అవిభక్త ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణా జిల్లాలోని ఉద్యోగులకు, ముఖ్యంగా గ్రామపంచాయతీలలో తాత్కాలిక పద్దతిలో మరియు స్థిరవేతనము పై పనిచేయుచున్న ఉద్యోగులకు తీవ్ర అన్యాయము జరిగిందనడానికి చాలా నిదర్శణాలు కలవు. అప్పటి ప్రభుత్వములో స్థిరవేతనము పై మరియు కాంటింజెంట్ వేతనముల పై పనిచేయు చున్న ఉద్యోగులను క్రమబద్దీకరించి వారికి స్కేలు మంజూరి చేయుటకు గాను. ప్రభుత్వము వారు 212 మరియు 112 జి.వోల. ద్వార ఉత్తర్వులు జారిచేసినారు. కాని అట్టి ఉత్తర్వుల ద్వార లాభ పడింది తెలంగాణా జిల్లాల లోని ఉద్యోగులకంటె ఆంధ్ర ప్రాంత జిల్లాల వారే ఎక్కువ అని చెప్పవచ్చు. తెలంగాణ ప్రాంతములో స్థిరవేతనము పై మరియు కాంటింజెంట్ వేతనముల పై పనిచేయు చున్న ఉద్యోగులను క్రమబద్దీకరించే అధికార వర్గము ప్రభుత్వము జారి చేసిన జి.వోలను మరియు వాటికనుగుణంగా జారిచేసిన వివరణల ఉత్తర్వులను, తెలంగాణా ప్రాంత ఉద్యోగులకు అన్వయించుటలో ఒక విధంగా, వాటినే ఆంధ్రప్రాంతము వారికి అన్వయించుటలో చూపిన తారతమ్యము వలన తెలంగాణ ప్రాంత గ్రామపంచాయతీల లో తాత్కాలిక మరియు స్థిరవేతనము పై పని చేయుచున్నవారికే గాక, పనిచేస్తు చనిపోయిన ఉద్యోగులకు తీవ్ర అన్యాయము జరిగినది.
ఖమ్మం జిల్లాలో పంచాయతీ రాజ్ సంస్థలో తాత్కాలిక పద్దతిలో పనిచేయుచున్న ఉద్యోగిని క్రమబద్దీకరించడానికి మీనమేషాలు లెక్కించిన అధికారవర్గమును ఎదిరించి తనకు న్యామయు చేయవలసినదిగా, దేశములోని అత్యున్నత న్యాయస్థానమును ఆశ్రయించితే గాని అతని సర్వీసును క్రమబద్దీకరించని ప్రభుత్వ యంత్రాంగము (జి.వో కొరకు ఖమ్మం జి్ల్లాలోని నియామకం లింకు పై క్లిక్ చేయండి), ఆంధ్ర ప్రాంతములోని కృష్ణా జిల్లాలోని తిరువూరు గ్రామ పంచాయతీలో తాత్కాలిక వేతనముపై పని చేయుచున్న బోర్ మెకానిక్కును అతను చనిపోయిన 6 సంవత్సరముల తర్వాత అతను పనిచేయుచున్న ఉద్యోగమును క్రమబద్దీకరించి, అతని భార్యను, ఆమెకు ఉన్న విద్యార్హతల కు తగిన ఉద్యోగములో నియమించుటకు ఆదేశాలు జారిచేయుటను ఏ విధంగా అర్థము చేసుకోవాలి. (జి.వో. కొరకు క్రిష్ణా జిల్లాలో క్రమబద్దీకరణ లింకు పై క్లిక్ చేయండి). అలా క్రమబద్దీకరణ జేయడమే కాకుండా, అక్కడి వారికి అనగా ఆ జిల్లా లోని గ్రామపంచాయతీలలో పనిచేయుచున్న వారికి ప్రత్యేకముగా, వేతన బఖాయాలను చెల్లించుటకు గాను ప్రభుత్వ నిధులనుండి ఒక కోటి డెబ్బది ఆరు లక్షల రూపాయలను కూడా విడుదల చేయడము జరిగినది.(జి.వో.కొరకు క్రిష్ణా జిల్లాలో 87 గ్రామపంచాయతీల ఉద్యోగు ప్రత్యేకంగా వేతనాలు విదుడల లింకుపై క్లిక్ చేయండి). అంటె వడ్డించె వారు మనవారైతె మనం ఏ పంక్తిలో ఉన్నా మనకు వడ్డన అందుతుంది అన్న ఆర్యోక్తి నిజమైంది. ఈ విధంగా చనిపోయిన వారు, వయసు పై బడి మానేసిన వారు, రిటైర్మెంటు వయసు చేరుకున్నారని ఉద్యోగములో నుండి తొలగించబడిన వారు తెలంగాణ జిల్లాలో వేల మంది ఉన్నారు. ప్రజల ఆరోగ్యము కాపాడుట కోసం, తమ ఆరోగ్యాన్ని ఫణంగా పెట్టి, సమాజానికి శాయశక్తులా తమ సేవలందించి, చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు ఏ దారి చూపని వారు చనిపోగా మిగిలిన వారి కుటుంబ సభ్యులు, వయసు పైబడిన కారణంగా తొలగించిన వారు, తమ కుటుంబ సభ్యులకు భారమై, దుర్భర జీవితాన్ని కొనసాగిన్నవారు తెలంగాణాలో చాలా మంది ఉన్నారు. వీరిక సహాయము చేయుటకు, ప్రభుత్వ ఉత్తర్వులు లేని కారణంగా దిగువ స్థాయి అధికారవర్గము కూడా నిస్సహాయత వ్యక్తం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రస్థుతము తెలంగాణా ప్రభుత్వము తెలంగాణా జిల్లాలోని గ్రామపంచాయతీలో తాత్కాలిక పద్దతిలో గాని, స్థిర వేతనము పై పని చేయుచున్న వారి, పనిచేస్తు చనిపోయిన వారి కుటుంబ సభ్యుల, వయసు పైబడిన కారణంగా ఉద్యోగమునుండి తీసివేసిన వారి జీవితాలు బాగుపడేవిధంగా, ప్రస్థుత ప్రభుత్వము ఆలోచించి తగిన చర్యలు తీసుకుంటుందని ఆశిద్దాము.
No comments:
Post a Comment