Menu

Requested to Donate, to receive required documents through e-mail. To donate click Pay Now Follow to receive updates by email.

Saturday, December 31, 2016

విశ్వబ్రాహ్మణుల చరిత్ర

విశ్వబ్రాహ్మణుల చరిత్ర

విశ్వకర్మ ఎవరు ?

విశ్వకర్మ భగవాన్ రూపాలు ఎన్ని రకాలు..?

అసలు ఈ జయంతి ఏ విశ్వకర్మది ...?

జయంతిలేని విశ్వకర్మకు జయంతి చేస్తున్నాము.జన్మించిన విశ్వకర్మకు జయంతి చేయటం లేదు.

1 ) పరమాత్మ విశ్వకర్మ.:- ఐదు ముఖాలు, పది హస్తాలు కలిగిన రూపం. ఇతను ప్రధాన దేవతలకు కనిపించును ( ఇతనికి జయంతి (పుట్టుక) లేదు ).

2). భువన పుత్ర విశ్వకర్మ :- ఒక తల, నాలుగు హస్తాలు ( ఇతనికి జయంతి (పుట్టుక) లేదు ).

3). దేవశిల్పి విశ్వకర్మ :- ఒక తల రెండు హస్తాలు ( ఇతని జయంతి సూర్యుడు కన్యా రాశిలో ప్రవేశించినపుడు ఇంచుమించుగా సెప్టేంబర్ 17 న ).

1.విరాఠ్ విశ్వకర్మ. (పరమాత్మ విశ్వకర్మ) మాగశుద్ధ త్రయొదశి నాడు పరమాత్మ విశ్వకర్మను పూజిస్తారు.

శ్లో|| నభూమి నజలం చైవ నతేజో నచ వాయవ:
  నచబ్రహ్మ నచవిష్ణు నచ రుద్రస్య తారకః
  సర్వశూన్య నిరాలంబో స్వయంభూ విశ్వకర్మణ:


-మూల స్తంభ పురాణం

(తా|| భూమి – జలము – అగ్ని – వాయువు – ఆకాశము, బ్రహ్మ – విష్ణు – మహేశ్వర – ఇంద్ర –సూర్య – నక్షత్రంబులు లేని వేళ విశ్వకర్మ స్వయంభు రూపమైయుండెను. భూమి నీరు అగ్ని గాలి బ్రహ్మ విష్ణు రుద్రుడు నక్షత్రా లేమియు లేనపుడు విశ్వకర్మ తనంతట తాను సంకల్ప ప్రభావంచేత నవతరించాడు.)

గమనిక: పంచభూతములు పుట్టక ముందే విశ్వకర్మ ఉన్నటైతే అతని ఆ స్వరూపము ఎలా వచ్చింది ?,

సమాధానం : మనము మననము చేసుకొనేందుకు మరియు గుర్తుకు ఆ విధంగా విగ్రహాన్ని రూపొందిచారు.

శ్లో|| పూర్వావనా త్సానగః దక్షణా త్సనాతనః
అపరా దహభూవః ఉద్వీచ్యాం ఉర్ధవాత్సుపర్ణః

తా|| తూర్పు ముఖమునందు సానగ ఋషి, దక్షిణ ముఖములో సనాతన ఋషి, పశ్చిమ ముఖములో అహభూన ఋషి, ఉత్తర ముఖములో బ్రత్న ఋషి, ఊర్ధ్వముఖములో సుపర్ణ ఋషులుద్బవించిరి.విశ్వకర్మ పరాత్పరుని యొక్క తూర్పు ముఖమైన సద్యోజాతములో సానగబ్రహ్మర్షి మకుబ్రహ్మయు, దక్షిణముఖమైన వసుదేవములో సనాతన మహర్షి యను మయబ్రహ్మయు, పశ్చిమముఖమైన అఘేరియునందు అహభూవ మహర్షి యను త్వష్టబ్రహ్మయు, ఉత్తరముఖమైన తత్పురుషములో ప్రత్న మహర్షి యను శిల్పి బ్రహ్మయు, ఊర్ధ్వముఖమైన ఈశానములో సువర్ణ మహర్షియను విశ్వజ్ఞబ్రహ్మయు ప్రభవించినట్లు చెప్పబడినై.

ఋక్ వేదం లోని పదవ మండలం 81,82 సూక్తాలు విశ్వకర్మ యొక్క సృష్టి నిర్మాణ క్రమాన్నివివరిస్తాయి. అందరికీ సుపరిచితమైన పురుష సూక్తం కూడా విశ్వకర్మను విరాట్ పురుషునిగా వర్ణించింది. విశ్వకర్మకు పర్యాయ పదంగా త్వష్టను గుర్తిస్తారు.

2.భువనపుత్ర విశ్వకర్మ పూజ

ఏనుగు వాహనంగా కలవాడు భువనపుత్ర విశ్వకర్మ (ఏనుగు నల్లదా తెల్లదా అనేది ముఖ్యము కాదు)

భువనపుత్ర విశ్వకర్మ అంగీరస వంశములో జన్నించిన ఋషి.

పరబ్రహ్మ విశ్వకర్మని సాక్షాత్ కారం చేసుకున్నా మొట్ట మొదటి విశ్వబ్రాహ్మణుల గురువులైయిన భువన విశ్వకర్మ పూజ ప్రతి సంవత్సరం చైత్రశుక్ల పంచమి నాడు పూజ జరుపుకుంటారు. ఇవి ముఖ్యంగా కర్మాగారాలు మరియు పారిశ్రామిక ప్రాంతాలలో తప్పకుండా జరుపుతారు. వారి పనిముట్లను విశ్వకర్మ ముందుంచి పూజిస్తారు.


3. దేవశిల్పి విశ్వకర్మ :-

హంసవాహనంగా కలవాడు దేవశిల్పి విశ్వకర్మ
దేవశిల్పి విశ్వకర్మను పూజిస్తారు. ఒక తల రెండు హస్తాలు, ఇతని జయంతి సూర్యుడు కన్యా రాశిలో ప్రవేశించినపుడు ఇంచుమించుగా సెప్టేంబర్ 17 న జరుపుకుంటారు.

హిందూ పురాణాల ప్రకారం ఎన్నో పట్టణాలను నాలుగు యుగాలలో నిర్మించాడు. సత్యయుగంలో దేవతల నివాసం కోసం స్వర్గలోకం నిర్మించాడు. త్రేతాయుగంలో సువర్ణ లంకను శివుని కోసం నిర్మించాడు. ద్వాపర యుగంలో ద్వారక నగరాన్ని మరియు కలియుగంలో హస్తినాపురం మరియు ఇంద్రప్రస్థం నిర్మించాడు.

విశ్వకర్మ ధ్వజము [ పరమాత్మ విశ్వకర్మ ధ్వజ నిర్మాణము]

శ్లో|| గగనం నీల వర్ణం చ మారుతం ధూమ్ర వర్ణకం
పావకో రక్త వర్ణం చ సలిలం శుభ్ర వర్ణకం
హరిద్రా వర్ణకం పృధ్వి పఞ్చ భూతాని ఇతి క్రమాత్||



1. ఆకాశము - నీలం రంగు

2. వాయువు - గచ్చకాయ రంగు

3. అగ్ని - ఎరుపు రంగు

4. నీరు - తెలుపు రంగు

5. భూమి - పసుపు రంగు

6. ఓం - బంగారు రంగు

ఇది పంచభుత సహిత పరమాత్ముని యొక్క ధ్వజము (జెండా), దీనిని ప్రతీ మానవుడు తమ ఆధ్యాత్మిక కార్యకలాపాలు చేయు ముందు ఈ ధ్వజమును ప్రతిస్ధాపన చేయవలెను. మన ప్రాచీన శాస్త్రముల ప్రకారము ఈ పరమాత్మ ధ్వజమును ప్రతీ మానవుడు తమ తమ ఇండ్ల పై, కార్యాలయముల పై, పనిచేయు కర్మాగారముల పై, దేవాలయముల పై ప్రతిస్ధాపన చేయవలెనని బుుషులు, జ్యోతీష్య పండితులు తెలియజేయుచున్నారు. ఈ విధముగా ధ్వజ స్ధాపన చేయుట వలన గ్రహముల నుండి వచ్చు దుష్ట ప్రభావము జీవజాలములపై (మనపై) చూపవు. పరమాత్మ నిరాకారుడు (ఆకారము లేనివాడు అని అర్ధము) అందుచేత ధ్వజము యొక్క మధ్యభాగములో ఉన్న చిహ్నం ఏ జీవమున్న రూపము గాని, జంతు రూపము గాని, మానవాకారం గాని పొందు పరచబడలేదు. ఓం కారం కూడా ఒక ఆకారము ఐనప్పటికిని మానవుని నిర్మితం కాదు. ఓం కారం కేవలం ఒక శబ్ధము. పరమాత్ముని యొక్క చిహ్నం. పరమాత్మునిని ఏ మానవుడు వర్ణింపజాలడు. పరమాత్ముని ఉనికిని తెలుసుకొనుటకు మాత్రమే ఈ ధ్వజములో పంచభుతములు మరియు ఓం కారం సాక్షీభుతములు.

విశ్వకర్మ

ప్రధాన వ్యాసం: విశ్వకర్మ విశ్వకర్మ ఋగ్వేదంలో, కృష్ణ యజుర్వేదంలో, శుక్ల యజుర్వేదంలో సృష్టి కర్తగా పేర్కొన బడినాడు. అథర్వణ వేదంలో ఆహార ప్రదాతగా వర్ణించబడినాడు. పురుష సూక్తంలో విరాట్ పురుషుడుగా కీర్తించ బడినాడు. సహస్ర బాహుగా, సహస్ర చక్షుగా, సహస్ర పాదుడుగా, సహస్ర ముఖుడుగా అన్ని వేదాలలో వర్ణించబడినాడు. సకల వేదముల ప్రకారం విశ్వకర్మయే సృష్టికర్త. కానీ కొన్ని పురాణాలు చతుర్ముఖ బ్రహ్మను సృష్టికర్తగా వేద విరుద్ధంగా పేర్కొంటాయి. అంతేగాక విశ్వకర్మను చతుర్ముఖ బ్రహ్మ కుమారుడిగా చెప్తాయి. ఇది వేద విరుద్ధం. వేదములు విశ్వకర్మను సర్వపాప సంహర్తగా పేర్కొనాయి. సర్వ దిక్కులను పరికించు దృష్టి కలిగిన అమిత శక్తి కలవాడు కనుకనే ఈయన భగవంతుడు అని ఋగ్వేదము ఈయనను భగవంతునిగా పరిగణించింది. మహాభరతము ఈయనను వేయికళలకు అధినేతగా అభివర్ణించింది. ఈతని అర్చామూర్తిని విశ్వకర్మ పురాణము పంచ శీర్షుడుగా వర్ణించింది. సృష్టి తొలినాళ్ళ నుంచి సుప్రసిద్దులైన శిల్పకారులు ఐదు మంది ఉన్నారు. వారు విశ్వకర్మకు జన్మించారు.

వరుస సంఖ్య వృత్తి చేయుపని
1. కమ్మరి అయోకారుడు - ఇనుము పని
2. సూత్రకారుడు (వడ్రంగి ) వర్ధకుడు - కొయ్య పని
3. కాంస్యకారి (కంచరి) తామ్ర కారుడు - రాగి, కంచు, ఇత్తడి పని
4. స్తపతి ( శిల్పి) శిల్ప కారుడు - రాతి పని
5. స్వర్ణకారి స్వర్ణకారుడు - బంగారు పని
విశ్వబ్రాహ్మణులు (విశ్వకర్మలు) చేయు వృత్తులు

విరాట్ విశ్వకర్మ భగవానుడు (పంచముఖుడు) ఐదు ముఖములు కలవాడు. విరాట్ విశ్వకర్మ యొక్క పంచ ముఖాల నుండి మను, మయ, త్వష్ట, శిల్పి, విశ్వజ్ఞ బ్రహ్మలు ఉద్భవించారు, ఈ పంచ బ్రహ్మల నుండి వారి సంతతి అయిన ఐదుగురు (సనగ, సనాతన, అహభౌసన, ప్రత్నస, సుపర్ణస.) విశ్వబ్రాహ్మణులు ఉద్భవించారు వీరి ద్వారా చేయు శాస్త్రం మరియు వృత్తులు నిర్ధేశింపబడినవి

వరుస సంఖ్య మూలాఆధారం విశ్వకర్మ ముఖము మహర్షి / గోత్రరిషి శాస్త్రం వృత్తి ప్రోఫిషన్
1. శివుడు మను సానగ బ్రహ్మర్షి తర్కం అయో శిల్పి - కమ్మరి Blacksmith
2. విష్ణువు మయ సనాతన బ్రహ్మర్షి వ్యాకరణం దారు శిల్పి - వడ్రంగి/సూత్రకారుడు Woodsmith ( Carpentar )
3. బ్రహ్మ త్వష్ట అహభునస బ్రహ్మర్షి ధర్మశాస్త్రం తామ్ర శిల్పి - కాంస్య కారి - కంచరి Bronzesmith
4. ఇంద్ర దైవజ్ఞ ప్రత్నస బ్రహ్మర్షి మీమాంస శిలా శిల్పి – స్తపతి (శిల్పి) Stonesmith
5. సూర్య విశ్వజ్ఞ సుపర్ణస బ్రహ్మర్షి వైద్యం, జ్యోతిష్యం స్వర్ణ శిల్పి - స్వర్ణకారి Goldsmith
పూర్వం వృత్తి సమాజంలోని ప్రజలకును, ప్రభువులకును ఉపయోగానికి మరియు తమవిజ్ఞానాన్ని తమదైన శైలిలో ప్రపంచానికి చాటి చెప్పడానికి ఉపయోగపడే విధానం, అవి క్రమేణా జీవనభృతి కొరకు చేపట్టే పనులు. ఈ వృత్తులు, ప్రజల మరియు ప్రభువుల అభీష్టం మేరకు, నైపుణ్యాలపై లేదా వంశపారంపర్యంగా వస్తున్న జీవన శైలిపై ఆధారపడి వుంటాయి. ప్రాచీన విజ్ఞానానికి నిలువుటద్దం ఈ వృత్తులు.

శిల్పముల రకములు

శిల్పం అంటే చెక్కిన లేక పోతపోసిన ప్రతిమ, ఇవి ముఖ్యంగా మూడు విధములుగా చెప్పవచ్చు.

రాళ్ళతో చేసిన శిల్పాలు

ఇవి నల్ల రాళ్ళ తోనూ పాలరాళ్ళతోనూ చేస్తారు. దేవతా మూర్తులను, రాజులు, రాణులు, గురువులు, జంతువులతో కూడిన కథలు, ఇతిహాసాలు, శాసనాలు, మొదలైనవి శిల్పాలలో చోటు చేసుకుంటాయి. శిల్పాల గురించి వివరించే శాస్త్రాన్ని ప్రతిమాశాస్త్రమని నేర్పే విద్యని ప్రతిమావిద్య అని అంటారు. శిల్పాలను చెక్కేవారిని 'స్తపతి' లేదా 'శిల్పి' అంటారు. రాతి యుగంలో లిపి బొమ్మలను చెక్కడంద్వారా ఆరంభమైనది. మనుష్యులు పరిణితి చెందుతున్న దశలోనే వారి దైనందిక జీవితంలో చూసిన అనేక విషయాలను గృహాలలో ఉన్న రాతిపై చెక్కడం ప్రారంభించారు. అంతే కాకుండా భూమిలోని ఖనిజ సంపద ద్వారా లభ్యమైన రాళ్లు ( వజ్రం, వైఢూర్యం, ముత్యం, పగడం, మొదలగు ) ఆభరణములకు ఇంపుగా పొదగడం ద్వారా నైపుణ్యము సంపాదించిరి.

లోహక్రియ (Metalworking)

లోహక్రియ అనేది విభిన్నమైన లోహాలతో పనిచేయడం. ఇది కొన్ని వస్తువులు తయారుచేయడానికి, అతికించి పెద్ద నిర్మాణాలు కట్టడానికి ఉపయోగిస్తారు. పెద్ద ఓడలు, వంతెనలు మొదలైనవి నిర్మించడం వీరు చేసే అతిక్లిష్టమైన పనులు. ఇందుకోసం భారీ పనిముట్లు అవసరం ఉంటుంది. లోహక్రియ ఒక కళ, అలవాటు, పరిశ్రమ మరియు వ్యాపారం ఇది కంసాలీల పని. లోహసంగ్రహం, విజ్ఞానశాస్త్రం మొదలైన విధాలుగా ప్రాచీనకాలం నుండి నేటివరకు బాగా విస్తరించింది. ఆదిమానవుని కాలంలోనే లోహాలను తన అవసరాలకనుగుణంగా మలిచి వ్యవసాయ పనిముట్లుగా, వేట ఆయుధాలుగా తయారుచేసి ఉపయోగించాడు. బంగారం వంటి ఖరీదైన లోహాలను ఆభరణాలుగా మలిచేవారిని స్వర్ణకారి (బంగారుపనివాడు) (Goldsmith) అంటారు.

కలపతో చేసినవి (Wooden works)

కలపతో ఇండ్లకు కావలసిన ద్వారబంధములు, తలుపులేకాక భవన నిర్మాణాలు, దేవతా మూర్తులను, నగిషీలు (కార్వింగు), వివిధ బొమ్మలు, పెద్ద ఓడలు, వంతెనలు మొదలైనవి నిర్మించడం, వ్యవసాయానికి కావలసిన బండ్లు, నాగళ్లు, పనిముట్ల పిడి తయారుచేయడం, మనుష్యులు పరిణితి చెందుతున్న దశలోనే వారి దైనందిక జీవితంలో చూసిన అనేక విషయాలను గృహలలో కలపను ఉపయోగించడం ప్రారంభించారు.

వృత్తులు-వివరణ

గ్రామంలో ఒక స్థలంలో ఈ ఐదు వృత్తులనూ చేస్తూ గ్రామానికి కావల్సిన వస్తువులను సమకూర్చేవారు. ఆ స్థలాన్నే విశ్వకర్మశాల అని ఆ రోజుల్లో వ్యవహరించేవాళ్ళు. క్రమేణా ఆ పేరు కాస్తా 'కర్మశాల'గా మారి, 'కమశాల'గా మారి, 'కంసాల' కులం పేరుగా, ఆ కులంలో పుట్టిన వారిని 'కంసాలి' గా పిలవడం జరుగుతూంది.

1. కమ్మరి : - పంచ వృత్తులలో మొట్టమొదటి వృత్తి కమ్మరము (అయో కారుడు). ఇనుమును కరిగించి వస్తువును తయారు చేసి ప్రపంచ పారిశ్రామిక వ్యవస్థకు మూల పురుషుడు లోహశిల్పి కమ్మరి. కమ్మరి ముడి ఇనుమును సంగ్రహించడం, ఇనుమును తయారు చెయ్యడం, ఆ ఇనుముతో వ్యవసాయానికి కావల్సిన కొడవళ్ళ, కర్రు, పార, పలుగు, గునపం, గొడ్డలి, బండికట్టు మొదలైనవి, దేశానికి కావల్సిన వంతెనలు, పరిశ్రమలు, పడవలు, ఫిరంగులు, కత్తులు ... ఇనుప వస్తువు ప్రతిదీ చేసి ఇచ్చే మొట్ట మొదటి మెటల్ ఇంజనీర్ . ఆంధ్ర ప్రదేశ్ షెడ్యూల్డు తెగల జాబితాలో 10వ కులంగా చెప్పబడుతున్న బయట కమ్మరులకు, విశ్వబ్రాహ్మణ / విశ్వకర్మ కుల సాంప్రదాయ కమ్మరులకు ఎటువంటి సంబంధమూ లేదు. షెడ్యూల్డు తెగలలోని కమ్మరులు దేశ దిమ్మరులు. విశ్వబ్రాహ్మణ / విశ్వకర్మ కుల సాంప్రదాయ కమ్మరులు ఆంధ్ర ప్రదేశ్ బి.సి కులాల జాబితాలో 21వ కులంగా నిర్ణయించబడి ఉన్నారు. ఉదా : - ఆ రోజుల్లోనే వీరు చేసిన ఇనుములోని స్వఛ్ఛత ఈ రోజుకీ నేటి విదేశీ ఇంజనీర్లు సైతం రాబట్టలేకున్నారు. ఉదాహరణకి ఢిల్లీ లోని విఠోబా స్థంబమే. తయారు చేసి వందల సంవత్సరాలు ఐనా, అది ఈ రోజుకీ తుప్పు పట్టలేదు. ఆ ఇనుము యొక్క స్వఛ్ఛత ఈరోజుకీ ఎవ్వరూ సాధించలేదు.

2. వడ్రంగి :- పంచ వృత్తులలో రెండవ వృత్తి ఈ వడ్రంగము వడ్రంగి కలపతో వస్తువులు తయారుచేయు వృత్తిపనివాడు. వడ్రంగి (దారు కారుడు) వ్యవసాయానికి కావల్సిన కాడి, మేడి, నాగలి, బండి..మొదలైనవీ, ప్రజలు బ్రతకడానికి కావల్సిన ఇల్లు, తలుపు, ద్వారము, దార బంద్రం, పీట, మంచం, కుర్చీలు మొదలగునవి. మానవ జీవిత చరిత్రలో అభివృద్ధికి మొట్ట మొదటి మెట్టయిన 'చక్రం'...చక్కతో తయారయ్యే ప్రతిది...పిల్లలు ఆడుకున్నే బొంగరం నుండి దేవుణ్ణి ఊరేగించే రథం వరకూ, ఊయల నుండి పడవల వరకు..తయారు చేసే మొట్ట మొదటి వుడ్ ఇంజనీర్.వీరిని వడ్ల కమ్మరి మరియు ఆంగ్లంలో కార్పెంటర్స్ (Carpenters) అని కూడా అంటారు.

3. కంచరి :- పంచ వృత్తులలో మూడవ వృత్తి కంచరి (కాంస్యకారుడు) ప్రజలకు కావల్సిన ఇత్తడి, రాగి, కంచు పాత్రలు ఉగ్గు గిన్నెల దగ్గర్నుండి గంగాళాల వరకు ... ముడి ఇత్తడి సంగ్రహించడం దగ్గర్నించి, దానిని ఇత్తడిగా, రాగిగా, కంచుగా మార్చి కరిగించి కావల్సిన ఆకారం లోకి పోత పోసే వరకు ఉద్ధరిణిల దగ్గరినుండి ఊరేగింపు వాహనాల వరకూ, దేవాలయాలలో పంచలోహా విగ్రహాలను మొదలగునవి ... ప్రతి పని చేసే మొట్ట మొదటి మెటల్ అల్లాయ్ ఇంజనీర్.

4. శిల్పి :- శిల్పకారుడు (శిల్పి) అంటే రాళ్ళను విగ్రహాలుగా చేసేవాడు అని కాదు. ఏదైనా తయారు చేసే వాడు (క్రియేటర్) అని అర్థం. దురదృష్టవశాత్తూ, శిల్పి అంటే శిల్పాలు చెక్కే వాడు అని అర్థం మారిపోయింది. శిల్పి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ నాడు మన భారత దేశంలో మనం చూస్తున్న విగ్రహాలు, అద్భుతమైన దేవాలయాలు, మహా మహా నిర్మాణాలు, వంతెనలు, శిలా శాసనాలు, అజంతా ఎల్లోరా గుహలు, కోటలు, మహల్ లు, చెరువులు, ఏకశిలా రథాలు,...... ఎన్ని చేశారో మహానుభావులు. వీరినే 'స్థపతులు' అని అంటారు. జంతర్ మంతర్, నలందా విశ్వ విద్యాలయం, తాజ్ మహల్, బేలూర్, హాలిబేడు, బాదామి గుహలు, హంపి, అజంత, ఎల్లోరా గుహలు, వేయి స్తంభాల గుడి, రామప్ప గుడి, త్రివేండ్రం లోని అనంత పద్మనాభ స్వామి, మహా బలిపురం, తిరుపతి, శబరిమల, ఎర్రకోట, గోమఠేశ్వర, మధుర మీనాక్షి, హైదరాబాద్ లోని బుద్ధ విగ్రహంమొదలగునవి...... శిలా నిర్ణయం దగ్గర నుండి విగ్రహాలు చెయ్యడం దగ్గర నుండి, స్థల పరీక్ష దగ్గర నుండి, వాస్తు పూజ దగ్గర నుండి, భవన లేదా దేవాలయ ప్లాన్ దగ్గర నుండి... గృహ ప్రవేశం లేదా దేవాలయ విగ్రహ ప్రతిష్ఠాపనాధికార పర్యంతం...వీరు చెయ్యలేని, వీరి చెయ్యి లేని పని లేదు. వీరు ప్రపంచ దేశాలలో భరత ఖండాన్ని సగర్వంగా తల ఎత్తుకునేలా చేసిన పుణ్య మూర్తులు. భారత దేశానికి పర్యాటకం మీద ఆదాయం రావడానికి మూలకారణం వీరి చలవే. వీరి కట్టాడాలలోని నైపుణ్యాన్ని, రహస్యాలను ఈనాటికీ మేటి విదేశీ సైంటిస్ట్ లు సైతం అందుకోలేక పోతున్నారు. ప్రపంచంలోనే మొట్టమొదటి అసలైన ఇంజనీర్లు.

5. స్వర్ణకారి : - స్వర్ణకారుడు అంటే ముడి బంగారాన్ని సేకరించి దాని నుండి అసలైన బంగారం గ్రహించి, దానికి రత్న మాణిక్యాలను కూర్చి, దాన్ని అనుభవ యోగ్యంగా, ఆభరణాలుగా, శిల్పాలుగా, పాత్రలుగా మార్చగలిగినవాడు . ముడి వెండి నుండి పాత్రలు, పూజకు వాడే వస్తు సామగ్రి, కాళ్ళకు పట్టిలు మొదలగునవి.

ఉప వృత్తులు

ఉప కులాలు/ఆశ్రితకులాలు

1. రుంజలు:- తెలుగు కులాలలోని కొన్ని కులాలను ఆశ్రిత (కులాలు) జాతులు ఉన్నాయి. వీటినే పరిశోధకులు, జానపదవృత్తి గాయకులు అని వ్యవహరిస్తుంటారు. అలాంటి వారిలో రుంజలు కూడా ఉన్నారు. విశ్వ బ్రాహ్మణుల గోత్రాలను, వంశానామాలను పొగడి విశ్వకర్మ పురాణం చెప్పేవారే రుంజలు. వారు కథ చెబుతూ వాయించే వాయిద్యమే రుంజ. చర్మ వాయిద్యాలలో చాలా పెద్దది రుంజ దీని శబ్దం కూడా రెండు, మూడు కిలోమీటర్ల వరకు వినిపిస్తుంది. వృత్తి గాయకుల వాయిద్యాలలో ఇంత పెద్దది మరొకటిలేదు. రుంజ కారుడు మోయలేని బరువుగానే దీనిని మోస్తుంటరు. "నా సంసార బరువును అది మోస్తున్నపుడు దీని బరువును మెము మోయలేమా" అని ఆ కళాకారులంటారు. రుంజ వాయిద్యకులు ఒక గ్రామానికి వచ్చారంటే, ముందుగా భేరి మోతలతో రుంజ వాయిద్యాన్ని ఉధృతంగా అగమకాలనిస్తూ వాయించడంతో రుంజ వారు గ్రామంలోకి వచ్చారనేది అందరికీ అర్థమైపోతుంది. [1]

2. పనసలు:- Panasa's (పనసలు)

అగ్ని మహాదేవికి విశ్వకర్మ తెజస్సుతో ఆవిర్బవించిన బాలుడు పనసచెట్లలో పెరిగాడు. ఆ బాలుడు వంశకర్తగా కలిగిన కులాలవారే పనసలు. వీరు కూడా విశ్వబ్రాహ్మణ కుటుంబాల ఇల్లకు వార్షికంగా వెళ్లి శబ్దం, గానం చేసి ఆదరణను పొందుతుంటారు, భోజన తాంబుల - దక్షిణలతో జీవితాలను కొనసాగిస్తుండేవారు - క్రమం క్రమంగా వీరి జాడ కనుమరుగవుతున్నది. [2]

3. పౌరోహిత్యం:-పౌరోహిత్యము ఒక వృత్తి మాత్రమే, పౌరోహిత్యము చేయువానిని పురోహితుడు అని అంటారు, పురోహితుడు అనగా పురజనులకు (ప్రజలకు) హితము పలికెడి వాడు అని అర్థం. అనగా, మనము ఏదైన పనిచేయబోయినప్పుడు, ముందుగా, అతనిని సంప్రదిస్తే, ఆ పని చేయడం లోని మంచి, చెడ్డలను చెప్పి, ఆ పని చేయడం యోగ్యమయిన దయితే, దానిని నిర్వర్తించే విధానం తెలిపేవాడు పురోహితుడు. అందువలన, ఒకపనిని, స్వప్రయోజనాన్ని ఆశించిగాని, లేదా ఇతర కారణముల వలన గాని మన చేత చేయిస్తే, దాని వలన వచ్చే పాపము పురోహితునికే వెడుతుందిగాని, మనకు కాదు. అందువలన, ఏ పనిచేయడానికైనా ముందు పురోహితుని అనుజ్ఞ తీసుకోవాలి. పాలకుడైన వాడు పాలితుల ( ప్రజల ) పాపములకు బాధ్యుడు, పాలకుని పాపములకు పురోహితుడు బాధ్యుడు.


రాజా రాష్ట్రకృతం పాపం రాజ పాపం పురోహితః

అని ఆర్యోక్తి.

పురోహితుడు చేసే పనిని పౌరోహిత్యము అంటున్నారు. పూర్వకాలంలో, రాజ్యానికి శుభములు సమకూడేందుకు, పరరాజుల దండయాత్రల వంటి విషమ పరిస్థితులలోను మంత్రి, పురోహితులతో రాజు సమాలోచనలు జరిపేవాడు. వివాహాది షోడశకర్మలు, పూజలు, వ్రతాలు మరియు యజ్ఞయాగాదులు, జరుపడానికి సామన్యప్రజలు పురోహితుడునీ తప్పక ఆశ్రయించాలి.

No comments:

Post a Comment

Featured Post

Fixation of Mutation Fee in Gram Panchayats in the State

GOVERNMENT OF TELANGANA ABSTRACT Panchayat Raj & Rural Development Department – Mutation Fee – Fixation of Mutation Fee ...

Popular Posts