Important Pages for Administration of Panchayat

Saturday, December 12, 2015

Vacate Remission on House Tax in Grampanchayats

పట్టణాలలో పనులకోసం గాని తమ పిల్లల విద్యాభ్యాసము కొరకు కాని గ్రామాలలో గల తమ ఇండ్లను ఖాలీగా వదలి పట్టణాలకు చాలా మంది వలస వెళ్తుంటారు. కొంత మంది సంవత్సరాల తరబడి తమ స్వగ్రామాలకు రాని వారు చాలా మంది ఉంటారు మరి కొంత మంది పండుగలకో పబ్బాలకొ తమ స్వంత ఇంటిలో పండుగ చేసుకోవాలని తమ గ్రామాలకు వస్తుంటారు. అలా వలస వెళ్లిన వారికి గ్రామాలలో గల తమకు చెందిన నివాస గృహాలకు సంబందించి గ్రామపంచాయతీకి తాము చెల్లించవలసినన ఇంటి పన్ను గురించి చట్టములో మంచి వెసులుబాటు గలదు. ఈ వెసులు బాటు గురించి తెలియని పంచాయతీ కార్యదర్శులు గాని పంచాయతీ సిబ్బందిగాని పంచాయతీలకు రావలసిన ఇంటి పన్ను డిమాండు రిజిష్టర్లలో వారిపేరున డిమాండు వేసి, పట్టణాలకు వెళ్ళిన వారికి డిమాండు నోటీసులను ఇవ్వడానికి వారు సమయానికి అందుబాటులో లేక పోవడం వలన వారికి డిమాండు నోటీసులను ఇవ్వలేక తద్వార వారు ఇంటి పన్నుచెల్లించక పోవడం మూలాన పంచాయతీలలో ఇంటిపన్ను బకాయిలు ఈ రకంగా కూడా పేరుకుపోవడం చాలా అరుదు. అలాగే గ్రామాలలో ఉన్న తమ ఇంటిపన్ను గురించి సరైన సమాచారము పట్టణాలలో ఉన్నవారికి తెలియక వారు సకాలములో ఇంటిపన్ను చెల్లించలేక, వారికి పంచాయతీనుండి ఏదేని దృవీకరణ పత్రము అవసరమనకున్నపుడు పంచాయతీ కార్యదర్శులను సంప్రదించగా వారు పేరుకుపోయిన బకాయిలను చెల్లిస్తేనే తప్ప పంచాయతీ వారు దృవీకరణ పత్రము ఇవ్వలేమని తేల్చినపుడు పన్ను చెల్లించడం తమకు కూడా చాలా భారమనిపిస్తుంది. ఈ సమస్యలను దూరము చేయడానికి పంచాయతీరాజ్ చట్టంలో అవకాశము కలదు. దానినే వేకేట్ రెమిషను అని అంటారు. ఈ రాయితీని ఎలా ఉపయోగించుకోవాలో చూద్దాం