలు యొక్క మేరువులను తాకుతూ చూపుడు వ్రేలు గణుపులతో ముగించవలెను. ఈ మర్గాన్ని విలోమములో చేసి (చూపుడు వ్రేలు చివరి గణుపుతో మొదలు పెట్టి అప్రదక్షిణముగా ఉంగరపు వ్రేలి మధ్య గణుపులో) ముగించవలెను. చివరి ఎనిమిదికి ఉంగరపు వ్రేలు చివరి గణుపుతో మొదలుపెట్టి చూపుడు వ్రేలు మధ్య గణుపుతో ముగించవలెను. దీనిని కరమాల అందురు
9. సంధ్యోపాసనలో చేసే గాయత్రీ మంత్ర జపానికి కరమాల శ్రేష్ఠం. ఇతర మంత్ర జపానికి రుద్రాక్షమాల శ్రేష్ఠం.
10. జపమును ముగించిన పిమ్మట కూర్చున్న ప్రదేశమునందు మట్టిని తీసికొని నుదుటిపై తిలకమును ధరించవలెను. లేనిచో జపఫలితమును మహేంద్రుడు గ్రహించును.

Wednesday, February 1, 2017
Vasantha Panchami
వసంత పంచమి శుభాకాంక్షలతో
వసంత పంచమి మాఘ శుద్ధ పంచమి నాడు జరుపబడును. దీనిని శ్రీ పంచమి అని కూడా అంటారు. ప్రకృతిలో జరిగే మార్పులకి సూచనగా మనకి కొన్ని పండుగలు ఏర్పడ్డాయి .అలాంటివాటిలో శ్రీ పంచమి ఒకటి . మాఘ శుద్ధ పంచమి నాడు ఈపండుగను జరుపుకొంటారు . దీనిని సరస్వతీ జయంతి,మదన పంచమి,వసంత పంచమి అనికూడా అంటారు . ఇది రుతు సంబంధమైన పర్వం.వసంత రుతువుకి స్వాగతం పలికే పండుగగా శాస్త్రాలలో పేర్కొనబడింది .
శ్రీ పంచమిని విద్యారంభదినం గా భావిస్తారు . మన రాష్ట్రములోని బాసర క్షేత్రం లోనూ , మరియూ ఇతర సరస్వతీ దేవాలయాలలోనూ శ్రీ పంచమి నాడు పిల్లలకి అక్షరాభ్యాసాలు చేయిస్తారు .ఈ పండుగ ఉత్తర భారతదేశంలో విశేషముగా జరుపుకుంటారు. ఈ రోజు లక్ష్మీదేవిని పూజ చేయవలెనని హేమాద్రి తెలిపెను. రతీ మన్మథులను పూజించి మహోత్సవ మొనరించవలెనని, దానము చేయవలెనని, దీని వలన మాధవుడు (వసంతుడు) సంతోషించునని నిర్ణయామృతకారుడు తెలిపెను. అందువలన దీనిని వసంతోత్సవము అని కూడా అంటారు. "మాఘ శుద్ధ పంచమి నాడు విష్ణువును పూజింపవలెను. చైత్ర శుద్ధ పంచమి నాడు వలెనే బ్రాహ్మణులకు సంతర్పణ చేయవలెను" అని వ్రత చూడామణిలో పేర్కొనబడినది.
వసంతరుతువు రాకను భారతదేశమంతటా వసంతపంచమి పండుగగా ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ పండుగ మాఘ శుక్ల పంచమినాడు (జనవరి-ఫిబ్రవరి) వస్తుంది. తూర్పు భారతదేశంలో దీనిని సరస్వతీ పూజగా జరుపుకుంటారు. జ్ఞానానికి అధిదేవత సరస్వతి. ఆమె జ్ఞానస్వరూపిణి. శాస్త్రం, కళలు, విజ్ఞానం, హస్తకళలు మొదలైన వాటిని చదువుల తల్లి సరస్వతి అంశాలుగా మన పెద్దలు భావించారు. సృజనాత్మక శక్తికీ, స్ఫూర్తికీ కూడా వీణాపాణి అయిన సరస్వతిని సంకేతంగా చెప్పడం మన సంప్రదాయం.
సరస్వతీం శుక్లవర్ణాం సుస్మితాం సుమనోహరామ్
కోటిచంద్ర ప్రభా ముష్ట పుష్ట శ్రీయుక్త విగ్రహమ్
వహ్ని శుద్దాంశుకాధానం వీణా పుస్తక ధారిణీమ్
రత్న సారేంద్ర నిర్మాణ నవ భూషణ భూషితామ్
జ్ఞానశక్తికి అధిష్ఠాన దేవత- సరస్వతీమాత. జ్ఞాన, వివేక, దూరదర్శిత్వ, బుద్ధిమత్తత, విచార శీలత్వాదుల్ని శ్రీవాణి అనుగ్రహిస్తుందంటారు. సత్త్వరజస్తమో గుణాలను బట్టి అమ్మల గన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ అయిన జగన్మాతను మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతిగా కీర్తిస్తారు. ఈ ముగ్గురిలో సరస్వతీదేవి పరమ సాత్వికమూర్తి, అహింసాదేవి. ఆమెకు యుద్ధంచేసే ఆయుధాలు ఏమీ ఉండవు. బ్రహ్మ వైవర్త పురాణం సరస్వతీదేవిని అహింసకు అధినాయికగా పేర్కొంటోంది. ధవళమూర్తిగా పద్మంపై ఆసీనురాలై ఉన్న వాగ్దేవి మందస్మిత వదనంతో కాంతులీనుతూ ఆశ్రిత వరదాయినిగా దర్శనమిస్తుంది. మాఘశుద్ధ పంచమిని శ్రీ పంచమిగా, మదన పంచమిగా, వసంత పంచమిగా, సరస్వతీ జయంతిగా జరుపుకొంటారు. వసంత పంచమి నామాన్ని బట్టి దీన్ని రుతు సంబంధమైన పర్వదినంగా భావించాలి. మకర సంక్రమణం తరవాత, క్రమక్రమంగా వసంత రుతువు లక్షణాలు ప్రకృతిలో గోచరిస్తాయి. మాఘమాసం వసంత రుతువుకు స్వాగత గీతికను ఆలపిస్తుంది. ఆ వసంత రుతువు శోభకు 'వసంత పంచమి' వేడుక శ్రీకారం చుడుతుంది.
సరస్వతి శబ్దానికి ప్రవాహం అనే అర్థం కూడా ఉంది. ప్రవాహం చైతన్యానికి ప్రతీక. జలం జీవశక్తికి సంకేతం. నీరు సకల జీవరాశికి శక్తిని అందిస్తుంది. ఉత్పాదకతను పెంపొందిస్తుంది. ఈ ఉత్పాదకత వసంత రుతువు నుంచి ఆరంభమవుతుంది. ఆ ఉత్పాదకశక్తికి ప్రతిఫలమే సరస్వతి. ఉత్పాదకుడైన, సృష్టికర్త అయిన బ్రహ్మకు శారదే శక్తిదాయిని. కాబట్టి వసంత పంచమి వసంతానికి ఆరంభ సూచకమైతే, ఈ రోజున సరస్వతీ పూజను నిర్వహించుకోవడం సహేతుకం. ఉత్తర భారతంలో ఈ పూజను అత్యంత వైభవంగా జరుపుకొంటారు. ఈ పర్వదినానికే శ్రీ పంచమి అని కూడా పేరు. శ్రీ అంటే సంపద. జ్ఞాన సంపత్ప్రద అయిన సరస్వతిని ఈరోజున పూజించడం విశేష ఫలప్రదమని చెబుతారు.
శ్రీపంచమినే రతికామ దమనోత్సవంగా వ్యవహరిస్తారు. మాఘ శుక్ల పంచమినాడు రతీదేవి కామదేవ పూజ చేసినట్లు పౌరాణికులు చెబుతారు. రుతురాజు అయిన వసంతానికి కామదేవునికి మధ్య అవినాభావ సంబంధం ఉంది. వసంతుడు సస్యదేవత, కాముడు ప్రేమదేవత, రతీదేవి అనురాగదేవత. ఈ ముగ్గురినీ వసంత పంచమి నాడు పూజించడంవల్ల వ్యక్తుల్లో పరస్పర ప్రేమానురాగాలు పరఢవిల్లుతాయనే లోకోక్తి కూడా ఉంది. ఇలాంటి ఎన్నో ఆంతర్యాల సమ్మేళనం- వసంత పంచమి పర్వదినం.
రుధ్రుని భృకుటి నుండి అనగా కనుబొమలనుండి ఆవిర్భవించిన ఈ జ్ఞానశక్తి బ్రహ్మను అనుగ్రహించిందని శాస్త్రోక్తి . తారిణి , తరళ , తార , త్రిరూపా , ధరణీరూపా , స్తవరూపా , మహాసాధ్వీ, సర్వసజ్జనపాలికా , రమణీయా , మహామాయ , తత్త్వజ్ఞానపరా, అనఘా, సిద్దలక్ష్మి , బ్రహ్మాణి , భద్రకాళి , ఆనందా ... అనేవి తంత్రశాస్త్రాల ఆధారం గా ఇవి ఈ దేవతా దివ్యనామాలు .

Principals of visiting temple
దేవాలయంను దర్శించుకునే పధ్ధతి దయచేసి చదవండి.
దేవాలయం అంటే దైవం నెలవున్న స్థలం. పరమపవిత్రమైన క్షేత్రం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు భక్తుల అభీష్టములు తీర్చడానికి కొలువైఉన్న పరమ పావన నివాసం. అలాంటి దేవాలయమునకు దర్శనమునకు వెళ్ళునపుడు కొన్ని ధర్మములను / పద్ధతులను ఆచరించాలి. అప్పుడే ఆ దైవం యొక్క అనుగ్రహమునకు పాత్రులము అవుతాము.
1) ప్రతి భక్తుడు ( స్త్రీ పురుషులు ) గుడికి వెళ్ళే ముందు శుచిగా స్నానం చేసి, విధిగా నుదుట కుంకుమ ధరించాలి.
2) సంప్రదాయమైన వస్త్రములు ధరించాలి. స్త్రీలు చీరలు, పురుషులు ధోవతి-ఉత్తరీయం, ఆడపిల్లలు పరికిణీలు లేదా చుడీదార్ ధరించాలి. ( చాలామంది ఆడపిల్లలు జీన్స్ టీ షర్టులు- మగపిల్లలు షార్టులు ధరించి వెళుతున్నారు.ఇలా ధరించినవారిని ఆలయ ప్రవెశమునకు అనుమతిని ఇవ్వకుండా యాజమాన్యం చూసుకోవాలి. తల్లి తండ్రులు ప్రొత్సహించరాదు .
3) కనీస పూజా సామాగ్రిని తీసుకొని వెళ్ళాలి. పెద్దవారి దగ్గరికి వెళ్ళినా మహాత్ముల దగ్గరికి వెళ్ళినా ఒట్టి చేతితో వెల్లరాదు. గీతలో పరమాత్ముడు ” పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి” …ఎవరైతే నాకు భక్తీతో పత్రం కాని పుష్పం కాని ఫలం కాని ఉదకం కాని సమర్పిస్తారొ వాటిని ప్రీతితో స్వీకరిస్తాను” అన్నాడు.
4) గుడి ముందుకు చేరుకోగానే మొదట కాళ్ళూ చేతులు శుభ్రంగా కడుక్కోవాలి.
5) ఆలయం ప్రవేశించడానికి ముందు గోపురానికి నమస్కరించి తర్వాత మెట్లకు నమస్కరించాలి.
6) లోనికి ప్రవేశించినప్పటినుండి భగవంతుని నామం జపిస్తూ అన్యమస్కంగా కాకుండా ఏకాగ్రత అంతా దేవుడిపైనే ఉంచాలి.
7) నామ జపం చేస్తూ మధ్యమ వేగంతో గర్భాలయం చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసి పురుషులు స్వామికి కుడి వైపు, స్త్రీలు ఎడమ వైపు నిల్చోవాలి.
8) మొదట మూల విగ్రహం పాదాలను దర్శించి అందులో లీనం కావాలి.తరువాత స్వామి కళ్ళలోకి చూస్తూ లీనం కావాలి.
9) అర్చన చేసుకునేవారు తమ గోత్రము ఇంటిపేరు నక్షత్రము చెప్పుకోవాలి. తీర్థం తీసుకునే సమయంలో అరచేయిని గొకర్నాక్రుతిలొ ఉంచి చేయి కింద ఏదైనా వస్త్రం ఉంచుకుని ” అకాల మృత్యు హరణం …” అనే మంత్రం స్వయంగా చెప్పుకుంటూ భక్తితో తీర్థాన్ని చప్పుడురాకుండా తీస్కోవాలి.
10) దర్శనం అయిన తరువాత కాసేపు కూర్చొని నామ జపం చేస్తూ ప్రశాంత చిత్తంతో ఉండాలి.
11) ప్రసాదం భక్తులందరికీ పంచి తామూ భక్తితో తీస్కోవాలి.
12) తిరిగి వెళ్ళే ముందు మళ్ళీ స్వామికి నమస్కరించుకుని బయటికి వచ్చిన తరువాత మళ్ళీ గోపురానికి నమస్కరించి వెళ్ళాలి.
13) ఆలయ ప్రదక్షిణలు చేసేటప్పుడు వేగం కూడదు.
14) అనవసరంగా మాట్లాడటం.. పరుషపదజాలం ఉపయోగించకూడదు
15) ఆవలింతలు, జుట్టు పీక్కోవడం, తల గీక్కోవడం, తమలపాకులు వేయకూడదు.
16) జననం, మరణం సంబంధించిన విషయాలపై మాట్లాడకూడదు.
17) టోపీలు, తలకు వస్త్రాలు కట్టుకోవడం చేయకూడదు.
18) ధ్వజస్తంభం, బలిపీఠం, గోపుర స్థలాలను తొక్క కూడదు.
19) ఆకర్షణీయ దుస్తులను ధరించకూడదు.
20) నందీశ్వరుడు, శివలింగానికి మధ్యలో వెళ్ళకూడదు.
21) దర్శనం పూర్తయ్యాక వెనకవైపు కాస్త దూరం నడిచి, తర్వాత తిరగాలి.
22) ఒక చేత్తో దర్శనం చేయకూడదు.
23) భుజాలపై టవల్స్ వేసుకుని దర్శనం చేయకూడదు.
24) ఆలయంలో భుజించడం, నిద్రించడం చేయకూడదు.
25) ఆలయంలో ఎత్తైన ప్రాంతంలో కూర్చోకూడదు.
26) బలిపీఠంలో ఉన్న సన్నిధిని మ్రొక్కకూడదు.
27) ఆలయ ఆస్తులను అపహరించకూడదు.
28) అష్టమి, నవమి, అమావాస్య, పౌర్ణమి, మాస ప్రారంభం, సోమవారం, ప్రదోషం, చతుర్థి రోజుల్లో బిల్వ దళాలను తుంచకూడదు.
29) ఆలయంలో స్నానం చేయకుండా ప్రవేశించకూడదు.
30) మూల విరాట్ వద్ద దీపం లేకుండా దర్శనం చేయకూడదు.
31) ఆలయానికి వెళ్లొచ్చిన వెంటే కాళ్లను కడగకూడదు. కాసేపు కూర్చున్న తర్వాతే ఇవన్నీ చేయాలి.
32) ఆలయంలోకి ప్రవేశించి, తిరిగి వచ్చేంతవరకు నిదానం ప్రదానంగా ఉండాలి.
33) గోపుర దర్శనం తప్పక చేయాలి.
34) ఆలయంలోని మర్రి చెట్టును సాయంత్రం 6గంటల తర్వాత ప్రదక్షిణలు చేయకూడదు.
35) ఆలయంలోపల గట్టిగా మాట్లాడకూడదు.
36) మన మాటలు, చేష్ఠలు ఇతరులకు ఆటంకంగా ఉండకూడదు.

Subscribe to:
Posts (Atom)
Featured Post
Fixation of Mutation Fee in Gram Panchayats in the State
GOVERNMENT OF TELANGANA ABSTRACT Panchayat Raj & Rural Development Department – Mutation Fee – Fixation of Mutation Fee ...
Popular Posts
-
Read important Rules Panchayat Election Rules Read More Acts Read Act in English
-
GOVERNMENT OF TELANGANA ABSTRACT Public Services – RULES – The Andhra Pradesh Reorganisation Act, 2014 – The Andhra Pradesh State a...
-
The government of Andhra Pradesh has issued rules for levy of house tax under A.P.G.P. Act,1964 wide G.O.MS.No. 282 PR, (pts-v...