Menu

        To Read Rera Act, 2016, select Muncipal related, scroll down and select RERA Act

Thursday, September 17, 2015

💐🍁💐🍁💐🍁
తెలంగాణ విమోచనోద్యమం

❄☔☁❄☔☁❄
👉👉అప్పటి హైదరాబాదు రాజ్యంనిజాం నిరంకుశ పాళన నుంచి విముక్తి కోసం హైదరాబాదు సంస్థాన ప్రజలు 1946 నుంచి 1948 వరకు చేసిన వీరోచిత పోరాటమే తెలంగాణ విమోచనొద్యమము. రెండు వందల సంవత్సరాల పాలనలో దోపిడి, అణిచివేతలకు విమోచనోద్యమం తిరుగులేని సమాధానం చెప్పింది. అప్పటి హైదరాబాద్ సంస్థానంలో ప్రస్తుత తెలంగాణతో పాటు మరాఠ్వాడ (మహారాష్ట్ర), బీదర్ (కర్ణాటక) ప్రాంతాలు ఉండేవి. 3 భాషా ప్రాంతాలకు చెందిన మొత్తం 16 జిల్లాలకు గాను 8 జిల్లాలు తెలంగాణా ప్రాంతానికి చెందినవి కాగా, మరాఠా, కన్నడ ప్రాంతాలకు చెందినవి 8 జిల్లాలుండేవి. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిననూ నిజాం సంస్థానంలోని ప్రజలకు మాత్రం స్వాతంత్ర్యం లేకపోవడాన్ని ఇక్కడి ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. దేశమంతటా స్వాతంత్ర్యోత్సవాలతో ప్రజలు ఆనందంతో గడుపుచుండగా నిజాం సంస్థాన ప్రజలు మాత్రం నిరంకుశ బానిసత్వంలో కూరుకుపోయారు. హైదరాబాదు రాజ్యాన్ని పాలిస్తున్న ఏడవ నిజామ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ రాజ్యాన్ని సొంతం చేసుకోవడానికి విశ్వప్రయత్నం చేస్తూ రజాకార్లను ఉసిగొల్పాడు. నిజాంకు అండగా ఖాసిం రజ్వీ నేతృత్వంలోని రజాకార్లు గ్రామాలపైబడి దోపిడిచేయడం, ఇండ్లు తగలబెట్టడం నానా అరాచకాలు సృష్టించారు. అతని మతోన్మాద చర్యలు కోరలాల్చి వెయ్యి నాల్కలతో విషంకక్కాయి. హీనమైన బతుకులు వెళ్ళదీస్తున్న జనం గురించి అస్సలు పట్టించుకోకుండా ప్రజల నుండి బలవంతంగా వసూలుచేసుకున్న సొమ్ముతో విలాసాలు, జల్సాలు, భోగభాగ్యాలు చేసుకొనేవారు. దీనితో రామానందతీర్థ నేతృత్వంలో ఆర్యసమాజ్ ఉద్యమాలు, కమ్యూనిష్టుల ఆధ్వర్యంలో సాయుధపోరాటాలు ఉధృతమయ్యాయి. మొదట నల్గొండ జిల్లాలో ప్రారంభమైన ఉద్యమం శరవేగంగా నైజాం సంస్థానం అంతటా విస్తరించింది. రావి నారాయణరెడ్డి, చండ్ర రాజేశ్వరరావు, మల్లు స్వరాజ్యం, ఆరుట్ల కమలాదేవి, బొమ్మగాని ధర్మభిక్షం, మాడపాటి హనుమంతరావు, దాశరథి కృష్ణమాచార్య, కాళోజి నారాయణరావు, షోయబుల్లాఖాన్, సురవరం ప్రతాపరెడ్డి తదితర తెలంగాణ సాయుధ పోరాటయోధులు వారికి స్పూర్తినిచ్చే కవులు, రచయితలు మూలంగా 1948లో ఉధృతరూపం దాల్చి చివరికి భారత ప్రభుత్వం సైనిక చర్యతో నైజాం సంస్థానాన్ని సెప్టెంబర్ 17, 1948న భారత్ యూనియన్‌లో విలీనం చేసుకుంది.



☔❄🍁💐🍁❄

💐❄🍁💐❄🍁
మహబూబ్‌నగర్‌లో విమోచనోద్యమకారులకు
స్పూర్తిగా నిలిచిన తూర్పు కమాన్నిజాం పాలనలో దురాగతాలు
నిజాం పాలనలోని దురాగతాలే విమోచనోద్యమానికి దారితీసింది. నిజాం పాలన చివరి దశలో మానవరక్తాన్ని తాగే రాకాసి మూకలైన రజాకారు దళాల దురాగతాలకు అంతు ఉండేదికాదు. రైతులు పండించిన పంటలకు కూడా వారికి దక్కనిచ్చేవారు కాదు. నాడు వేలమంది మహిళలు మానభంగాలకు గురయ్యారు. నిజాం పాలకులు ఉద్యమాలను ఆపడానికి ఉద్యమకారులను చిత్రహింసలకు గురిచేసేవారు. గోళ్ళ కింద గుండుసూదులు, బ్లేడ్లతో శరీరంపై కోసి గాయాలపై కారం పోసేవారు. శరీరంపై సిగరెట్లతో కాల్చేవారు. బొటనవేళ్లకు తాళ్ళు కట్టి తలకిందులుగా వేలాడదీసేవారు. చెవులకు బరువులు కట్టడం, ఛాతీపై పెద్దబండలు పెట్టడ, కాగే నూనెలో వేళ్లు ముంచడం ఆనాడు సాధారణమైన శిక్షలు ప్రజల వద్ద నుంచి ముక్కుపిండి పన్నులు వసూలుచేసేవారు. ధాన్యాలను బలవంతంగా లాక్కొనేవారు. ప్రజలు తిండిలేక అలమటిస్తే పట్టించుకొనేవారు కాదు. నిజాంచే ఉసిగొల్పిన రజాకార్లు విచ్చలవిడిగా గ్రామాలపై పడి ఇండ్లు తగలబెట్టి, అందినకాడికి దోచుకొనేవారు. ఈ భయంకర పరిస్థితిని చూసి వందేమాతరం రామచంద్రరావు ప్రధాని జవహర్ లాల్ నెహ్రూకు నిజాం దుర్మార్గాలపై లేఖ అందించారు.

తమ జల్సాలకు విలాస జీవితానికి సరిపోయే విధంగా 90 రకాల పన్నులు విధించారు. ప్రజల బతుకు అధ్వాన్నమైంది. పన్నుల కట్టలేని పరిస్థితిలో గోళ్ళూడగొట్టారు. లెవీ కొలువకపోతే ఊరి మీద పడి రైతులు తినడానికి ఉంచుకున్న ధాన్యాన్ని దోచుకెళ్ళిన సంఘటనలనేకం. ఎదిరించినందుకు బైరాన్‌పల్లిలో 108 మందిని కాల్చి చంపారు, నిర్మల్‌లో వెయ్యిమందిని ఉరితీశారు, గాలిపెల్లిని తగులబెట్టారు. ఇలాంటి సంఘటనలు లెక్కలేనివి. శవాలను కూడా బూటుకాళ్ళతో తన్నిన నరహంతకులు, కిరాతకులు రజాకార్లు. యార్‌జంగ్ నేతృత్వంలోని మజ్లిస్ ఇత్తెహాదుల్ బైనుల్ ఇస్లమీన్ సంస్థ బలవంతంగా హిందువులను ముస్లింమతంలోకి మార్పిడి చేసేది. ఎదురు తిరిగిన వారిపై అరాచకంగా ప్రవర్తించేవారు. రజాకార్ మూఠాలు స్త్రీలను మానభంగాలకు గురిచేసి, వివస్త్రలను చేసి ఎత్తుకుపోయేవారు.

చెట్లకు కట్టేసి కింద మంటలు పెట్టేవారు, జనాన్ని వరసగా నలబెట్టి తుపాకులతో కాల్చేవారు, బహిరంగంగా సామూహిక మానభంగాలు జరిపేవారు. దోపిడీ దృష్టి తప్ప స్థానిక ప్రజల పట్ల గౌరవం ఏమాత్రంలేదు. సంస్థాన ఉద్యోగాల్లో స్థానిక ప్రజల్ని పెట్టుకోకుండా ఉత్తర భారతం నుండి అపాకీలను రప్పించి నియమించారు. స్థానిక భాషల్ని, సంస్కృతులను అన్ని దశల్లోనూ నిర్దాక్షిణ్యంగా అణిచివేశారు. తుర్రేబాజ్‌ ఖాన్ ‌, షేక్ బందగి , షోయబుల్లాఖాన్‌ లాంటి అనేక మంది ముస్లింలు కూడా నిజాం నిరంకుశ పాలనలో హత్యచేయబడ్డారు.

🍎సర్దార్ పటేల్ పాత్ర:🌹
సైనిక చర్య విజయవంతం కావడానికి అప్పటి బారత హోంశాఖా మంత్రి సర్దార్ పటేల్ కృషి ఎంతో ఉంది. సర్దార్ వల్లభ్ భాయిపటేల్ రాజకీయ చతురతతో పోలీసు చర్య జరిపి నిజాం పాలనకు చరమగీతం పలికారు. హైదరాబాదును ప్రత్యేక దేశంగా ఉంచాలని కనీసం పాకిస్తాన్‌లోనైనా విలీనం చేయాలని విశ్వప్రయత్నం చేసిన నిజాం పన్నాగాలను పటేల్ బద్దలు కొట్టారు. నిజాం ఐక్యరాజ్యసమితికి భారతదేశంపై ఫిర్యాదు చేయడానికి దూతలను కూడా పంపాడు. భారతదేశంపై పోరాటానికి విదేశాల నుంచి ఆయుధ దిగుమతికి ప్రయత్నాలు చేశాడు. అయినా అతని ఆటలు, నిజాం ప్రధాని లాయక్‌అలీ నాటకాలు పటేల్ ఎదుట పనిచేయలేవు. పోలీసు చర్యలో భాగంగా నలువైపులా నుంచి వస్తున్న భారత బలగాలను చూసి నిజాం కింగ్‌కోఠి నుంచి బయటకు వచ్చి భారత ప్రతినిధి కె.ఎం.మున్షీని కలిశాడు. అప్పటికే సమాచారసాధనాలు తెగిపోవడంతో ఎటూ అర్థంకాక కాళ్ళబేరానికి దిగాడు. లొంగుబాటుకు మించిన తరుణోపాయం లేదను మున్షీ చెప్పడంతో నిజాం ఒప్పుకోకతప్పలేదు. బొల్లారం వద్ద నిజాం నవాబు సర్దార్ పటేల్ ఎదుట తలవంచి లొంగిపోవడంతో సెప్టెంబరు 17, 1948న హైదరాబాదు రాజ్యం భారత యూనియన్‌లో విలీనమైంది. అప్పుడు ఇక్కడి ప్రజలకు అసలైన స్వాతంత్ర్యం లభించింది. నిజాం ప్రధాని లాయక్‌అలీని తొలిగించడమే కాకుండా ప్రజలకు నరకయాతన చూపించిన ఖాసింరజ్వీని అరెస్టు చేశారు. ఆ తర్వాత హైదరాబాదు అసెంబ్లీని రద్దుచేయబడింది. హైదరాబాదు రోడ్లమీద ఇక తలెత్తుకుతిరగలేమని భావించిన లాయక్‌అలీ, ఖాసింరజ్వీలు మూటాముల్లెలు సర్దుకొని పాకిస్తాన్ పారిపోయారు.
✂📎✒✏💣🔪?
?🔫🔫🔪🔫🔪🔪🔫
▶ఆపరేషన్ పోలో:◀
నిజాం సంస్థానంపై భారత ప్రభుత్వం జరిపిన సైనిక చర్యకు ఆపరేషన్ పోలో అని పేరు. జనరల్ జె.ఎన్.చౌదరి నేతృత్వంలో సెప్టెంబర్ 13, 1948న సైనిక చర్య మొదలైంది. సైన్యం రెండు భాగాలుగా విడిపోయి విజయవాడ నుంచి ఒకటి, బీదర్ దిశగా రెండోది కలిసింది. మొదటి రెండు రోజులు నిజాం సైన్యం తిరగబడినా ఆ తర్వాత క్షీణించింది. తాను ఓటమి అంచుల్లో ఉన్నట్లు గమనించి నిజాం నవాబు దిక్కుతోచని స్థితిలో లేక్‌వ్యూ అతిథి గృహంలో బంధించిన భారత ఏజెంట్ మున్షీని కలిసి లొంగిపోతున్నట్లు ప్రకటించాడు. దీనితో ఆపరేషన్ పోలో విజయవంతమైంది.సెప్టెంబర్ 13న జె.ఎన్.చౌదరి నాయకత్వాన ప్రారంభమైన దాడి సెప్టెంబర్ 17న నిజాం నవాబు లొంగిపోవడంతో ఆపరేషన్ పోలో పేరుతో చేపట్టిన చర్య పూర్తయింది. సెప్టెంబర్ 18న సైనిక చర్యకు నేతృత్వం వహించిన జె.ఎన్.చౌదరి సైనిక గవర్నర్‌గా పదవీ ప్రమాణం చేశారు. ఎం.కె.వెల్లోడి ప్రధానిగా నియమించబడ్డారు.
🙏ఉద్యమ స్పూర్తి ప్రధాతలు:🙏
తెలంగాణ సాయుధ పోరాటంలో పురుషులు, స్త్రీలు, పిల్లలు అనే తేడాలు లేకుండా తుపాకులు, బడిసెలు పట్టి రజాకార్ల మూకలను తరిమికొట్టారు. మహబూబ్ నగర్ జిల్లాలో అప్పంపల్లి, ఆదిలాబాదు జిల్లాలో నిర్మల్, సిర్పూర్, కరీంనగర్ జిల్లాలో మంథని, మహమ్మదాపూర్, నల్గొండ జిల్లాలో మల్లారెడ్డిగూడెం, నిజామాబాదు జిల్లా ఇందూరు, తదితర ప్రాంతాలలో పోరాటం పెద్దఎత్తున సాగింది. జమలాపురం కేశవరావు, లక్ష్మీనరసయ్య, ఆరుట్ల కమలాదేవి, రావి నారాయణరెడ్డి, ధర్మబిక్షం, చండ్ర రాజేశ్వరరావు, బద్దం ఎల్లారెడ్డి, మగ్దూం మొహియుద్దీన్ , షోయబ్ ఉల్లాఖాన్ , మల్లు స్వరాజ్యం, రాంజీగోండ్, విశ్వనాథ్ సూరి, దొడ్డి కొమరయ్య, బెల్లం నాగయ్య, చండ్ర రాజేశ్వరరావు, కిషన్ మోదాని తదితరులు తెలంగాణ విమోచనానికి కృషిచేశారు. వీరందరి కృషి, దాశరథి, కాళోజీల కవితల స్పూర్తితో సామాన్య ప్రజలు సైతం ఊరుఊరున, వాడవాడన నిజాం పాలనపై తిరగబడ్డారు. కర్రలు, బరిసెలు, గుత్పలు, కారం ముంతలు, వడిసెలను ఆయుధాలుగా మలుచుకొని పోరాడారు. బర్మార్లు, తుపాకులను సంపాదించుకొని యుద్ధరంగంలోకి దిగారు.
🔪🔪🔫🔪🔫🔪🔫

🌷💐🌻🌼🌲🌻

No comments:

Post a Comment

Featured Post

Fixation of Mutation Fee in Gram Panchayats in the State

GOVERNMENT OF TELANGANA ABSTRACT Panchayat Raj & Rural Development Department – Mutation Fee – Fixation of Mutation Fee ...

Popular Posts