నూతనముగ ఏర్పడిన తెలంగాణా రాష్ట్రములో మన ఊరు మన ప్రణాలిక కార్యక్రమం ప్ర జల ద్వార ప్రణాళికలు తయారు చేయుటకు రాష్ట్ర ప్రభుత్వము ఆదేశాలు జారి చేసిన దానికి అనుగుణంగా ప్రతి గ్రామములో ఆ గ్రామానికి సంబందించిన తయారు చేయుటకు ప్రతి గ్రామములో ప్రణాళికలు తయారు చేయుటలో ప్రతి స్థాయి ఉద్యొగి మరియు ప్రజలు కలసి కట్టుగా పనిచేస్తేనే తప్ప ప్రజల ప్రణాళికలు తయారు కావు. ప్రజల భాగస్వామ్యం లేకుండా, ప్రజల మనోభావాలను పరిగణలోనికి తీసుకోకుండా, ఆ ప్రాంతము (వార్డు గాని, పంచాయతీ గాని ,మండలము గాని లేక జిల్లా) యొక్క నాయకుల ఇష్లానుసారము చేసిన, ప్రణాళికలు ఇంతకుముందు చేసిన కేంద్రీకృత ప్రణాళికల మాదిరిగానే ఉండగలవు తప్ప అందులో ఏ మాత్రము తేడా రాదు. అందుకొరకు ప్రణాళికల విషయములో ప్రజలలో వీలయినంత మేర చర్చ జరగాలి. అందుకు తగిన అవకాశము సమయము అక్కడి నాయకత్వం ప్రజలకు కల్పించాలి. గ్రామసభలలో ప్రజల అవసరాలు అనే బలహీనతను ఆసరాగా చేసుకుని, వారి వద్దనుండి ధరఖాస్లులను తీసుకొని, గ్రామసభలను ముగిస్తే జరిగేది వికేంద్రీకృత అభివృధ్ది ప్రణాళిక కాదు. దానిని ఏకవ్యక్తి ప్రణాళిక లేకపోతె రాజరికపు వ్యవస్థలో జరిగిన ప్రణాలికల మాదిరగానే కేంద్రీకృత ప్రణాళిక మాదిరిగానే ఉండగలదు