Important Pages for Administration of Panchayat

Saturday, March 22, 2025

Importance of Grama Sabha and It's Challenges

గ్రామసభ

ఏ దేశములో గాని ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం ప్రజల వద్ద నుండి పన్నుల రూపేణ నిధులు సమకూర్చు కొంటుంది. అంటె ప్రభుత్వం ప్రజల వద్ద నుండి పన్నుల ద్వార వసూలు చేయబడిన నిధులతోనే ప్రజల మౌళిక వసతులకు సంబంధించిన అవసరాలు తీర్చడానికి మరియు ఇతర సంక్షేమ పథకాలు అమలు చేయడానికి ఖర్చు పెడుతుంది. సమ సమాజ స్థాపనే లక్ష్యంగా ప్రతి ప్రభుత్వం పనిచేయాలి. కాని స్వాతంత్య్రము వచ్చినప్పటినుండి సమ సమాజ స్థాపన జరగక పోగా పేదరికానికి ధనిక వర్గానికి మద్య వ్యత్యాసము పెరుగుతూ పోతున్నది. దేశ సంపద ఏ కొద్దిమంది వ్యక్తుల వద్దే కేంద్రీకృతం అవుతున్నది అనేది జగమెరిగిన సత్యం. దీనికి ప్రధాన కారణము ప్రభుత్వం, పేద వర్గాల అభ్యున్నతి కొరకు ఖర్చు పెడుతున్న నిధుల గురించి పల్లె ప్రజానీకానికి ముఖ్యంగా పల్లెలో ఉంటున్న అణగారిన వర్గాల వారికి, వారి హక్కుల గురించి, ప్రభుత్వ పథకాల లో వారి అర్హత (హక్కుల) గురించి సరైన అవగాహన లేక పోవడమే ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. అందు కొరకు ప్రజలకు సాధికారత కల్పించడానికి భారత ప్రభుత్వము 73 వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి ప్రజలకు గల అధికారాన్ని గ్రామ సభను రాజ్యాంగములోని 243ఏ అధికరణమునందు పొందుపరచి గ్రామ సభకు రాజ్యాంగ బద్దత కల్పించింది. రాజ్యాంగ సవరణకు ముందు కూడా మన రాష్ట్ర ప్రభుత్వము గ్రామ పంచాయతీలలో గ్రామసభ గురించిన చట్టం చేయడం జరిగింది కాని పంచాయతీల పాలన కొరకు గ్రామసభ అని దానిని నిర్వహించవలసిన బాద్యత గ్రామపంచాయతీలదని ప్రజలు ఇంతకు ముందు అనుకునేవారు. కాని గ్రామసభలో ప్రజల బాధ్యత ఉందని దానిలో స్థానిక ప్రభుత్వము అయిన గ్రామ పంచాయతీల పని తీరును ప్రశ్నించవచ్చని ఏనాడు ప్రజలు అనుకోలేదు, కాబట్టి ప్రజలకు ఉన్న అధికారము వారికి తెలిసి రాలేదు. దాని ఉద్దేశము అప్పుడు, ఇప్పుడు కూడా పరిపాలన లో పారదర్శకత పెంపొందించడానికి, మరియు ప్రజలకు సాధికారత కల్పించడానికి ఉద్దేశించినది. కాని ప్రజలు మాత్రం గ్రామసభ నిర్వహించడం అనేది పంచాయతీకి సంబంధించినది అని మరియు ప్రభుత్వం వేరు ప్రజలు వేరు అని ఇంత వరకు అనుకుంటున్నారు మరియు ఇప్పటికీ కూడా చాలా మంది అదే భావనలో ఉన్నారు. రాజ్యాంగం ప్రకారము ప్రజా ప్రభుత్వములో ప్రజలే పాలకులని వారికేది కావాలో వారే నిర్ణయించుకునే అధికారము వారి కుందని చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు. ప్రజా ప్రతినిధులను ఎన్నుకోవడం అంటె వారికి (ప్రజలకు) బదులుగా పరిపాలించడానికి, ఇంకొకరికి ప్రజలు ఓటు ద్వార అధికారము కట్టబెడుతున్నారు. ఓటు ద్వార ఆ అధికారము పొందిన వారు, ముఖ్యంగా స్థానిక ప్రభుత్వ ప్రజా ప్రతినిధిగా గెలిచి స్థానిక ప్రభుత్వ అధికార పగ్గాలు చేపట్టిన వారు తమ ఆలోచనలకు, ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తున్నారా లేదా అని, పర్యవేక్షించే బాధ్యతను ప్రజలు మరిచి పోతున్నారు. ఆ పర్యవేక్షణకు సంబంధించిన ఏకైక అవకాశము గల వేదికే గ్రామసభ. అలాంటి గ్రామసభ కు గల అధికారాలు, దానిలో ఎవరు ఏ అంశాలకు బాధ్యులు అనే విషయాలను రాజ్యాంగ పరంగా సంక్రమించిన అధికారములు మరియు తెలంగాణ పంచాయతీ రాజ్‌ చట్టం, 2018 ద్వార సంక్రమించిన అధికారాల గురించి ప్రజా ప్రతినిధులకు, ప్రజలకు మరియు గ్రామస్థాయిలో పని చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు తెలియజేయాలనేదే ఈ వ్యాసం యొక్క ముఖ్య ఉద్దేశ్యము.

Contd. Page.2
Pages: 1 2 3


No comments:

Post a Comment