Menu

Requested to Donate, to receive required documents through e-mail. To donate click Pay Now Follow to receive updates by email.

Saturday, December 12, 2015

Vacate Remission on House Tax in Grampanchayats

పట్టణాలలో పనులకోసం గాని తమ పిల్లల విద్యాభ్యాసము కొరకు కాని గ్రామాలలో గల తమ ఇండ్లను ఖాలీగా వదలి పట్టణాలకు చాలా మంది వలస వెళ్తుంటారు. కొంత మంది సంవత్సరాల తరబడి తమ స్వగ్రామాలకు రాని వారు చాలా మంది ఉంటారు మరి కొంత మంది పండుగలకో పబ్బాలకొ తమ స్వంత ఇంటిలో పండుగ చేసుకోవాలని తమ గ్రామాలకు వస్తుంటారు. అలా వలస వెళ్లిన వారికి గ్రామాలలో గల తమకు చెందిన నివాస గృహాలకు సంబందించి గ్రామపంచాయతీకి తాము చెల్లించవలసినన ఇంటి పన్ను గురించి చట్టములో మంచి వెసులుబాటు గలదు. ఈ వెసులు బాటు గురించి తెలియని పంచాయతీ కార్యదర్శులు గాని పంచాయతీ సిబ్బందిగాని పంచాయతీలకు రావలసిన ఇంటి పన్ను డిమాండు రిజిష్టర్లలో వారిపేరున డిమాండు వేసి, పట్టణాలకు వెళ్ళిన వారికి డిమాండు నోటీసులను ఇవ్వడానికి వారు సమయానికి అందుబాటులో లేక పోవడం వలన వారికి డిమాండు నోటీసులను ఇవ్వలేక తద్వార వారు ఇంటి పన్నుచెల్లించక పోవడం మూలాన పంచాయతీలలో ఇంటిపన్ను బకాయిలు ఈ రకంగా కూడా పేరుకుపోవడం చాలా అరుదు. అలాగే గ్రామాలలో ఉన్న తమ ఇంటిపన్ను గురించి సరైన సమాచారము పట్టణాలలో ఉన్నవారికి తెలియక వారు సకాలములో ఇంటిపన్ను చెల్లించలేక, వారికి పంచాయతీనుండి ఏదేని దృవీకరణ పత్రము అవసరమనకున్నపుడు పంచాయతీ కార్యదర్శులను సంప్రదించగా వారు పేరుకుపోయిన బకాయిలను చెల్లిస్తేనే తప్ప పంచాయతీ వారు దృవీకరణ పత్రము ఇవ్వలేమని తేల్చినపుడు పన్ను చెల్లించడం తమకు కూడా చాలా భారమనిపిస్తుంది. ఈ సమస్యలను దూరము చేయడానికి పంచాయతీరాజ్ చట్టంలో అవకాశము కలదు. దానినే వేకేట్ రెమిషను అని అంటారు. ఈ రాయితీని ఎలా ఉపయోగించుకోవాలో చూద్దాం



ప్రభుత్వ ఉత్తర్వు నెం. 282. పంచాయతీరాజ్ శాఖ తేది. 12-03-1965 ద్వార జారీ చేయబడిన ఇంటిపన్ను విధింపు నియమాలలోని నియము 10(1) ప్రకారము ఒక ఆర్థిక సంవత్సరములో వరుసగా 120 రోజులు గాని అంతకంటె ఎక్కువ రోజులు గాని ఆ ఇల్లు ఖాళీగా ఉంటె, దానికి విధించబడిన పన్నులో సగానికంటె ఎక్కువగా గాకుండా రాయితి (మినహాయింపు) పొందవచ్చును. ఒక వేళ ఆ ఆర్థిక సంవత్సరములో ఇంటి యజమాని ముందుగానే పన్ను చెల్లించియున్న యెడల, చెల్లించిన దానిలో కూడా సగానికంటె ఎక్కువగాకుండా మినహాయింపును ఇంటి యజమాని కోరవచ్చును.
ఉపనియమము (1) ప్రకారము మినహాయింపును కోరువారు ఆ సంవత్పరములో మాత్రమే దరఖాస్తు చేయాలి. సంవత్పరము ముగిసిన తరువాత చేయు దరఖాస్తులను అంగీకరించరు.
ఉపనియమము (3) ఏ ప్రకారము యజమానిగాని అతని ఏజెంటు గాని,  తమ ఇల్లును ఖాళీగా ఉంచబోతున్నట్లు ముందుగానే పంచాయతీ కార్యాలయమునకు లిఖిత పూర్వకము తెలిపినచో, అలా తెలియజేసిన తేది నుండి మినహాయింపుకొరకు లెక్కలోకి తీసుకుంటారు.
అలా ఇవ్వబడిన ప్రతి లేఖ లేక నోటీసు ఏ సంత్సరములో అయితే కార్యాలయమనకు అందజేయబడినదో ఆ సంవత్సరమునకు మాత్రమే పనిచేయును. తదుపరి సంవత్సరమునకు పనిచేయదు. కావున ఇంటి యజమాని  తాను నిజంగా ఖాళీ ఉంచబోతున్న ఇంటి వివరములు మరియు ఎప్పటినుండి ఖాళీగా ఉంచుతున్నట్లు ప్రతి సంవత్సరము పంచాయతీ కార్యాలయమునకు ప్రతి సంవత్సరము తప్పకుండా తెలియ జేయాలి. అప్పుడే వారు ఇంటిపన్ను నుండి మినహాయింపును పొందగలరు. లేనిచో వారి పేరున మొత్తం ఇంటిపన్నును బకాయిగా చూపించి తదుపరి సంవత్సరము మొత్తము పంచాయతీవారు డిమాండు చేయుటకు అవకాశము కలదు.
అలాగే ప్రతి పంచాయతీలో కూడా కార్యదర్శి కూడా ప్రతి సంవత్సరము ఆ పంచాయతీ పరిధిలో ఎన్ని ఇండ్లు ఖాలీగా ఉన్నాయి అని ఒక సారి పరిశీలనచేసి ఆ ఇండ్ల యజమానులను సంప్రదించి ఈ నియమము ప్రకారము వారినుండి ధరఖాస్తులను సేకరించి వారికి చట్ట ప్రకారము తగినంత మినహాయింపు ఇవ్వడం ద్వార పంచాయతీలో వసూలు కాని బకాయిలు పేరుకుపోకుండా ఏ సంవత్సరమునకు సంబందించినది, ఆ సంవత్సరములోనే వారికి మినహాయింపు ఇచ్చుట ద్వార మిగతా పన్నును వారినుండి వసూలు చేయడం వలన బకాయిలు పేరుకుపోకుండా చూసి పంచాయతీల ఆర్థికాభివృధ్దికి పాటుపడిన వారు కాగలరు.

1 comment:

Featured Post

GOVERNMENT OF ANDHRA PRADESH GENERAL ADMINISTRATION (SERVICES-D) DEPARTMENT Circular Memo.No:10445/Ser.D/2011 Dated:01-0...

Popular Posts