Important Pages for Administration of Panchayat
▼
Thursday, December 31, 2015
Saturday, December 12, 2015
Vacate Remission on House Tax in Grampanchayats
పట్టణాలలో పనులకోసం గాని తమ పిల్లల విద్యాభ్యాసము కొరకు కాని గ్రామాలలో గల తమ ఇండ్లను ఖాలీగా వదలి పట్టణాలకు చాలా మంది వలస వెళ్తుంటారు. కొంత మంది సంవత్సరాల తరబడి తమ స్వగ్రామాలకు రాని వారు చాలా మంది ఉంటారు మరి కొంత మంది పండుగలకో పబ్బాలకొ తమ స్వంత ఇంటిలో పండుగ చేసుకోవాలని తమ గ్రామాలకు వస్తుంటారు. అలా వలస వెళ్లిన వారికి గ్రామాలలో గల తమకు చెందిన నివాస గృహాలకు సంబందించి గ్రామపంచాయతీకి తాము చెల్లించవలసినన ఇంటి పన్ను గురించి చట్టములో మంచి వెసులుబాటు గలదు. ఈ వెసులు బాటు గురించి తెలియని పంచాయతీ కార్యదర్శులు గాని పంచాయతీ సిబ్బందిగాని పంచాయతీలకు రావలసిన ఇంటి పన్ను డిమాండు రిజిష్టర్లలో వారిపేరున డిమాండు వేసి, పట్టణాలకు వెళ్ళిన వారికి డిమాండు నోటీసులను ఇవ్వడానికి వారు సమయానికి అందుబాటులో లేక పోవడం వలన వారికి డిమాండు నోటీసులను ఇవ్వలేక తద్వార వారు ఇంటి పన్నుచెల్లించక పోవడం మూలాన పంచాయతీలలో ఇంటిపన్ను బకాయిలు ఈ రకంగా కూడా పేరుకుపోవడం చాలా అరుదు. అలాగే గ్రామాలలో ఉన్న తమ ఇంటిపన్ను గురించి సరైన సమాచారము పట్టణాలలో ఉన్నవారికి తెలియక వారు సకాలములో ఇంటిపన్ను చెల్లించలేక, వారికి పంచాయతీనుండి ఏదేని దృవీకరణ పత్రము అవసరమనకున్నపుడు పంచాయతీ కార్యదర్శులను సంప్రదించగా వారు పేరుకుపోయిన బకాయిలను చెల్లిస్తేనే తప్ప పంచాయతీ వారు దృవీకరణ పత్రము ఇవ్వలేమని తేల్చినపుడు పన్ను చెల్లించడం తమకు కూడా చాలా భారమనిపిస్తుంది. ఈ సమస్యలను దూరము చేయడానికి పంచాయతీరాజ్ చట్టంలో అవకాశము కలదు. దానినే వేకేట్ రెమిషను అని అంటారు. ఈ రాయితీని ఎలా ఉపయోగించుకోవాలో చూద్దాం
Wednesday, December 9, 2015
Thursday, December 3, 2015
Thursday, October 22, 2015
Wednesday, October 14, 2015
Tuesday, October 6, 2015
Thursday, September 17, 2015
💐🍁💐🍁💐🍁
తెలంగాణ విమోచనోద్యమం
❄☔☁❄☔☁❄
👉👉అప్పటి హైదరాబాదు రాజ్యంనిజాం నిరంకుశ పాళన నుంచి విముక్తి కోసం హైదరాబాదు సంస్థాన ప్రజలు 1946 నుంచి 1948 వరకు చేసిన వీరోచిత పోరాటమే తెలంగాణ విమోచనొద్యమము. రెండు వందల సంవత్సరాల పాలనలో దోపిడి, అణిచివేతలకు విమోచనోద్యమం తిరుగులేని సమాధానం చెప్పింది. అప్పటి హైదరాబాద్ సంస్థానంలో ప్రస్తుత తెలంగాణతో పాటు మరాఠ్వాడ (మహారాష్ట్ర), బీదర్ (కర్ణాటక) ప్రాంతాలు ఉండేవి. 3 భాషా ప్రాంతాలకు చెందిన మొత్తం 16 జిల్లాలకు గాను 8 జిల్లాలు తెలంగాణా ప్రాంతానికి చెందినవి కాగా, మరాఠా, కన్నడ ప్రాంతాలకు చెందినవి 8 జిల్లాలుండేవి. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిననూ నిజాం సంస్థానంలోని ప్రజలకు మాత్రం స్వాతంత్ర్యం లేకపోవడాన్ని ఇక్కడి ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. దేశమంతటా స్వాతంత్ర్యోత్సవాలతో ప్రజలు ఆనందంతో గడుపుచుండగా నిజాం సంస్థాన ప్రజలు మాత్రం నిరంకుశ బానిసత్వంలో కూరుకుపోయారు. హైదరాబాదు రాజ్యాన్ని పాలిస్తున్న ఏడవ నిజామ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ రాజ్యాన్ని సొంతం చేసుకోవడానికి విశ్వప్రయత్నం చేస్తూ రజాకార్లను ఉసిగొల్పాడు. నిజాంకు అండగా ఖాసిం రజ్వీ నేతృత్వంలోని రజాకార్లు గ్రామాలపైబడి దోపిడిచేయడం, ఇండ్లు తగలబెట్టడం నానా అరాచకాలు సృష్టించారు. అతని మతోన్మాద చర్యలు కోరలాల్చి వెయ్యి నాల్కలతో విషంకక్కాయి. హీనమైన బతుకులు వెళ్ళదీస్తున్న జనం గురించి అస్సలు పట్టించుకోకుండా ప్రజల నుండి బలవంతంగా వసూలుచేసుకున్న సొమ్ముతో విలాసాలు, జల్సాలు, భోగభాగ్యాలు చేసుకొనేవారు. దీనితో రామానందతీర్థ నేతృత్వంలో ఆర్యసమాజ్ ఉద్యమాలు, కమ్యూనిష్టుల ఆధ్వర్యంలో సాయుధపోరాటాలు ఉధృతమయ్యాయి. మొదట నల్గొండ జిల్లాలో ప్రారంభమైన ఉద్యమం శరవేగంగా నైజాం సంస్థానం అంతటా విస్తరించింది. రావి నారాయణరెడ్డి, చండ్ర రాజేశ్వరరావు, మల్లు స్వరాజ్యం, ఆరుట్ల కమలాదేవి, బొమ్మగాని ధర్మభిక్షం, మాడపాటి హనుమంతరావు, దాశరథి కృష్ణమాచార్య, కాళోజి నారాయణరావు, షోయబుల్లాఖాన్, సురవరం ప్రతాపరెడ్డి తదితర తెలంగాణ సాయుధ పోరాటయోధులు వారికి స్పూర్తినిచ్చే కవులు, రచయితలు మూలంగా 1948లో ఉధృతరూపం దాల్చి చివరికి భారత ప్రభుత్వం సైనిక చర్యతో నైజాం సంస్థానాన్ని సెప్టెంబర్ 17, 1948న భారత్ యూనియన్‌లో విలీనం చేసుకుంది.

Friday, August 28, 2015
Tuesday, August 18, 2015
14వ ఆర్థిక సంఘం నిధులు
14వ ఆర్థిక సంఘం నిధులు
14 వ ఆర్థిక సంఘం నివేదిక ద్వార ఎన్నో సూచనలు చేయబడినప్పటికి స్థానిక ప్రభుత్వాలలో చివరి స్థాయి అయిన గ్రామపంచాయతీలకు మరియు మున్సిపాలిటీలకు నేరుగా మొత్తం నిధులను విడుదల చేయాలనడంలో సరైన కారణం లేకపోలేదు. కేంద్ర ప్రభుత్వమునకు గాని రాష్ట్ర ప్రభుత్వమునకు గాని పన్నుల ద్వార వచ్చే మొత్తంలో అధిక శాతం స్థానిక సంస్థల పరిధిలో నివసించు ప్రజల వద్దనుండే అని అనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకొరకు ఆయా ప్రాంతాలలో నివసించు ప్రజల భవితవ్యం తేల్చేది కూడా ఆ స్థానిక ప్రభుత్వాలే. కేంద్రమైనా, రాష్ట్రమైనా, జిల్లా అయినా, ఆఖరకు మండలమైనా చేయవలసిన అభివృధ్ధి గ్రామస్థాయి( స్థానిక స్థాయి) లోనే అన్నది జగమెరిగిన సత్యం. ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభుత్వాధినేతలు కావున వారి భవిష్యత్తును మరియ అభివృధ్దిని నిర్ణయించేది ప్రజలే. కావున ప్రజలు పన్ను రూపేన చెల్లించిన ధనమును తిరిగి వారి భవిష్యత్తు కొరకు వారి చేతనే వారు నిర్ణయించిన విధానములో ఖర్చు చేయమని సూచించిన విషయము ప్రజాస్వామ్యంలో ఒక విశిష్టమైన పరిణామం.