Important Pages for Administration of Panchayat

Tuesday, August 18, 2015

14వ ఆర్థిక సంఘం నిధులు

    14వ ఆర్థిక సంఘం నిధులు
14 వ ఆర్థిక సంఘం నివేదిక ద్వార ఎన్నో సూచనలు చేయబడినప్పటికి స్థానిక ప్రభుత్వాలలో చివరి స్థాయి అయిన గ్రామపంచాయతీలకు మరియు మున్సిపాలిటీలకు నేరుగా మొత్తం నిధులను విడుదల చేయాలనడంలో సరైన కారణం లేకపోలేదు. కేంద్ర ప్రభుత్వమునకు గాని రాష్ట్ర ప్రభుత్వమునకు గాని పన్నుల ద్వార వచ్చే మొత్తంలో అధిక శాతం స్థానిక సంస్థల పరిధిలో నివసించు ప్రజల వద్దనుండే అని అనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకొరకు ఆయా ప్రాంతాలలో నివసించు ప్రజల భవితవ్యం తేల్చేది కూడా ఆ స్థానిక ప్రభుత్వాలే. కేంద్రమైనా, రాష్ట్రమైనా, జిల్లా అయినా, ఆఖరకు మండలమైనా చేయవలసిన అభివృధ్ధి గ్రామస్థాయి( స్థానిక స్థాయి) లోనే అన్నది జగమెరిగిన సత్యం. ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభుత్వాధినేతలు కావున వారి భవిష్యత్తును మరియ అభివృధ్దిని నిర్ణయించేది ప్రజలే. కావున ప్రజలు పన్ను రూపేన చెల్లించిన ధనమును తిరిగి వారి భవిష్యత్తు కొరకు వారి చేతనే వారు నిర్ణయించిన విధానములో ఖర్చు చేయమని సూచించిన విషయము ప్రజాస్వామ్యంలో ఒక విశిష్టమైన పరిణామం.