ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం 1994 సెక్షను 72
పరిశ్రమల యజమానులు గాని, గృహసముదాయాల యజమానులు గాని తాము చెల్లించే ఇంటి పన్నులు గాని ఇతర పన్నులు గాని గ్రామపంచాయతీ తో రాజీ కుదుర్చుకొనుటకు ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టము 1994 లోని సెక్షను 72 వీలు కల్పించినది. దాని ప్రకారము జి.వో.నెం. 594 పంచాయతీరాజ్ గ్రామీణాభివృధ్ధి శాఖ తేది. 11-08-1995 ద్వార, రాజీ కుదుర్చుకొనుటకు నియమాలు జారీ కాబడినవి.
ఒప్పందము చేయదలచుకొన్న వ్యక్తి గాని, యజమాన్యము గాని ఆర్థికసంవత్సరము ప్రారంభము నుండి 60 రోజులలోగా అనుబంధము ఎ లో చూపిన నమూనాలో గ్రామపంచాయతీ కి ఈ క్రింద వివరించిన విషయాలను తెలుపుతు ధరఖాస్తు చేసుకోవాలి.
Ø గత మూడు సంవత్సరములలో గ్రామపంచాయతీకి చెల్లించిన పన్ను మొత్తం.
Ø మూడు సంవత్సరముల లోపు నిర్మించినవైతె గత సంవత్సరము చెల్లించిన పన్ను మొత్తం.
Ø ప్రస్తుత సంవత్సరము చెల్లించవలసిన పన్ను మొత్తం
Ø యజమాన్యము చే చేయబడిన సదుపాయముల వివరములు.
Ø సదుపాయములు చేసినందుకు గాను ప్రతిదానికి యజమాన్యముచే చేయబడిన ఖర్చుల వివరములు
Ø తమచే చేయబడిన ఖర్చులకు గాను పంచాయతీ కి చెల్లించుటకు ప్రతిపాదించిన పన్ను మొత్తం
Ø ప్రభుత్వమునకు సంబందించిన వాటికి మాత్రము చెల్లించు పన్ను మొత్తము గ్రామపంచాయతీని సంప్రదించి నిర్ణయించబడును.
Ø ధరఖాస్తు అందిన 60 రోజులలోగా క్రింద వివరించిన వాటిని పరిగణన లోనికి తీసుకొని గ్రామపంచాయతీ తన నిర్ణయాన్ని, ధరఖాస్తు దారుకు తెలపాలి.
Ø పంచాయతీ చేయవలసిన సదుపాయాలకు గాను యజమాన్యము చే చేయబడిన ఖర్చు మొత్తమునకు గాను, పంచాయతీకి రావలసిన మొత్తము పన్నులో రాజీ మొత్తం 50% కన్న తక్కువగా ఉండరాదు.
§ క్రొత్తగా నిర్మించిన భారీ మరియు మద్యతరహా పరిశ్రమలకు ఉత్పత్తి ప్రారంభించిన 5 సంవత్సరముల వరకు పన్నులో 70% చెల్లించాలి. ఇట్టి రాయితీ ఉత్పత్తి ప్రారంభించుటకు ముందు కూడా వర్తించును.
§ చిన్న తరహా వాటికి 60% చెల్లించాలి.
§ భారీ మరియు మద్య తరహా వాటికి 80% చెల్లించాలి.
Ø యజమాన్యమునకు పంచాయతీకి మద్య చెల్లింపు మొత్తంనకు ఏకాభిప్రాయము కుదిరినచో నియమాలకు జతచేయబడిన నమూనాలో ఒప్పందపు పత్రము వ్రాయించి దానితో పాటు యజమాని సమర్పించిన ధరఖాస్తు మరియు పంచాయతీ తీర్మాణము ప్రతితో పాటు సంబందిత జిల్లా కలెక్టరు గారికి పంపించాలి.
Ø జిల్లా కలెక్టరు గారు తన సూచనలతో ఒక నెల లోగా అట్టి ప్రతిపాదనలను ప్రభుత్వమునకు పంపించాలి.
Ø యజమానికి పంచాయతీకి మద్య జరిగిన ఒప్పందము (ప్రభుత్వము అనుమతినిచ్చినచో), ఒప్పందము కుదిరిన ఆర్థిక సంవత్సరము నుండి 3 సంవత్సరముల వరకు అమలులో ఉండును. ప్రభుత్వ అనుమతితో అట్టి ఒప్పందమును మరొక మూడు సంవత్సరముల వరకు పునరుధ్ధరణ చేయించుకొన వచ్చును.
Ø యజమానికి మరియు పంచాయతీకి మద్య చెల్లింపు మొత్తంలో ఒప్పందము కుదరనిచో, యజమాని గాని పంచాయతీ గాని జిల్లా కలెక్టరు గారి ద్వార ప్రభుత్వమునకు (ఆర్జీ) ధరఖాస్తు చేసుకొన వచ్చును. ఇట్టి విషయములో ప్రభుత్వమువారి దే తుది నిర్ణయముగా ఉండును
No comments:
Post a Comment